https://oktelugu.com/

Venu Swamy vs TV5 Murthy : నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు..నాకు ఆత్మహత్య తప్ప మరో దారి లేదు: వేణు స్వామి

ముందుగా వేణు స్వామి మాట్లాడుతూ ' నన్ను జర్నలిస్టు మూర్తి గారు 2017 వ సంవత్సరం లో మహా టీవీ లో ఉన్నప్పుడు నా మీద దాడి చెయ్యడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన టీవీ 5 లో ఉన్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : August 19, 2024 / 08:21 PM IST

    TV5 Murthy blackmailed Rs.5 crores. Video release of Venu Swamy's sensational allegations

    Follow us on

    Venu Swamy vs TV5 Murthy : ప్రముఖ సెలెబ్రిటీల జాతకాలు చెప్తూ ఎల్లప్పుడూ వివాదాల్లో ఉండే వేణు స్వామి గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఆయన చెప్పిందల్లా జరుగుతుంది అని నమ్మే వాళ్ళు ఉన్నారు, ఇతను ఒక దొంగ జ్యోతిష్యుడు అని నమ్మేవాళ్ళు ఉన్నారు. సెలబ్రిటీస్ లో ఎవరు కొత్తగా పెళ్లి చేసుకున్నా, వాళ్ళు అడగగకపోయినా కూడా జాతకం చెప్తూ, వాళ్ళు విడిపోతారు అని చెప్పి లేనిపోని నెగటివిటీని కొని తెచ్చుకుంటూ ఉంటాడు వేణు స్వామి. రీసెంట్ గానే నాగ చైతన్య – శోభిత నిశ్చితార్థం చేసుకోగా, వాళ్ళిద్దరి జాతకం చెప్తూ 2027 వ సంవత్సరం లో విడిపోతారు అంటూ కామెంట్స్ చేసి వివాదాల్లో చిక్కుకున్నాడు. ఈ వివాదంపై ఆయన సతీమణి వీణ శ్రీవాణి కూడా స్పందించి వేణు స్వామి కి మద్దతుగా నిల్చింది. ఇప్పుడు రీసెంట్ గా వీళ్లిద్దరు కలిసి చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

    ముందుగా వేణు స్వామి మాట్లాడుతూ ‘ నన్ను జర్నలిస్టు మూర్తి గారు 2017 వ సంవత్సరం లో మహా టీవీ లో ఉన్నప్పుడు నా మీద దాడి చెయ్యడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన టీవీ 5 లో ఉన్నాడు. నన్ను అప్పట్లో నాశనం చెయ్యడానికి ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్ని ప్రయత్నాలు చేసాడు. అప్పట్లో వాళ్ళు అడిగినంత డబ్బులు నేను ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ వాళ్ళ టీం తో కలిసి నా మీద దాడి చెయ్యడం మొదలు పెట్టారు. ప్రతీ రోజు వాళ్ళ టీవీ ఛానల్ లో నా మీద లేనిపోని అసత్య కథనాలు ప్రసారం చేస్తూ నాకు మానసిక క్షోభ కలిగిస్తున్నారు. గత 8 నెలలుగా వాళ్ళు పెట్టిన టార్చర్ ని భరించలేక నాకు ఆత్మహత్య చేసుకోవాలి అనే ఫీలింగ్ కలిగింది. ఎంతోమంది కష్టాలు తీర్చిన నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు’ అంటూ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    ఆ తర్వాత ఆయన సతీమణి వీణ శ్రీవాణి మాట్లాడుతూ ‘ఒక సాధారణ జ్యోతిష్యుడు అయిన వేణు స్వామి గారిని 5 కోట్ల రూపాయిలు ఇవ్వమని గత వారం రోజుల నుండి మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. 5 కోట్ల రూపాయిలు అంటే చిన్న విషయమా..?, నా నగలు, నా కూతురు నగలు అమ్మినా కూడా 5 శాతం కూడా అవ్వదు. చివరికి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. ఒకవేళ నేను ఆత్మహత్య చేసుకుంటే వేణు స్వామి మీద వస్తున్న నెగటివిటీ ని తట్టుకోలేక వీణశ్రీవాణి ఆత్మహత్య చేసుకుంది అని వేసేస్తారు. నా చావు అలా ఎందుకు వృధా అవ్వాలి?, ఈ వీడియో బయటకి వదిలిన తర్వాత మాకు ఎలాగో ప్రాణహాని ఉంటుంది. వాళ్ళు మమల్ని ఎలా అయిన చంపేస్తారు, మేము చనిపోయే ముందు వీళ్ళు ఎలాంటి వాళ్ళో బయట జనాలకు అర్థం అయ్యేలా ఈ వీడియో చేస్తున్నాము’ అంటూ ఆమె మాట్లాడింది.