Bandi Sai Bhageerath missing: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసింది. ఈ కేసు విచారణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి సిట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సాయి భగీరథ్ కూడా హనీట్రాప్ కేసు పెట్టాడు. తాజాగా తనపై లైంగిక ఆరోపణలు చేస్తూ పోక్సో కేసు పెట్టిన అమ్మాయి మైనర్ కాదని కేసు కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ తరుణలో సాయి భగీరథ్‌ను పోలీసులు అరెస్టు చేయలేదు. దీంతో కొంతమంది సాయి భగీరథ్ ఎక్కడున్నా చెప్పాలని వెరైటీ ప్రచారం చేపట్టారు.
మెట్రోలో ప్రయాణికులకు విజప్తి..
హైదరాబాద్ మెట్రో రైలులో కొందరు సాయి భగీరథ్ ఫొటో పట్టుకుని తిరుగుతూ సాయి భగీరథ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు అని అతనిపై పోక్సో కేసు నమోదైందని, కానీ భగీరథ్ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడని వివరిస్తున్నారు. కనిపిస్తే 100 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరుతున్నారు. పోక్సో చట్టం కింద నిందితుడిగా ఉన్న ఆయన గురించి పోలీసులకు సమాచారం అందించమని విజ్ఞప్తి చేస్తున్నారు.
రాత్రి పోస్టర్లు..
ఇదే కాకుండ బండి సంజయ్ ఆయన కొడుకుతో కలిసి దిగన ఫొటోలతో హైదరాబాద్‌లో పోస్టర్లు వేశారు. కీలక ప్రాంతాల్లో అందరికీ కనిపించేలా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాళ్ల వద్ద రాత్రి కొందరు ఈ పోస్టర్లు అంటించారు. కనబడడం లేదని, కనిపిస్తే పోలీసులకు చెప్పాలని పోస్టర్లలో పేర్కొన్నారు.
చట్టం, సామాజిక కోణాలు
ఇటువంటి పబ్లిక్ ప్రచారం చట్టవ్యవస్థను ప్రభావితం చేయవచ్చు, ఎందుకంటే పోక్సో కేసుల్లో రహస్యం అవసరం. పోలీసులు ఈ పోస్టర్ల వెనుక ఎవరో దర్యాప్తు చేసే అవకాశం కూడా ఉంది. సామాజికంగా, ఇది రాజకీయ కుటుంబాలపై ప్రజల అసంతృప్తిని తెలియజేస్తుంది. ఇలాంటి విధానాలు పోలీస్ పనిని సులభతరం చేయవచ్చు కానీ, దుర్వినియోగ అవకాశాలు కూడా ఉన్నాయి.
పోలీసులు ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే, పోస్టర్ల సృష్టికర్తలు కూడా దొరుకుతారు. ఇది బండి సంజయ్ రాజకీయ ఇమేజ్‌పై ప్రభావం చూపుతుంది. ప్రజలు సమాచారం అందించడం ద్వారా న్యాయం సాధించే అవకాశం పెరుగుతుంది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు కనపడట్లేదు అంటూ మెట్రోలో పోస్టర్లతో ప్రచారం
POCSO కేసులో నిందితుడిగా ఉన్న బండి సంజయ్ కొడుకు మీకు కనిపిస్తే 100కు డయల్ చేసి పోలీసులకు చెప్పండి అంటూ విజ్ఞప్తి https://t.co/Wtu4lGGCEj pic.twitter.com/vUmjnyqDnQ
— Telugu Feed (@Telugufeedsite) May 13, 2026
బండి భగీరథ్ పరారీలో ఉన్నాడు అంటూ హైదరాబాద్ వ్యాప్తంగా వెలసిన పోస్టర్లు
ఆచూకీ తెలిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్లో తెలియచేయండి అంటూ హైదరాబాద్ అంతటా పోస్టర్లు https://t.co/xYsHxXRBn6 pic.twitter.com/uNnyFN77tg
— Telugu Feed (@Telugufeedsite) May 13, 2026