https://oktelugu.com/

Rangareddy: విలేకరులు కాదు.. సొసైటీకి కరోనాలా దాపురించింది మీడియా యాజమాన్యాలే

లైన్ ఎకౌంట్ ఇవ్వకపోగా.. యాడ్స్ టార్గెట్ పెడుతూ, సర్కులేషన్ చేయాలని వేధిస్తుండడంతో వారు జనం మీద పడుతున్నారు. అడ్డగోలుగా రాస్తున్నారు. యాజమాన్యాలు కేవలం రెవెన్యూ కోణంలో మాత్రమే ఆలోచిస్తూ ఉండడంతో.. క్షేత్రస్థాయిలో జరుగుతున్నదానని ఎవరూ పట్టించుకోవడం లేదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 14, 2024 / 01:03 PM IST

    Rangareddy

    Follow us on

    Rangareddy: ఒకప్పుడు ఒక విలేకరిని తీసుకోవాలంటే పత్రికా యాజమాన్యాలు రకరకాల పరీక్షలు పెట్టేవి. ఆ పరీక్షల్లో పాస్ అయిన తర్వాత.. స్థానికంగా పోలీస్ స్టేషన్లో ఎటువంటి కేసులు లేకుంటేనే విధుల్లోకి తీసుకునేవి. పైగా కంట్రిబ్యూటర్లకు లైన్ ఎకౌంట్ ఇచ్చేవి. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. ఒక ప్రధాన పత్రిక మినహా మిగతా వారిని యాడ్స్, సర్కులేషన్ టార్గెట్ అని మొదలుపెట్టాయి. లైన్ ఎకౌంటు దాదాపు తగ్గించాయి. దీనికి తోడు విషయ పరిజ్ఞానం లేనివారు ఈ ఫీల్డ్ లోకి రావడం మొదలైంది. యాజమాన్యాలు కూడా కేవలం రెవెన్యూ కోణంలోనే ఆలోచించడంతో వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. కేవలం కంట్రిబ్యూటర్లు మాత్రమే కాదు.. బ్యూరో చీఫ్ లు కూడా అడ్డగోలు పనులు చేస్తూ దొరుకుతున్నారు.. అయితే ఇంతటి దుర్మార్గాలకు ప్రధాన కారణం మీడియా సంస్థలే.

    లైన్ ఎకౌంట్ ఇవ్వకపోగా.. యాడ్స్ టార్గెట్ పెడుతూ, సర్కులేషన్ చేయాలని వేధిస్తుండడంతో వారు జనం మీద పడుతున్నారు. అడ్డగోలుగా రాస్తున్నారు. యాజమాన్యాలు కేవలం రెవెన్యూ కోణంలో మాత్రమే ఆలోచిస్తూ ఉండడంతో.. క్షేత్రస్థాయిలో జరుగుతున్నదానని ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో కిందిస్థాయి విలేకరులు రెచ్చిపోతున్నారు. బెదిరించడం, వసూలు చేయడం, యాజమాన్యానికి ఇంత పంపి, తాము కొంత జేబులో వేసుకోవడం నేర్చుకున్నారు. రెవెన్యూ దండిగా రెవెన్యూ దండిగా వస్తుండడంతో యాజమాన్యాలు కూడా కిక్కురుమనడం లేదు..

    శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామంలో నీరుటి రవి, అతని ముగ్గురు కుమారుల ఆత్మహత్య వెనుక ఐదుగురు విలేకరులు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఐదుగురిలో ఇద్దరు మినహా మిగతా వారంతా ప్రధాన పత్రికలు, న్యూస్ ఛానల్ కు చెందినవారు. ఇందులో ఒక పత్రిక తప్ప మిగతావన్నీ విలేకరులకు లైన్ ఎకౌంటు అంతంతమాత్రంగానే ఇస్తాయి. ఇక ఆ న్యూస్ ఛానల్ యాజమాన్యం అయితే లైన్ ఎకౌంట్ ఇవ్వడం కరోనా ముందే మానేసింది. దీంతో చేసేదేం లేక వారు ఇలా జనం మీద పడ్డారు. వేధించడం మొదలుపెట్టారు, చివరికి జర్నలిస్టుల ముసుగులో వీధి రౌడీల స్థాయిలో దందాలు చేయడం షురూ చేశారు. టంగుటూరు ఘటన కేవలం ఉదాహరణ మాత్రమే. అది కూడా పోలీసుల విచారణలో బయటపడింది.. బయటపడని ఘటనలు.. బయటికి రాని వాస్తవాలు ఎన్నో ఉన్నాయి. అధికారుల నుంచి సామాన్య ప్రజల వరకు వేధించడం, ఇబ్బంది పెట్టడమే ఇప్పటి జర్నలిజం అయిపోయింది.