Ticket to Kodipunju on the bus: ఆర్టీసీ బస్సు అన్నాక మనుషులే కాదు.. కూరగాయలు, బియ్యం బస్తాలు.. ఆఖరుకు పెంపుడు జంతువుల ప్రయాణానికి కూడా అనుమతిస్తారు. చాలా మంది అలా తీసుకెళ్లిన వారే.. కానీ ఎప్పుడూ లగేజీకి టికెట్ కొట్టే కండక్టర్లు.. పెంపుడు జంతువులకు మాత్రం కొందరు మినహాయింపులు ఇచ్చేవారు.

కానీ ఇక్కడో కండక్టర్ మాత్రం తన బస్సులో జంతువులకు టికెట్ తప్పనిసరి చేశాడు. కోడిపందేలకు వాడే మాంచి నాటుకోడికి టిక్కెట్ తీసుకున్నాడు. ఇప్పుడీ విషయం వైరల్ అయ్యింది. కోడికి టికెట్ ఏంటీ నాయనా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
గోదావరిఖని బస్టాండు నుంచి కరీంనగర్ కు బస్సులో వెళుతున్న మహ్మద్ అలీ అనే ఓ ప్రయాణికుడు తన వెంట ఒక కోడిపుంజును తీసుకువచ్చాడు. అది గమనించిన బస్సు కండక్టర్ కోడి పుంజుకు కూడా టికెట్టు కొట్టాడు. దీంతో ఆశ్చర్యానికి గురయ్యాడు సదురు ప్రయాణికుడు. దీనిపై కండక్టర్ ను వివరణ కోరగా ప్రయాణికుడితో పాటు ఒక ప్రాణం తో ఉన్న జీవిని వెంట తీసుకొని వస్తే టిక్కెట్ తీసుకోవాలని వివరణ ఇచ్చాడు.
బస్సుల్లో జంతువులకు టికెట్ ఉంటుందా? ఉండదా? అన్న మీమాంస జనాల్లో ఉంది. దీన్ని బట్టి వాటికి కూడా టికెట్ తీసుకోవాలని డిసైడ్ అయ్యింది.