Newspaper Ad: వాస్తవానికి మనలో ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటే.. దోస్తులను పిలుస్తాం. బంధువులను ఆహ్వానిస్తాం. కేక్ కట్ చేస్తాం.. మన స్థాయికి తగ్గట్టుగా పార్టీ ఇస్తాం. కానీ పత్రికా జర్నలిజంలో ఇందుకు విభిన్నంగా ఉంటుంది.(ఈ అవలక్షణాలను ఎలక్ట్రానిక్ మీడియా కూడా వంట పట్టించుకుంది). పత్రిక ఆవిర్భావ దినోత్సవాన్ని క్యాష్ చేసుకొనేందుకు.. యానివర్సరీ యాడ్స్ అని పేరు పెడుతుంది. టార్గెట్ ఇచ్చేస్తుంది. బ్యూరో చీఫ్ ల మంచి మొదలుపెడితే కంట్రిబ్యూటర్ల వరకు లక్ష్యాలు ఇచ్చేస్తుంది. విలువలు, వంకాయలు అని వీరలెవల్లో రకరకాల బంగారు పలుకులు రాసే యాజమాన్యాలు.. వార్షికోత్సవ యాడ్స్ విషయంలో మాత్రం పక్కా వసూల్ రాజాల లాగా మారిపోతుంటాయి. వలవలును వదిలేసి యాడ్స్ పబ్లిష్ చేసుకుంటాయి. అప్పటిదాకా రాసిన వార్తలకు.. అప్పటిదాకా చేసిన వ్యాఖ్యలకు మంగళం పాడుతుంటాయి.
టార్గెట్ 50% మాత్రమే
ఆ పత్రిక ఇటీవల రిపోర్టర్లకు ఈ యానివర్సరీ యాడ్స్ టార్గెట్ ఇచ్చింది. దీంతో వారంతా జనాల మీద పడ్డారు. యాడ్స్ పేరుతో తిరగడం మొదలుపెట్టారు. కానీ ఇప్పటివరకు 50% మాత్రమే లక్ష్యం పూర్తయిందట. మైదాన ప్రాంత జిల్లాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందట. ఏ ఒక్క జిల్లాలో కూడా 50% మించి టార్గెట్ పూర్తికాలేదట. దీంతో బ్యూరో చీఫ్ లు తలలు పట్టుకుంటున్నారు. స్టాపర్లు ఇబ్బంది పడుతున్నారు. కంట్రిబ్యూటర్లు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఆ పత్రిక గతంలో ప్రతిపక్ష గొంతును వినిపించింది. ఇప్పుడు రెండు రాష్ట్రాలలో అనుకూలమైన ప్రభుత్వాలు వచ్చినప్పటికీ ఆశించినంత స్థాయిలో యాడ్ రెవెన్యూ రావడం లేదు. ఆ పత్రిక సంబంధించిన బ్యూరో లు, ఇతర సిబ్బంది యాడ్స్ కోసం వెళ్తే.. రాజకీయ నాయకుల దగ్గర నుంచి మొదలు పెడితే కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఎవరూ దేకడం లేదు. ఇప్పటివరకు 50 శాతం మాత్రమే యాడ్ టార్గెట్ పూర్తయింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సిబ్బందికి ఇబ్బంది..
యాడ్స్ టార్గెట్ పూర్తి కాకపోవడంతో ఉదయం లేస్తే న్యూస్ నెట్వర్క్ ఇన్చార్జి వాట్సాప్ గ్రూప్ లలో మెసేజ్ పెడుతున్నాడు. బ్యూరో చీఫ్ లను బండ బూతులు తిడుతున్నాడు. మరోవైపు నుంచి అడ్వర్టైజ్మెంట్ జనరల్ మేనేజర్ కూడా లైన్లోకి వస్తున్నాడు. ఆయన కూడా యాడ్స్ ఎలా తేవాలో బ్యూరో చీఫ్ లకు పాఠాలు చెబుతున్నాడు. ఇంకోవైపు నుంచి ఎడిషన్ ఇంచార్జి ఫోన్ చేసి. “ఫస్ట్ పేజీకి ఇవాళ ఏం స్టోరీ ఇస్తున్నారు? ఫీచర్ ఐటమ్స్ ఏం ప్లాన్ చేశారు? వార్తలు బాగా లేట్ అవుతున్నాయి.. డెస్క్ లో మ్యాన్ పవర్ అంత కూడా తక్కువగా ఉంది. గతంలో ఉన్న దానికంటే అదనంగా ఒక పేజీ పెంచారు కాబట్టి.. వార్తలు ఎక్కువగా వచ్చేలా చూడండి” అంటూ ఆయన తన బాధను వ్యక్తం చేస్తున్నాడు.. ఇక మధ్యలో బ్రాంచ్ మేనేజర్ తగులుకుంటున్నాడు. యాడ్స్ గురించి, రీచ్ కావాల్సిన టార్గెట్ గురించి చెవుల నుంచి రక్తాలు కారేలా ఫోన్ లో వాయిస్తున్నాడు.. ఇన్ని ఒత్తిళ్ల మధ్య బ్యూరో చీఫ్ ల నుంచి మొదలుపెడితే కంట్రీబ్యూటర్ల వరకు యాడ్స్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.. కొంతమంది తట్టుకోలేక మానేస్తున్నారు.. అయితే ఇటీవల ఆ పత్రిక పేజీలను పెంచింది. అదే అదే స్థాయిలో క్వాలిటీ కొనసాగించలేకపోతోంది. మ్యాన్ పవర్ కూడా సరిగ్గా లేదు. ఉన్నరితోనే ఎడిషన్ ఇన్చార్జిలు పనిచేయిస్తున్నారు. ఫలితంగా ఆ ప్రభావం వార్తల క్వాలిటీ మీద పడుతోంది. మొత్తంగా చూస్తే అటు ఏపీ, ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఆ పత్రిక యాడ్స్ టార్గెట్ పూర్తి కావడం లేదు. డెడ్లైన్ల మీద డెడ్లైన్లు ఇస్తున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. స్థూలంగా చెప్పాలంటే ఆ పత్రికకు యాడ్స్ ఇచ్చే విషయంలో ఎవడూ దేకడం లేదు. ఎన్నికల సమయంలో అవసరం కాబట్టి వాడుకున్నారు. ఆ తర్వాత ఆ పత్రిక యాజమాన్యం వ్యవహార శైలి తెలుసు కాబట్టి దూరం పెడుతున్నారు. అది క్షేత్రస్థాయిలో తిరిగే సిబ్బందికి అనుభవంలోకి వస్తున్నది.. చూడాలి మరి ఏం జరుగుతుందో..
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: The ads target is not finished does the management of that newspaper still understand what is happening
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com