Clove: లవంగాలు తినడం చాలా మందికి అలవాటు. ఏదైనా తిన్న వెంటనే మౌత్ ఫ్రెషనర్‌గా కూడా చాలా మంది లవంగాలు తింటుంటారు. కొందరు ఆరోగ్యానికి మంచిదని తింటారు. అయితే లవంగాలు ఆరోగ్యానికి మంచిదే అయినా.. ఈ తప్పులు చేయొద్దని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అవేంటో తెలుసుకుందాం.
లైంగిక సామర్థ్యం పెంపు..
ఇక లవంగాలు తినడం వలన లైంగిక సామర్థ్యం పెరుగుతుందని ఆరోగ్య నిపుణలు పేర్కొంటారు. అంటు వ్యాధులు, కాలేయ సమస్య రక్తంలో చక్కెర నియంత్రణకు లవంగం చాలా మంచిది అంటారు.
లాభాలు ఇవీ…
లవంగాలు వేడిచేస్తాయనే ఉద్దేశంతో రోజూ వాడం. మసాలా కర్రీలు వండుకునేప్పుడు వాడుతుంటాం. కానీ లవంగాల్లో బయోయాక్టివ్ గుణాలున్నాయి. అందువల్ల వీటిని రోజు వాడాలని సూచిస్తారు.
= లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్, ఫెనోలిక్ గుణాలు ఉంటాయి. సీ విటమిన్ కూడా ఉంటుంది. ఇవి మన శరీరంలోని విష వ్యర్థాలు తిలగిస్తాయి. ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.
= లవంగాల్లో యూజెనాల్ అనే తైలం ఉంటుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు రెగ్యులర్‌గా లవంగాలు వాడడం వలన ఉపశమనం కలుగుతుంది.
= పేస్టుల తయారీలో లవంగాలను వాడడం యాడ్స్‌లో చూస్తుంటాం. యూజెనాల్ తైలం యాంటిసెప్టిక్‌లా పనిచేసి చిగుళ్లను కాపాడుతుంది. నోట్లోని రకరకాల సమస్యలను పోగొడుతుంది. హానికర బ్యాక్టీరియాను చంపేస్తుంది.
= మన పొట్టలోపల అంతా క్లీన్ చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్, పొట్ట ఉబ్బరం, అజీర్తిని తగ్గిస్తాయి. జీర్ణరసాలు ఊరేలా చేస్తాయి.
= రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో లవంగాలు పనిచేస్తాయి. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. అని కూడా అంటారు. టైప్–2 డయాబెటిస్ రాకుండా లవంగాలు పనిచేస్తాయి.
= లవంగాల్లో యూజెనాల్ అయిల్ బ్రెయిన్ కణాలకు టెన్షన్ తగ్గిస్తాయి. బ్రెయిన్ హీట్ ఎక్కకుండా చేస్తాయి. నాడీ సంబంధ సమస్యలు రాకుండా కాపాడతాయి.
జాగ్రత్తలు ఇవీ..
= గర్భిణులు, చిన్నారులు లవంగాలు తినకపోవడం చాలా మంచింది. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
= గ్యాస్ ట్రబుల్ సమస్య ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు లవంగాలు వాడుకోవాలి. లేదంటే సమస్య తీవ్రం అవుతుంది.
= రక్తస్రావం అయ్యే అవకాశం ఉన్నవారు కూడా లవంగాలను తినకూడదు. లివర్ సమస్యలు ఉన్నవారు కూడా లవంగాలు తినకూడదు.
= లవంగాలు రోజూ తినడం మంచిదే అయినా అతిగా తింటే లేనిపోని సమస్యలు వస్తాయి. కాబట్టి లవంగాలు తినే విషయంలో జాగ్రత్తలు అవసరం.