Telangana cabinet: తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల మధ్య వివాదాలు రోజుకో తీరుగా మారుతున్నాయి. ఓ మంత్రి తన సహచర మంత్రిని దున్నపోతు అని ఇటీవల విమర్శించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్లి క్షమాపణ కూడా చెప్పిన విషయం తెలిసిందే. దానిని మర్చిపోకముందే ఇద్దరు మంత్రుల మధ్య కాంట్రాక్టుల విషయంలో వివాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఓ మంత్రి ఓ ఎస్ డి ని పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి వచ్చారు. అది కాస్త వివాదంగా మారింది. పైగా ఆ మంత్రి కుమార్తె తెరమీదకి వచ్చి అడ్డగోలుగా విమర్శలు చేసింది. ఏకంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. ఓ సిమెంట్ కంపెనీలో వాటాల విషయంలో గొడవలు కూడా జరిగాయని.. తుపాకీ ఎక్కుపెట్టి బెదిరించారని ఆ మంత్రి కుమార్తె సంచలన ఆరోపణలు చేసింది.
ఈ పరిణామాలు సహజంగానే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జి కల్పించుకొని ఆ మంత్రితో ముఖ్యమంత్రికి క్షమాపణ కూడా చెప్పించారు. ఇదంతా జరిపిన తర్వాత ఇప్పుడు మరొక విషయం వెలుగులోకి వచ్చింది. గులాబీ పార్టీ అనుబంధ సోషల్ మీడియా గ్రూపులలో.. సోషల్ మీడియా హ్యాండిల్స్ లో దీని గురించి విపరీతంగా ప్రచారం నడుస్తోంది. ఈ ప్రకారం ఓ మంత్రి ఆర్టిఐ అస్త్రాన్ని ఉపయోగించుకుంటున్నారు. తన అనుచరులతో ఆర్టిఐ ద్వారా ప్రభుత్వంలో జరుగుతున్న కేటాయింపులు.. నిధుల ఖర్చు.. ఇతర వ్యవహారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కెసిఆర్ ప్రభుత్వంలో భూముల కేటాయింపు.. పెట్టిన ఖర్చు.. ఇతర వ్యవహారాల గురించి తెలుసుకుంటున్నట్టు సమాచారం. మంత్రి అనుచరులు భారీగా ఆర్టిఐ దరఖాస్తులు చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తన శాఖ నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి పర్యవేక్షించే శాఖల వరకు వీటిని కూడా మంత్రి వదిలిపెట్టడం లేదని సమాచారం.
అయితే కొన్ని శాఖల సిబ్బంది వివరాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో మంత్రి స్వయంగా వారికి ఫోన్ చేసి.. వివరాలు ఇవ్వకపోతే మందలిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి కెసిఆర్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై అసలు విషయాలు తెలుసుకోవడానికి ఆ మంత్రి ఆర్టీఐ దరఖాస్తులు చేయిస్తుంటే.. గులాబీ మీడియా మాత్రం మరో విధంగా దీనిని డైవర్ట్ చేస్తోంది. తెలంగాణ మంత్రివర్గంలో మరో ముసలం మొదలైందని.. అందువల్లే ఇలాంటి పనిని ఆ మంత్రి చేస్తున్నారని ఆరోపించడం మొదలుపెట్టింది. సహజంగానే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఈ విషయంలో నిశ్శబ్దాన్ని పాటిస్తోంది. ఇన్ని జరుగుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నిశ్శబ్దంగా ఉండడం పట్ల ప్రజల్లో రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
మరోసారి సీఎం, మంత్రుల వివాదం
ఈసారి ఏకంగా సీఎం, ఇతర మంత్రుల శాఖల మీద గురి పెట్టిన జూపల్లి కృష్ణారావు
రేవంత్ రెడ్డిపై ఆర్టీఐ ఆయుధాన్ని ప్రయోగిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
భూ కేటాయింపులు, టెండర్ల వివరాలతో పాటు తన సొంత శాఖపై కూడా ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు… https://t.co/aaoW8noBZK pic.twitter.com/6WIV2LH1EX
— Telugu Scribe (@TeluguScribe) October 27, 2025