Sakshi Vs ABN: తాజాగా ఈ రెండు మీడియా సంస్థల న్యూస్ వెబ్ సైట్ల మధ్య వివాదం చర్చకు దారితీస్తోంది. అయితే ఈ రెండు సంస్థలు కూడా తప్పుడు వాదనలను భుజాలకు ఎత్తుకున్నాయి. ఆంధ్రజ్యోతి ది మూర్ఖత్వం అయితే.. సాక్షి ది పూర్తిగా అబద్ధం. ” ప్రజల నుంచి మాకు వస్తున్న పాపులారిటీ ఉపయోగించుకొని.. సాక్షి రీడర్ షిప్ పెంచుకోవడానికి కుట్రలు చేస్తోందని.. తన వెబ్ సైట్ పేజీలను తనను ట్యాగ్ చేస్తోందని.. అంతకంతకు దిగజారుతోందని.. చేసిన పనికి క్షమాపణ చెప్పాలని.. తక్షణమే ఆ ట్యాగ్ లను తొలగించాలని” ఆంధ్రజ్యోతి గాయి గాయి చేస్తోంది.
” ఆ ట్యాగ్స్ అంటే ఏమిటో తెలియదు. ఎలా చేస్తారో కూడా తెలియదు. మాపై అలాంటి పిచ్చికూతలు ఏమిటి.. తిక్క తిక్క రాతలు ఏమిటి? ఆంధ్రజ్యోతిలో గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడ్డగోలుగా వార్తలు ప్రచురిస్తున్నప్పుడు.. వాటిని ప్రశ్నిస్తూ ఆ పత్రిక పేరును ట్యాగ్ చేస్తాం. దానివల్ల మా లీడర్షిప్ ఎలా పెరుగుతుంది? మాకు ఎలా లాభం వస్తుంది? ముందుగా సోషల్ మీడియా ట్యాగింగ్ గురించి అవగాహన పెంచుకోవాలని” సాక్షి ఆంధ్రజ్యోతి హితవు పలుకుతోంది.
అటు సాక్షి, ఇటు ఆంధ్రజ్యోతి పోటాపోటీగా టన్నులకొద్దీ బురదను చల్లుకున్న తర్వాత.. ఆంధ్రజ్యోతి కాస్త చల్లబడింది. సాక్షి మా ట్యాగ్ తొలగించిందని.. కానీ క్షమాపణ కచ్చితంగా చెప్పాలని.. లేకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.. అయితే ఇక్కడ స్థూలంగా జ్యోతి ట్యాగ్ క్లిక్ చేస్తే రీడర్స్ జ్యోతి వెబ్ పేజీలకు వెళుతుంటారు. అంతేతప్ప సాక్షి వెబ్ పేజీలకు ఎలా వెళ్తారు? ఈ పేపర్లు , వెబ్ సైట్ లు చూసే పాఠకులకు ఏ పేపర్ కావాలంటే.. అందులకు వెళ్తారు. పైగా ఎవరి పొలిటికల్ లైన్ ఏమిటో రీడర్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ సాక్షి అలాంటి సాంకేతిక కుట్రలకు పాల్పడితే.. అది నేరుగా ఈనాడు ట్యాగ్ వాడుకుంటుంది.. ఆంధ్రజ్యోతికి ట్యాగ్ ఎందుకు.. వరల్డ్ ర్యాంక్, కంట్రీ ర్యాంక్, ఇండస్ట్రీ ర్యాంక్ ప్రకారం చూసుకుంటే ఆంధ్రజ్యోతి సాక్షి కంటే బెటర్ పొజిషన్ లో ఉంది. దీనికి కారణం సాక్షి వెబ్సైట్ నిర్వహణ అత్యంత దారుణంగా ఉంటుంది. నెలవారి విజిట్స్, విద్యుత్ మధ్య వ్యవధి, ఒక విజిట్ లో చూసే పేజీల సంఖ్య, పేజీ ల వ్యూస్ లో ఆంధ్రజ్యోతి సాక్షి కంటే బెటర్. అందువల్లే ఆంధ్రజ్యోతి.. సాక్షి మీద ఒంటికాలు మీద లేస్తోంది. అంతేకాదు ఇప్పుడు ఏకంగా సాక్షి మీద కేసులు పెట్టడానికి రెడీ అవుతోంది. ఏకంగా ఇస్రోకే కంప్లైంట్ చేసిందని వార్తలు వస్తున్నాయి. చూడాలి ఈ వీధి పంచాయితీలో ఎవరు గెలుస్తారో?!