BRS MLAs' defection Case
Telangana Politics : తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసిన పది మంది ఎమ్మెల్యేలకు క్రమంగా కాంగ్రెస్‌లో చేరారు. దీనిపై బీఆర్‌ఎస్ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్(Gaddam Prasad kumar)కు ఫిర్యాదు చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను అనర్హులుగా ప్రకటించాలని కోరింది. అయితే స్పీకర్ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది. అయినా స్పీకర్ నిర్ణయంలో జాప్యం జరుగుతోంది.
సుప్రీంలో పలిటిషన్…
స్పీకర్ కావాలనే నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నట్లు భావించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి.. ఈసారి సుప్రీం కోర్టు తలుపు తట్టారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీకోర్టు(Supreem Court) ధర్మాసనం ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వం తరఫు న్యాయమూర్తిని ప్రశ్నించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. మరోవైపు కేటీఆర్ కూడా దీనిపై పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై ఫిబ్రవరి 10న విచారణ చేస్తామని తెలిపింది.
10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు..
ఇదిలా ఉంటే సుప్రీం కోర్టు ఆదేశాలతో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. పార్టీ మారడంపై విరవణ ఇవ్వాలని కోరారు. అయితే ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే కూడా వివరణ ఇవ్వలేదు. వివరణ ఇచ్చేందుకు గడువు కావాలని కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు సోమవారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు పార్టీ ఫిరాయింపుపై బీఆర్‌ఎస్ సుప్రీం క ఓర్టుకు 500 ఆధారాలు సమర్పించినట్లు తెలిసింది.
దానం నాగేందర్ ఇంట్లో భేటీ
మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసిన నేపథ్యం, నోటీసులు జారీ అయిన క్రమంలో ఇటీవల దానం నాగేందర్(Danam Nagendar) ఇంట్లో సమావేశం అయ్యారు. నోటీసులకు ఎలాంటి సమాధానం ఇవ్వాలనే అంశంపై చర్చించారు. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కూడా పాల్గొన్నట్లు సమాచారం.
ఢిల్లీ వెళ్లే యోచన..
స్పీకర్ గడ్డ ప్రసాద్‌కుమార్ నోటీసుల నేపథ్యంలో న్యాయపరంగా ముందుకు వెళ్లే అంశంపై ఫిరాయింపు ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. న్యాయస్థానాలను ఆశ్రయిస్తే మంచిది అనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు ఢిల్లీ వెళ్లాలన్న ఆలోచనలో కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించి న్యాయ నిపుణులతో భేటీ అవుతారని తెలుస్తోంది.