Siddipeta Crime News : పని చేయడం చేతగానివారు.. ఉపాధి లేక జల్సాలకు డబ్బులు దొరకక ఇబ్బంది పడేవారు.. లోన్ యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. ఈజీగా లోన్ ఇచ్చేస్తుండడంతో డబ్బులు తీసుకుంటున్నారు. అయితే తిరిగి వాటిని చెల్లించలేక తంటాలు పడుతున్నారు. దొంగలుగా మారుతున్నారు. ఇలాగే ఓ యువకుడు జల్సాల కోసం లోన్‌యాప్‌లో రుణం తీసుకున్నాడు. అప్పు తీర్చమని యాప్ నిర్వాహకులు పెట్టే టార్చర్ భరించలేక దొంగనం చేయాలనుకున్నాడు. ఇందుకోసం యూట్యూబ్‌లో చూసి దొంగతనం ఎలా చేయాలో నేర్చుకున్నాడు. చివరకు చైన్ స్నాచింగ్ చేశాడు. కానీ, చివరకు పోలీసులకు పట్టుపడాడ్డడు.
కల్లు తాగేందుకు వచ్చి..
సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట మండలం భూంపల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలోని కమాన్ వద్ద ఏనగుర్తి గ్రామానికి చెందిన యాదమ్మ మూడు నెలలుగా కల్లు అమ్ముకుని ఉపాధి పొందుతోంది. ఇటీవల ఓ యువకుడు కల్లు తాదగేందుకు యాదమ్మ వద్దకు వచ్చాడు. కల్లు తాగాడు. తర్వాత యాదమ్మ ఒంటరిగా ఉండడాన్ని గుర్తించాడు. బైక్‌పై వచ్చిన యువకుడు పోతూ పోతూ ఆమె మెడలోని 2 తులాల పుస్తెలతాడు లాక్కుని పారిపోయాడు.
సీసీ ఫుటేజీల ఆధారంగా..
బాధితురాలు యాదమ్మ పోలీసులను ఆశ్రయించింది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. దుబ్బాక, బూంపల్లి పోలీసులు రెండు టీంలుగా గాలించారు. చివరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పట్టుకున్నారు. నిందితుడు లవన్‌కుమార్‌గా గుర్తించారు. తమదైన శైలిలో విచారణ చేయగా నేరం చేసినట్లు అంగీకరించాడు. అతడి నుంచి పుస్తెలతాడు రికవరీ చేశారు.
నిందితుడి కారణం విని షాక్..
ఇదిలా ఉండగా దొంగతనానికి కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు లవన్‌కుమార్‌ను విచారణ చేశారు. విచారణలో అతడు చెప్పిన కారణం తెలుసుకుని షాక్ అయ్యారు. దొంగతనం మొదటి సారి చేశానని, అది కూడా యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నానని వెల్లడించాడు. ఇక దొంగతనం చేయడానికి కారణం లోన్ యాప్ అని తెలిపాడు. యాప్ నిర్వాహకులు పెట్టే టార్చర్ భరించలేక దొంగతనాన్ని మార్గంగా ఎంచుకున్నట్లు పేర్కొన్నాడు.