TV5 Sambasiva Rao: పాత్రికేయులు వార్తలు మాత్రమే చదవాలి. సమాజంలో జరుగుతున్న సంఘటనలను ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు చూపించాలి. అప్పుడే ఆ పాత్రికేయులకు ప్రజల్లో గౌరవం ఉంటుంది. సమాజంలో ఒక స్థాయి ఉంటుంది. వెనుకటి కాలంలో పాత్రికేయులు వార్తలను వార్తల మాదిరిగానే ప్రపంచానికి చూపించేవారు. తద్వారా నాటి రోజుల్లో పాత్రికేయమనేది సమాజానికి టార్చ్ బేరర్ లాగా ఉండేది. పాత్రికేయులకు కూడా విపరీతమైన గౌరవం ఉండేది. కొన్ని సందర్భాలలో ప్రజాప్రతినిధుల కంటే పాత్రికేయులకే ప్రజలు విలువ ఇచ్చేవారు గౌరవాన్ని ప్రదర్శించేవారు.
ఇప్పటి కాలంలో పాత్రికేయులకు విలువలేదు వార్తాపత్రికలు న్యూస్ చానల్స్ పార్టీలకు డబ్బా కొట్టే వ్యవస్థలు మాదిరిగా మారిపోయాయి దీంతో ఆ చానల్స్ యాజమాన్యాల కు తగ్గట్టుగా పాత్రికేయులు పనిచేయడం మొదలుపెట్టారు ఒకరకంగా కండువా వేసుకోకుండా పార్టీ కార్యకర్తలుగా మారిపోయారు కొన్ని సందర్భాలలో పార్టీ కార్యకర్తలను మించి తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు పాత్రికేయులు దీంతో ఒక ఛానల్ ప్రతినిధి కనుక ప్రజల్లో కనిపిస్తే మీది ఏ సంస్థ అనే ప్రశ్నకు బదులుగా మీరు ఫలానా పార్టీకి సపోర్ట్ కదా అనే సమాధానం ప్రజల నుంచి వస్తోంది దీనినిబట్టి పాత్రికేయం ఏ స్థాయిలో దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు ఇక పార్టీకి అనుకూలంగా పనిచేసే చానల్స్ లో పనిచేసే పాత్రికేయులు అంతకుమించి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కొన్ని సందర్భాలలో వారు తమ నిగ్రహాన్ని కోల్పోయి ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు అంతేకాదు తమను తాను పాత్రికేయ దిగ్గజాలుగా చెప్పుకుంటున్నారు అటువంటి వారిలో టీవీ5 ఛానల్ లో పనిచేసే సాంబశివరావు ఒకరు.
సాంబశివరావు సుదీర్ఘ పాత్రికేయ అనుభవం ఉన్న వ్యక్తి. ఆయనను ఆయన దిగ్గజ పాత్రికేయుడు అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ కొన్ని సందర్భాలలో ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటారు. నిగ్రహాన్ని కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా వైసిపి ప్రస్తావన వచ్చినప్పుడు సాంబశివరావు ఒక్కసారిగా తన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తుంటారు. టీవీ 5 ఛానల్ లో కూర్చొని సవాలు విసురుతుంటారు. అంతే కాదు, దేనికంటే దానికి సిద్ధమని సంకేతాలు ఇస్తుంటారు. ఇటీవల కాలంలో సాంబశివరావు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారు. దీంతో సాంబశివరావు విపరీతమైన కోపం వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన పలు సందర్భాలలో వైసీపీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు దేనికంటే దానికి సిద్ధమని సవాల్ కూడా విసిరారు. అటు వైసిపి కార్యకర్తలు కూడా అదే స్థాయిలో స్పందించారు.
ఇటీవల సాంబశివరావు ప్రైమ్ టైం లో వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ఇక్కడితో ముగిద్దాం అని అన్నారు లేని పక్షంలో దేనికంటే దానికి సిద్ధమని సంకేతాలు పంపించారు. దీంతో మరోసారి సాంబశివరావు వర్సెస్ వైసీపీ కార్యకర్తలు” గా సోషల్ మీడియాలో పరిస్థితి మారిపోయింది. ఎప్పటిలాగానే వైసీపీ కార్యకర్తలు సాంబశివరావు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారు. సాంబశివరావు హెచ్చరించినప్పటికీ వైసీపీ కార్యకర్తలు ఆగడం లేదు. దీంతో అటు సాంబశివరావు, ఇటు వైసిపి కార్యకర్తల మధ్య యుద్ధం ఆగదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
మీరు ఇంతగా సీరియస్ అయ్యి స్ట్రీట్ ఫైట్ వస్తారు అనుకొలెదు!!.. సారీ సార్ !! pic.twitter.com/e0z2diKzjK
— The Samosa Times (@Samotimes2026) November 26, 2025