Telangana SSC Results 2025: తెలంగాణలో ఏప్రిల్ 30న 10వ తరగతి ఫలితాలు విడుదలవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మార్చి 22 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్షల్లో తెలంగాణ వ్యాప్తంగా 5, 08,385 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మీరు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఒక విద్యార్థికి పదవ తరగతి టర్నింగ్ పాయింట్ గా ఉంటుంది. ఇందులో పాస్ అయితేనే తర్వాత ఉన్నత చదువులకు వెళ్లాల్సిన అవకాశం ఉంటుంది. అందువల్ల పదవ తరగతి ఫలితాలపై విద్యార్థులతోపాటు తల్లిదండ్రులకు ఆసక్తి ఉంటుంది. అయితే ఇదే సమయంలో తల్లిదండ్రులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏంటంటే?
Also Read: ఆకట్టుకుంటున్న ‘సింగిల్’ థియేట్రికల్ ట్రైలర్..మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసిన శ్రీవిష్ణు!
ఇటీవల పరీక్షల ఫలితాలు రిలీజ్ అయిన సందర్భంగా కొందరు విద్యార్థులు సంతోషంగా ఉంటే.. మరికొందరు విద్యార్థులు విచారంగా ఉన్నారు. అయితే ఇంకొందరు మాత్రం తమ ప్రాణాలు తీసుకున్నారు. అయితే చాలామంది పరీక్షల్లో ఫెయిల్ ర్ అయినా వారి కంటే తక్కువ మార్కులు వచ్చాయన్న బాధతోనే ప్రాణాలు తీసుకునే వారిని చూస్తే కలిచి వేస్తోంది. అయితే ముందు జాగ్రత్తగా కొందరు మానసిక నిపుణులు తల్లిదండ్రులు కొన్ని సూచనలు పాటించడం ద్వారా పిల్లలను కాపాడుకోవచ్చు అని అంటున్నారు.
ఫలితాలు విడుదలైన సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లల వెంటే ఉండడం మంచిది. ఎందుకంటే వారు ఏ క్షణాల్లో అయినా తమ మనసును మార్చుకునే అవకాశం ఉంటుంది. కొందరు విద్యార్థులు ఇతరులతో పోల్చుకొని తమకు తక్కువ మార్కులు వచ్చాయని బాధపడుతూ ఉంటారు. అలాంటివారికి సర్ది చెప్పాలి. మార్కులతోనే జీవితం కాదని.. భవిష్య తంతా ఇంకా ముందే ఉందని వివరించి చెప్పాలి. అంతేకాకుండా పదో తరగతి మార్కులతో ఎటువంటి ప్రయోజనం ఉండదని.. భవిష్యత్తులో చదివే చదువుల కోసం ఇంకా కష్టపడే ప్రయత్నం చేయాలని చెప్పాలి.
పరీక్షల్లో ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు. అయితే పరీక్షల్లో ఫెయిల్ అయితే పరీక్ష మళ్ళీ రాసుకోవచ్చు. కానీ విలువైన ప్రాణం పోతే తిరిగి రాదు అనే విషయాన్ని వారికి గుర్తించాలి. ఇలాంటి విషయంలో వీలైతే వారికి నచ్చిన మొబైల్ లో కొన్ని వీడియోలను చూపించాలి. మానసికంగా వారిని ధైర్యంగా ఉంచడం వల్లనే వారు నిర్భరంగా ఉంటారు.
పరీక్షల ఫలితాల విషయంలో ముఖ్యంగా అమ్మాయిలు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. అయితే పరీక్షల ఫలితాల సమయంలో వీరిని ఒంటరిగా అస్సలు ఉండనివ్వకూడదు. ఇటీవల ఒక అమ్మాయికి ఇంటర్లో 440 మార్కులకు 434 మార్కులు వచ్చిన ఏడుస్తూ కూర్చుంది. అంటే ఇంత చిన్న విషయానికి కూడా వారు తట్టుకోలేకపోతుంటారు. ఇక ఫెయిల్ అని తెలిస్తే ఎంతో బాధపడే అవకాశం ఉంటుంది. అందువల్ల పరీక్ష ఫలితాలు విడుదలైన సమయంలో వారి వెంటే ఉండడం మంచిది.
పరీక్షల ఫలితాలు విడుదలైన తరువాత ఒకవేళ వారికి తక్కువ మార్కులు వస్తే.. వారిని వేరే ప్రదేశానికి తీసుకెళ్లడం మంచిది. ఎందుకంటే ఇంట్లోనే ఉండడంవల్ల ఒకే విషయంపై పదేపదే ఆలోచిస్తూ ఉంటారు. ఇతర ప్రదేశానికి వెళ్లడం వల్ల పరీక్షల ఫలితాల గురించి మరిచిపోయే అవకాశం ఉంది. ఏది ఏమైనా పరీక్షల ఫలితాల సమయంలో తల్లిదండ్రులు వారి వెంటే ఉండడం మంచిది.
Also Read: పెళ్లయిన స్టార్ హీరోతో ఎఫైర్ నడిపి కెరీర్ నాశనం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్…