TG Holidays 2025: కాలం గిర్రున తిరిగింది. 2024 సంవత్సరం మరో నాలుగు నెలల్లో కాలగర్భంలో కలవనుంది. 2025 రానుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు చిన్న పెద్ద అంతా ఏర్పాటు చేసుకుంటున్నారు. కొత్త ఏడాదిపై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇక డిసెంబర్ 31 వేడుకలకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు.మంచి చెడుల కలయికగా ఉన్న 2024 వీడ్కోలు పలికి.. 2025 కలిసిరావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి సంబంధించిన సెలవుల జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో పబ్లిక్, ఆప్షన్ హాలిడేస్ ఉన్నాయి. 2025లో మొత్తంగా 27 సాధారణ సెలవులు వస్తునానయి. 23 ఆప్షనల్ హాలిడేస్ ఇస్తున్నటు‍్ల ప్రభుత్వం జాబితాలో పేర్కొంది. జనవరి 1న కొత్త సంవత్సరం సెలవు ఆప్షనల్‌గా పేర్కొంది. జనవరి 13 భోగి, జనవరి 14 సంక్రాంతి సెలవులు ప్రకటించింది. మార్చి 30 ఉగాది, ఆగస్టు 27 వినాయక చవితి, అక్టోబర్ 3 దసరా, అక్టోబర్ 20 దీపావలి సెలవలు ఉన్నాయి. జనవరి ఒకటో తేదీ సెలవు ఇచ్చినందున ఫిబ్రవరి నెలలో 10వ తేదీన రెండో శనివారం వర్కింగ్ డేగా ప్రకటించింది.
ఈ పండుగల తర్వాతి రోజు..
బోనాల పండుగకు సెలవుతోపాటు రంజాన్, దసరా పండుగ సెలవుల తర్వాత రోజు కూడా సెలవు ప్రకటించింది. దసరా పండుగ గాంధీ జయంతి రోజు వస్తుంది. మరోవైపు జూన్ నెలలో ఒక్క సెలవు కూడా లేదు.
ప్రభుత్వం ప్రకటించిన 2025 ఏడాది సెలవుల జాబితా :
S.INO సెలవులు తేదీ రోజు
1. నూతన సంవత్సరం 01-01-2025 బుధవారం
2. భోగి 13-01-2025 సోమవారం
3. సంక్రాంతి/పొంగల్ 14-01-2025 మంగళవారం
4. గణతంత్ర దినోత్సవం(రిపబ్లిక్ డే) 26-01-2025 ఆదివారం
5. మహా శివరాత్రి 26-02-2025 బుధవారం
6. హోళి 14-03-2025 శుక్రవారం
7. ఉగాది 30-03-2025 ఆదివారం
8. ఊద్ ఉల్ ఫితర్(రంజాన్) 31-03-2025 సోమవారం
9. రంజాన్(మరుసటి రోజు) 01-04-2025 మంగళవారం
10. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి 05-04-2025 శనివారం
11. శ్రీరామ నవమి 06-04-2025 ఆదివారం
12. డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి 14-04-2025 సోమవారం
13. గుడ్ ఫ్రైడే 18-04-2025 శుక్రవారం
14. ఈదుల్ ఆజ్ హా(బక్రీద్) 07-06-2025 శనివారం
15. షాహదత్ ఇమామ్ హుస్సేన్(ఆర్.ఏ) 10వ మోహరం 06-07-2025 ఆదివారం
16. బోనాలు 21-07-2025 సోమవారం
17. స్వాతంత్య్ర దినోత్సవం 15-08-2025 శుక్రవారం
18. శ్రీకృష్ణ జన్మాష్టమీ(శ్రీవైష్ణవ ఆగమం ప్రకారం) 16-08-2025 శనివారం
19. వినాయక చవితి 27-08-2025 బుధవారం
20. ఈద్ మిలాద్ ఉన్ నబీ 05-09-2025 శుక్రవారం
21. బతుకమ్మ(ప్రారంభం రోజు) 21-09-2025 ఆదివారం
22. మహాత్మ గాంధీ జయంతి/విజయ దశమి 02-10-2025 గురువారం
23. విజయ దశమి (మరుసటి రోజు) 03-10-2025 శుక్రవారం
24. దీపావళి 20-10-2025 సోమవారం
25. కార్తిక పౌర్ణమి/గురునానక్ జయంతి 05-11-2025 బుధవారం
26. క్రిస్మస్ 25-12-2025 గురువారం
27. క్రిస్మస్(బాక్సిండ్ డే) మరుసటి రోజు 26-12-2025 శుక్రవారం