https://oktelugu.com/

Venu Swmy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి హై కోర్టులో ఊరట..జర్నలిస్ట్ కి కోలుకోలేని షాక్!

ఈ సందర్భంగా మహిళా కమీషన్ వేణు స్వామి కి హై కోర్టు ద్వారా నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని, 22 వ తారీఖున కోర్టుకి హాజరు కావాలని వేణు స్వామి ని ఆదేశించగా, నేడు ఆయన కోర్టుకి హాజరై వివరణ ఇచ్చాడు. ఆయన వివరణకు సమ్మతించిన హై కోర్టు, సమన్లపై స్టే విధించింది. దీంతో ప్రస్తుతం వేణు స్వామి కి కాస్త ఊరట లభించింది.

Written By:
  • Vicky
  • , Updated On : August 22, 2024 / 05:18 PM IST

    Venu Swamy

    Follow us on

    Venu Swmy :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలకు వేణు స్వామి అంటే ఎవరో తెలియకుండా ఉండదు. సోషల్ మీడియా ని రెగ్యులర్ గా అనుసరించే ప్రతీ ఒక్కరికి ఆయన సుపరిచితమే. ఎల్లప్పుడూ సెలెబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాల్లో దోషాలు ఉన్నాయని, వాళ్ళు విడిపోతారని కామెంట్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉండే వేణు స్వామి, నాగ చైతన్య – శోభిత నిశ్చితార్థం చేసుకున్న వెంటనే వాళ్ళిద్దరి జాతకాలను వివరిస్తూ, పెళ్ళైన మూడేళ్లకే వాళ్ళు విడిపోతారంటూ కామెంట్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయం పై ఆయన మీద సోషల్ మీడియా లో పెద్దఎత్తున ట్రోల్ల్స్ నడుస్తూనే ఉన్నాయి. అయితే రీసెంట్ గా జర్నలిస్ట్ మూర్తి వివాదం లో కూడా వేణు స్వామి ట్రెండింగ్ లో ఉన్నాడు.

    ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే, నాగ చైతన్య – శోభిత విడిపోతారంటూ వేణు స్వామి చేసిన కామెంట్స్ పై తెలుగు సినిమా ఇండస్ట్రీ తరుపున తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ కౌన్సిల్ సభ్యులు మహిళా కమీషన్ కి వేణు స్వామిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా మహిళా కమీషన్ వేణు స్వామి కి హై కోర్టు ద్వారా నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని, 22 వ తారీఖున కోర్టుకి హాజరు కావాలని వేణు స్వామి ని ఆదేశించగా, నేడు ఆయన కోర్టుకి హాజరై వివరణ ఇచ్చాడు. ఆయన వివరణకు సమ్మతించిన హై కోర్టు, సమన్లపై స్టే విధించింది. దీంతో ప్రస్తుతం వేణు స్వామి కి కాస్త ఊరట లభించింది. కానీ వేణు స్వామి కి జర్నలిస్ట్ మూర్తి గండం నుండి తప్పించుకోవడం అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే మూర్తిపై వేణు స్వామి దంపతులు చేసిన ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లేవు. అంతే కాకుండా తనపై చేసిన ఆరోపణలపై జర్నలిస్ట్ మూర్తి స్పందించిన తీరు చూస్తుంటే అతని తప్పేమి లేదని స్పష్టంగా సామాన్యులకు సైతం అర్థం అవుతుంది. అందుకే మూర్తి పోలీసులకు వేణు స్వామి దంపతులపై ఫిర్యాదు చేసాడు. ఒకవేళ మూర్తి నిజంగానే ఈ దంపతులిద్దరినీ 5 కోట్లు ఇవ్వమని బెదిరించి ఉంటే, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి.

    కానీ వీళ్ళిద్దరూ ఆ పని చెయ్యలేదు, కేవలం జర్నలిస్ట్ మూర్తిపై బట్ట కాల్చి ముఖం మీద వేసినట్టు ఒక ఆరోపణ చేసి వీడియో వదిలారు. ఆ తర్వాత మూర్తి రియాక్షన్ పైన వేణు స్వామి దంపతులు ఇప్పటి వరకు ఎలాంటి కౌంటర్ కూడా ఇవ్వలేకపోయారు. ఏ విధంగా చూసిన మూర్తిపై వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేసినట్టు స్పష్టమవుతుంది. చట్టపరంగా మూర్తి వెళ్తున్నాడు కాబట్టి వేణు స్వామి పరువు నష్టం దావా కింద మూల్యం చెల్లిచుకోక తప్పేలా లేదు. సోషల్ మీడియా లో నెటిజెన్స్ కూడా వేణు స్వామి పై సానుభూతి చూపించడం లేదు. మరి రాబొయ్యే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.