Yadagirigutta Narasimha Swamy : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి(Yadadri SriLakshmi Narasimha Swamy) ఆలయం తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అప్పటి సీఎం కేసీఆర్(KCR)ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. 2021లో ఆలయాన్ని ప్రారంభించారు. ఈ సమయంలోనే.. స్వామవారి ఆలయ దివ్య విఆన గోపురానికి స్వర్పతాపడం చేయాలని నిర్ణయించారు. ఈమేరకు దాతలు బంగారం అందించాలని కోరారు. నాటి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కాంట్రాక్టర్లు తోచినసాయం చేశారు. అయితే అవసరమైన మేరకు బంగారం సమకూరలేదు. దీంతో ఆలయం తరఫున కొనుగోలు చేశారు. మొత్తంగా 68 కిలోలతో స్వర్ణగోపునం నిర్మించారు. ఇందుకు సుమారు రూ.80 కోట్లు కర్చు చేశారు. దీంతో స్వర్ణ గోపురం మహా కుంభావిషేక సంప్రోక్షణ ఉత్సవాలు చేపట్టారు. ఆదివారం(ఫిబ్రవరి 23న) ఆలయ సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం ఘట్టం నిర్వహించి బంగారు విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం ఇవ్వనున్నారు.
2021లో నిర్ణయం..
విమాన గోపురానికి బంంగారు తాపడం చేయించాలని 2021లో అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అనేక మంది భక్తులు, దాతలు విరాళాలుగా బంగారం ఇచ్చారు. అయినా తాపడం పనులు చేపట్టేందుక అవసరమైన బంగారం సమకూరలేదు. దీంతో 2022, మార్చి 8న కేసీఆర్ ఆలయం ఉద్ఘాటన పూర్తి చేశారు. 2023లో కాంస్ర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయ అభివృద్ధిపై దృష్టిసారించారు. పనులపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha), ఉమ్మడి జిల్లా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam kumar Reddy), కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komati Reddy Venkat Reddy) సమీక్షలు చేశారు. బంగారు తాపడం పనులు పూర్తి చేయించారు.
స్వామివారికి అంకితం..
బంగారు విమాన గోపురాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఆదివారం ఉదయం 11.54 గంటలకు ఆవిష్కరించి స్వామివారికి అంకితం ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా యాదగిరి గుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయ విమాన గోపురాన్ని స్వర్ణమయం చేశారు. 50.5 ఫీట్ల ఎత్తులో సుమారు 10,759 ఎస్‌ఎఫ్‌టీలుగా ఉంది. బంగారు తాపడం కోసం ఒక్కో ఎస్ఎఫ్టీకి 6 గ్రాముల చొప్పున బంగారం వినియోగించారు. మొత్తం 68 కిలోల బంగారం వినియోగించారు. విరాళంగా వచ్చిన బంగారంతోపాటు స్వామివారి హుండీ ఆదాయం నుంచి డబ్బులు ఖర్చు చేశారు.
స్వర్ణ విమానం గోపురం విశేషాలివీ :
స్వర్ణ విమాన గోపురం ఎత్తు: 50.5 అడుగులు
బంగారు విమాన గోపురం వైశాల్యం : 10,759 చదరపు అడుగులు
ఉపయోగించిన మొత్తం బంగారం: 68 కిలోలు
తాపడం పనులు ప్రారంభించిన తేదీ: డిసెంబరు 1, 2024
తాపడం కవచాల బిగింపు పనుల పూర్తి: ఫిబ్రవరి 18, 2025
బంగారు తాపడం బిగింపు ఖర్చు: రూ.5.10 కోట్లు (జీఎస్టీ కాకుండా)
రాగిరేకుల తయారీ ఖర్చు: రూ.12 లక్షలు
పనిచేసిన కార్మికులు: 50 మంది
పనులు చేసిన సంస్థ: నవయుగ మెటల్స్
స్వర్ణ విమాన గోపురం పనులు చేసిన సంస్థ: ఎంఎస్ స్మార్ట్ క్రియేషన్స్, చెన్నై.
Live : Hon’ble CM Sri.A.Revanth Reddy Participates in Sri Swamy Vari Bangaru Vimana Gopura Maha Kumbhabhisheka Samprokshana at Yadagirigutta https://t.co/UYW1vcAMf1
— Telangana CMO (@TelanganaCMO) February 23, 2025