Mahmood Ali : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ మంత్రులు సహనం కోల్పోతున్నారు. ఎన్నికల ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్న ముఖ్యమైన మంత్రి కేటీఆర్, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కార్యకర్తకన్నా అధ్వానంగా మాట్లాడుతున్నారు. రాయడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే భాష విపక్షాలపై వాడుతున్నారు. బస్తీమే సవాల్ అంటూ ఛాలెంజ్‌లు చేస్తున్నారు. కీలక మంత్రులే అలా చేయగా ఏం లేనిది.. తాము చేయి చేసుకుంటే తప్పా అని భావిస్తున్నారు. కొందరు మంత్రులు ఇతరులపై చేయి చేసుకుంటూ రాష్ట్ర మంత్రులు తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు. తాజాగా హోంమంత్రి మహమూద్ అలీ తన గన్‌మెన్ చెంప చెల్లుమనిపించారు.
తలసాని పుట్టిన రోజుకు వెళ్లి..
సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా హోమంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లారు. ఆలింగనం చేసుకుని విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన బొకే ఇవ్వమని చేయి చాపారు. అయితే బెకే ఇవ్వడం క్షణం ఆలస్యం కావడంతో సహనం కోల్పోయిన మహమూద్ అలీ పక్కనే ఉన్న గన్‌మెన్ చెంపపై కొట్టారు.
సర్ది చెప్పిన తలసాని..
ఆగ్రహంతో ఊగిపోయిన మహమూద్ అలీని చూసిన తలసాని.. ఈ అంశం తన మెడకు చుట్టుకుంటుందేమో అని భావించారు. వెంటనే మహమూద్ అలీని శాంతిపంజేసే ప్రయత్నం చేశారు. చిన్న విషయం వదిలేయండా అందరి ముందు బాగుండదని సర్ది చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మొన్న ఎమ్మెల్యేనే కొట్టిన మంత్రి ‘ఎర్రబెల్లి’
రంగారెడ్డి జిల్లాలోని కేశంపేట మండలంలో ఒక శంకుస్థాపన చేయడానికి వెళ్లిన పంచాయతీరాశ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అక్కడే ఉన్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ను అందరూ చూస్తుండగానే తలపై కొట్టాడు. ఈ ఊహించని సంఘటనకు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో పాటుగా ప్రజలు కూడా షాక్ అయ్యారు.
ఎర్రబెల్లి గురించి అందరూ మాట్లాడుకుంటుండగానే, తాజాగా మహమూద్ అలీ అయితే ఏకంగా గన్‌మెన్‌పై చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది. అధికారంలో ఉంటే ఏం చేసినా చెల్లుతుందని, ప్రభుత్వ ఉద్యోగులు తమకు గులాం చేయాలి అన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ మంత్రి సహచర ఎమ్మెల్యే అని చూడకపోవడం, మరో మంత్రి తన శాఖ పరిధిలో పనిచేసే గన్‌మెన్‌పై చేయి చేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Telangana Home Minister Mahmood Ali Slaps his Body Gaurd/Security officer for not getting a bouquet to wish Minister Srinivas Yadhav on his birthday.pic.twitter.com/tzLU2fhKjS
— Megh Updates ™ (@MeghUpdates) October 6, 2023