Telangana Politics : ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలుచుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాజకీయంగా ఎదగడానికి మరింత వేగంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా భారత రాష్ట్ర సమితి స్థానాన్ని ఆక్రమించడానికి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో బిజెపి భాగస్వామ్య పార్టీల తో ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి, బిజెపికి కేంద్రంలో విరోధం కొనసాగుతోంది. ఇప్పుడు అదే ధోరణి తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
Also Read : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ గవర్నమెంటు గుడ్ న్యూస్… ఇకపై ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదట..
తెలంగాణలో రాజకీయంగా ఎదగడానికి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవడానికి బిజెపి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను దక్కించుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీని కాదని.. పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ అభ్యర్థులకు ఓటు వేసేలా బిజెపి పాచికలు వేసింది. అవి ఎన్నికల్లో పారడంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకుంది. దీంతో బిజెపికి కాస్త బూస్టప్ లభించినట్టు అయింది. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి 8 స్థానాలను తెలంగాణ రాష్ట్రంలో గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీతో సమానంగా సీట్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పుడు అదే ఊపులో అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాబినెట్ మీటింగ్లో ఒకమంత్రికి, ముఖ్యమంత్రికి గొడవ జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక సీనియర్ మంత్రికి.. ఇంకొక మంత్రికి కూడా వాగ్వాదం జరిగిందని ఆయన బాంబు పేల్చారు. నిధుల కేటాయింపుకు సంబంధించి ఒక సీనియర్ మంత్రికి, ఇంకో మంత్రికి కూడా వాగ్వాదం జరిగిందని మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి నిధుల పంపిణీ విషయంలో గొడవ జరిగిందని మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ లో నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని వేగంగా పూర్తి చేయాలని.. 1000 కోట్ల నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తే.. ఒక మంత్రి దానిని వ్యతిరేకించారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.. పూర్తి చేయాల్సిన ఎన్నో ప్రాజెక్టులు ఉన్నప్పటికీ.. వాటికి నిధులు మంజూరు చేయకుండా.. కొడంగల్ ఎత్తిపోతల పథకానికే నిధులు మంజూరు చేస్తే ఎలాగని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఓ శాఖమంత్రికి వాగ్వాదం జరిగిందని ఏమిటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఓ మంత్రికి చెందిన సొంత కంపెనీకి గత కేబినెట్ మీటింగ్లో ఉదండపూర్ రిజర్వాయర్ అంచనా విలువ 430 కోట్ల నుంచి 1150 కోట్లకు పెంచుకున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఓ మంత్రి కంపెనీకి ఆ స్థాయిలో అంచనాలు పెంచినప్పుడు.. మాకు సంబంధించిన కాంట్రాక్టులు కూడా ఉన్నారు.. వాళ్లకు కూడా ఇవ్వాలని మంత్రుల మధ్య పంచాయితీ మొదలైందని బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎటాక్ మొదలుపెట్టిందా..
ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారత రాష్ట్ర సమితి విమర్శించుకుంటూ వస్తోంది. బిజెపి ఆస్థాయిలో ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగడం లేదు. ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిన తర్వాత బిజెపి కూడా గేర్ మార్చినట్టు కనిపిస్తోంది. అందువల్లే కేబినెట్ మీటింగ్ లో చోటుచేసుకున్న అంశాలను మహేశ్వర్ రెడ్డి పూసగుచ్చినట్టు వివరించడం సంచలనానికి కారణమవుతోంది. అక్కడ ఏం జరిగిందో.. ఎవరి మధ్య వాగ్వాదం జరిగిందో బయటికి తెలియక పోయినప్పటికీ మహేశ్వర్ రెడ్డి అక్కడే ఉన్నట్టు.. అదంతా చూసినట్టు వ్యాఖ్యానించడం విశేషం. అయితే దీనిపై కాంగ్రెస్ నాయకులు ఇంతవరకు ఎటువంటి కౌంటర్లు ఇవ్వలేదు . కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా గా పేరుపొందిన పత్రికల్లోనూ మంత్రుల మధ్య జరిగిన చర్చకు సంబంధించి ప్రముఖంగా కథనాలు వచ్చాయి. అయితే ఆ పత్రికల్లో మంత్రుల మధ్య సంవాదం జరిగింది అని మాత్రమే వచ్చింది. అంటే దీనిని బట్టి చూస్తే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమే అనిపిస్తోందని బిజెపి నాయకులు అంటున్నారు.. మరోవైపు మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బిజెపి సోషల్ మీడియా ప్రముఖంగా ప్రచారం చేస్తోంది. అయితే ఇదే సమయంలో గులాబీ మీడియా, సోషల్ మీడియా సైలెంట్ కావడం విశేషం. రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలిచిన నేపథ్యంలో బిజెపి రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేని భారత రాష్ట్ర సమితి సైలెంట్ గా ఉండిపోయింది. చూడాలి మరి వచ్చే రోజుల్లో బిజెపి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేస్తుందో?!
Also Read : రేవంత్ వచ్చినా.. రిజల్ట్ మారలే.. అధికారంలో ఉన్నా సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానం నిలబెట్టుకోలే..!
