Satellite Channels vs digital Channel: టీవీ9, ఒకప్పుడు తెలుగు న్యూస్ రంగంలో అగ్రగామి, ఇప్పుడు డిజిటల్ యుగంలో ‘వ్యూస్’ కోసం పరుగెత్తుతోంది. శాటిలైట్ ఛానెళ్లన్నీ ఇప్పుడు డిజిటల్ ఛానెళ్ల నుంచి పోటీ ఎదుర్కొంటున్నాయి. డిజిటల్ ఛానెళ్లు రాజకీయ చర్చల నుంచి సినిమా గాసిప్‌ల వరకు, అన్నీ ఫోన్ స్క్రీన్‌పై సబ్‌స్క్రైబర్లకు అందిస్తున్నాయి. కానీ, ఈ హడావిడిలో వాటికి వాస్తవలతో పనిలేదు. ‘‘బ్రేకింగ్ న్యూస్: ఎవరో ఎక్కడో ఏదో అన్నారు!’’ ఇలాంటి శీర్షికలతో వ్యూస్ కొల్లగొట్టడమే లక్ష్యంగా పోటీ పడుతున్నాయి. ఇలాంటి పోటీల్లో ఇప్పుడు ఓ ప్రముఖ డిజిటల్ ఛానెల్.. ప్రముఖ టీవీ9 ఛానెల్‌ను వ్యూస్‌లో మించిపోయింది.
క్లిక్‌బైట్ శీర్షికలు..
ఆ ప్రముఖ డిజిటల్ ఛానెల్.. ‘క్లిక్’ కోసం తమ ఆత్మను అమ్మేస్తున్నాయి. ‘‘ఇది చూస్తే షాక్ అవుతారు!’’ లేదా ‘‘అసలు విషయం బయటపడింది!’’ఇలాంటి శీర్షికలు చూసి క్లిక్ చేస్తే, లోపల ఉండేది పాత వార్త లేదా అసంబద్ధ చర్చ! వాస్తవాల పరిశీలన? అది ఓ పాతకాలపు కథ. డిజిటల్ యుగంలో వేగం ముఖ్యం, నాణ్యత కాదు అన్నట్లుగా ఉంది పరిస్థితి. దీంతో నిజం చెప్పడంలో వెనుకబడుతోంది. పాత చింతకాయ పచ్చడిలాంటి స్టోరీలు, చర్చలు, ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తున్నాయి. అతిశయోక్తి కంటెంట్‌తో వ్యూస్ పెంచుకుంటోంది. వ్యూస్ పెరుగుతున్నారని, ఆ డిజిటల్ ఛానెల్ ఇప్పుడు హెల్త్, సినిమా, ఫుడ్, డివోషనల్ అంటూ మరిన్ని శాఖలు ఏర్పాటు చేసుకుంది.
Also Read: ఈటల – బండి ఎపిసోడ్ పై అధిష్టానం మౌనం.. ఎందుకో..?
శాటిలైట్ వర్సెస్ డిజిటల్..
శాటిలైట్ ఛానెళ్లు గతంలో రాజ్యమేలాయి, కానీ ఇప్పుడు డిజిటల్ ఛానెళ్లు వాటిని మించిపోతున్నాయి. మొబైల్ స్క్రీన్లపై యూట్యూబ్ ఛానెళ్లు రాజ్యమేలుతున్నాయి. కానీ, ఈ పోటీలో నాణ్యత మాత్రం బలి అవుతోంది. క్లిక్‌బైట్ సామ్రాజ్యంలో చిక్కుకుని, ‘వ్యూస్’ కోసం విలువలను వదిలేస్తున్నాయి.