Telangana Liquor Shops: ఒకప్పుడు మద్యం అనేది కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మద్యం లేకపోతే ప్రభుత్వాలకు మరగడలేదు. మద్యం తాగకుండా మెజారిటీ వర్గాలు ఉండడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే తాగే నీరు కంటే మద్యం అనేది అత్యంత ముఖ్యమైపోయింది. పైగా ప్రభుత్వాలు కూడా ఆదాయం కోసం మద్యం దుకాణాలను ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తున్నాయి. దరఖాస్తు డబ్బుల ద్వారా దండిగా వెనకేసుకుంటున్నాయి. 2014 నుంచి తెలంగాణలో మద్యం వ్యాపారం మరో స్థాయికి వెళ్లిపోయింది. గడచిన పది సంవత్సరాలలో మద్యం వ్యాపారం అనేది తెలంగాణ ఆర్థిక రంగానికి ప్రధానమైన ఇరుసు లాగా మారిపోయింది. ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం కూడా ఆదాయం కోసం మద్యాన్ని నమ్ముకుంది. గతంలో ఉన్న దరఖాస్తు ఫీజును ఈసారి ఏకంగా మూడు లక్షల కు పెంచింది. ఈ డబ్బు మొత్తం నాన్ రి ఫండబుల్.
వాస్తవానికి ప్రభుత్వం నిబంధనలు ప్రకారం మద్యం షాపులకు దరఖాస్తులు ముగిశాయి. ఇప్పటివరకు 90 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ఇంకా దరఖాస్తులు ఎక్కువ రావాల్సి ఉంది.. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1.32 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు ఆ సంఖ్య 90 వేల పైచిలుకు మాత్రమే ఉంది. నిన్నటితో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసినప్పటికీ.. ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణకు తేదీని 23 వరకు పొడిగించింది. 27న లాటరీ తీయనుంది. ఊహించిన స్థాయిలో దరఖాస్తుల రాకపోవడం వల్లే ప్రభుత్వం చివరి నిమిషంలో గడువు పొడిగించినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి దరఖాస్తు ఫీజులు పెంచల నేపథ్యంలో ప్రభుత్వానికి దాదాపు 3000 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనాలున్నాయి.
తెలంగాణలో మద్యం షాపుల దరఖాస్తులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లా చెందిన ఓ మహిళ ఏకంగా 150 మధ్య దుకాణాలకు దరఖాస్తులు చేసింది.. కేవలం దరఖాస్తుల కోసమే ఆమె 4.50 కోట్ల వరకు ఖర్చుపెట్టింది.. ఆమె కర్నూలు జిల్లా సరిహద్దుల్లోని షాపులకు ఎక్కువగా దరఖాస్తులు చేశారని తెలుస్తోంది. కేవలం కర్నూలు జిల్లా నుంచి కాకుండా.. ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, ఒడిశా నుంచి కూడా మహిళలు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి మద్యం వల్ల చాలామంది మహిళలు తమ మాంగల్యాలను కోల్పోతున్నారు. అయితే అందుకు విరుద్ధంగా మహిళలు మద్యం వ్యాపారం లోకి రావాలి అనుకోవడం విశేషం. అంతేకాదు పురుషులకంటే ఎక్కువగా దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం.