Urea Shortage In Telangana: తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు యూరియా చుట్టూ తిరుగుతున్నాయి. యూరియా సరైన స్థాయిలో సరఫరా కాకపోవడంతో తెలంగాణ రైతులు ఇబ్బంది పడుతున్నారు. కేంద్రం డిమాండ్ కు తగ్గట్టుగా యూరియా సప్లై చేయకపోవడంతో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. వాస్తవానికి యూరియా సరఫరా చేయడం లేదని బిజెపి పార్లమెంట్ సభ్యుడు చెప్పినప్పటికీ.. గులాబీ పార్టీ మీడియా రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తోంది. తన అనుకూల సోషల్ మీడియా గ్రూపుల ద్వారా ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. ఇవేవీ తెలియని రైతులు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని చెప్పుకుంటున్నారు.
Also Read: ఎమ్మెల్యే హత్యకే కుట్ర.. ఏపీలో రెచ్చిపోతున్న రౌడీషీటర్లు
స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో యూరియా కొరతను సాకుగా మార్చుకొని.. ఎన్నికల్లో లబ్ధి పొందాలని భారత రాష్ట్ర సమితి చూస్తోంది. ఇదే అదునుగా ఎరువు కష్టాలకు కారణం రేవంత్ ప్రభుత్వం అని ప్రొజెక్ట్ చేస్తోంది. దానికి తగ్గట్టుగానే కొంతమంది రైతులతో నెగిటివ్ కామెంట్స్ చేయించి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయిస్తున్నది.. దురదృష్టవషత్తు ఇలాంటి ప్రచారానికి అడ్డుకట్ట వేసి.. గట్టి కౌంటర్లు ఇవ్వాల్సిన అధికార పార్టీ సోషల్ మీడియా నిశ్శబ్దంగా ఉండిపోయింది. భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఎండ కట్టడంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విఫలం అవుతూనే ఉంది. ఆ పార్టీ సోషల్ మీడియా ఎప్పటికీ మేల్కొంటుంది.. ఎప్పుడు గట్టి కౌంటర్లు ఇస్తుందో అంతు పట్టకుండా ఉంది.
స్థానిక ఎన్నికల ముందు రైతులు పడుతున్న యూరియా కష్టాలు అధికార పార్టీకి ప్రతిబంధకంగా మారుతాయి అని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే రైతులకు యూరియా సప్లై చేసింది ఎవరనేది తెలియదు. పైగా తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు పెరిగిపోయిన నేపథ్యంలో యూరియా కు విపరీతమైన డిమాండ్ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కేంద్రం కావలసిన స్థాయిలో యూరియా సప్లై చేయడం లేదని అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే కేవలం తెలంగాణలో మాత్రమే కాదని.. దేశ వ్యాప్తంగా యూరియా కొరత ఉందని బిజెపి నాయకులు అంటున్నారు. అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల యూరియా కొరత నెలకొందని.. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని బిజెపి నాయకులు అంటున్నారు.. అయితే రైతులు మాత్రం యూరియా కోసం ఎదురుచూసి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి.. కావలసిన ఎరువులను తెలంగాణకు తీసుకొస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఇదే తీరు కొనసాగిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిభంధకం తప్పదు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే కంటే ముందు రేవంత్ ఈ సమస్యను పరిష్కరిస్తే సరిపోతుంది.
కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో అతనికి రూ.3000 ఇస్తే 10 బస్తాలు తెచ్చి ఇంటి దగ్గర వేసి పోయేవాడు
ఇప్పుడు ఒక్క బస్తా కోసం 20 రోజుల నుండి తిరుగుతున్నా
మార్పు మార్పు అంటే పాత రోజులను తీసుకొచ్చాడు pic.twitter.com/bYvE3LYjfJ
— Telugu Scribe (@TeluguScribe) August 29, 2025