Land Grabbing : ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు.. 600 కుటుంబాలకు అన్యాయం.. అయినా చర్యల్లేవ్..

ఓ రాష్ట్రంలో అధికార పార్టీకి మరో రాష్ట్రంలో అధ్యక్షుడు. ఈయన మహారాష్ట్రలో అర్బన్ డెవలప్మెంట్ అథారటీ. కమిషనర్‌గా ఉన్నప్పుడు జరిగిన తెరచాటు ఫిక్స్ డిపాజిట్లే.. ఈనాడు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌లో నిలబెట్టాయి.

Written By: Raghava Rao Gara, Updated On : May 7, 2023 7:33 pm
Follow us on

Land Grabbing : ఆయన అధికార పార్టీకి ఓ రాష్ట్ర అధ్యక్షుడు.. ఇటీవలే ఏపీకి నియమించబడ్డాడు. అయితే ఆయనకు హైదరాబాద్ లో అక్రమ ఆస్తులున్నాయని..వాటిని కాపాడుకోవడానికే ఆ అధికార పార్టీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడయ్యాడన్న ఆరోపణలు వచ్చాయి. కానీ దీనిపై ఆ పార్టీ నేతలు ఏమీ స్పందించలేదు. హైదరాబాద్ లో దోచుకొని ఏపీలో పార్టీని నడిపించడానికే ఇలా చేస్తున్నారని రేవంత్, బండి సంజయ్ లాంటి వారు ఆరోపించారు. అయితే ఈ ఏపీ అధ్యక్షుడి దోపిడీ అంతా హైదరాబాద్ లోని హఫీజ్ పేట్ లోనే జరిగిందని.. వివాదాస్పద భూముల్లో అపార్ట్ మెంట్ల పేరిట 600 మందిని దోచుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఓ మీడియాలో ఇందుకు సంబంధించిన సాక్ష్యాలతో కథనం కలకలం రేపింది.

హైదరాబాద్ నగరంలో హఫీజ్ పేట్ అంటేనే అత్యంత వివాదాస్పదమైన సీఎస్ 14 భూములు. ఇక్కడి భూముల్లో ఇళ్లు కట్టి అమ్ముకోవడమే రియల్ ఎస్టేట్స్ వారి పని. వారికి మాత్రమే బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ప్రభుత్వాలు అనుమతులు ఇస్తాయి. కొనుగోలుదారులు అమ్ముదామంటే కనీసం రిజిస్ట్రేషన్స్ కావు. 1956 నుంచి కోర్టుల్లో నలుగుతున్న ఈ వ్యవహారంలో పైసలే పరమావధిగా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఆరేళ్లుగా మాయమాటలు చెప్పిన ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ అరాచకాలకు దిగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. బెదిరింపులకు పాల్పడుతూ.. ఏం చేసుకుంటారో చేసుకోండని బరితెగిస్తోందని అంటున్నారు.

కోర్టు తీర్పులు ఉన్నా అప్పగింత..

‘పాయిగా’ ల్యాండ్స్ ఇప్పటికీ ప్రభుత్వ భూములే అంటూ సర్కార్ కోట్లాడుతోంది. సుప్రీంకోర్టులో స్పష్టమైన తీర్పులు ఉన్నాయి. అయినా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అధికారంలో ఉన్నవారు అప్పగించారు. కొంతమంది భూములపైనే సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. 2014లో సైరస్ ఇన్వెస్ట్‌మెంట్‌ గోల్డ్‌స్టోన్ ప్రసాద్ కేసు (ఎస్ఎల్పీ- 17362 ఆఫ్ 2014)లో జూలై 31, 2014న స్పష్టమైన తీర్పు ఇచ్చారు. టైటిల్ తేల్చేంత వరకు రిజిస్ట్రేషన్స్‌ చేయొద్దని ఆదేశించారు. కానీ, హైకోర్టులో జస్టిస్ నవీన్‌రావు బెంచ్ 19069 ఆఫ్ 2014లో ఆగస్టు 25న ఆర్టికల్ 141కి విరుద్ధంగా సుప్రీం తీర్పును కాదని రిజిస్ట్రేషన్స్‌ చేసుకోవచ్చని తీర్పునిచ్చారు. ఇలా వివిధ రూపాల్లో న్యాయస్థానం తీర్పులు వీరికి వరంగా మారాయి. 40 ఎకరాలు గోల్డ్‌స్టోన్ సోదరుని కంపెనీ అయిన సవేరా ఇన్‌ఫ్రా నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ప్రభుత్వం సుప్రీంకి వెళ్లింది. రియల్టర్స్ చట్టం చుట్టంలా మార్చుకుంటూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఆ తర్వాత ప్లాట్ ఓనర్స్ పడరాని పాట్లు పడుతున్నారు.

ఇష్టానుసారం నిర్మాణాలు..

సర్వే నెంబర్ 78లో 215 ఎకరాల భూమి అత్యంత వివాదంలో ఉంది. కానీ, అక్కడ ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు నిర్మాణాలు సాగిస్తున్నారు. ఆదిత్య కన్‌స్ట్రక‌్షన్స్‌ కూడా 10 ఎకరాల్లో క్యాపిటల్ హైట్స్, ఫార్చున్ హైట్స్ అంటూ 2015 నుంచి 1500 ప్లాట్స్ కి అనుకూలంగా నిర్మాణాలు చేపడుతోంది. జీహెచ్ఎంసీ సవేరా అండ్ కన్‌స్ట్రక్షన్స్‌కి పర్మిషన్ నెంబర్ మే 12, 20154179/30/04/2013)లో అనుమతులు ఇచ్చింది. 2020 వరకు ఎట్టి పరిస్థితిలో ప్రాజెక్ట్ పూర్తి. చేయాల్సిందిగా అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నారు. ప్రాజెక్ట్ స్టార్ట్ – 600 కుటుంబాలతో కాకముందు నుంచే అమ్మకాలు మొదలు పెట్టారు. 2016లో 300 మంది నుంచి డబ్బులు వసూలు చేశారు. కానీ, నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. రెరా అనుమతి లేకపోవడం, డబ్బులు ఇరుక్కుపోయాయనే భావనతో కస్టమర్స్ 2023 వరకు ఓపిక పట్టారు. ఆదిత్య వారు కూడా కస్టమర్స్‌ను మాయ మాటలతో నెట్టుకొచ్చారు. అయితే.. ఈ మధ్యకాలంలో ఏం చేస్తారో చేసుకోండని.. బెదిరింపులకు దిగుతోందని బాధితులు వాపోతున్నారు.

వివాదమే పెట్టుబడి?

తోట చంద్రశేఖర్.. మాజీ ఐఏఎస్ అధికారి. ఓ రాష్ట్రంలో అధికార పార్టీకి మరో రాష్ట్రంలో అధ్యక్షుడు. ఈయన మహారాష్ట్రలో అర్బన్ డెవలప్మెంట్ అథారటీ. కమిషనర్‌గా ఉన్నప్పుడు జరిగిన తెరచాటు ఫిక్స్ డిపాజిట్లే.. ఈనాడు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌లో నిలబెట్టాయి. వివాదం ఉన్న భూముల్లో నిర్మాణాలు చేపట్టి వేల కోట్లకు ఎదిగారు. ఇప్పుడు కస్టమర్స్‌ను ఇబ్బందులు పెడుతున్నారు.