RTC MD VC. Sajjanar : దీపావళి పండుగ అంటే యువత, పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ఉత్సాహంగా జరుపుకుంటారు. కుటుంబమంతా కలిసి చేసుకునే పండుగల్లో దీపావళి ఒకటి. భారత దేవంలోనే కాకుండా ప్రపంచమంతా దీపావళిని ఘనంగా జరుపుకుంది. అయోధ్యలో అయితే గిన్నిస్ రికార్డు దీపోత్సవం నిర్వహించారు. వేడుకలో 27 లక్షల దీపాలు వెలిగించారు. ఇక దీపావళి రోజు దేశంమంతా టపాసుల మోత మోదింది. ఢిల్లీలో నిషేధం ఉన్నా.. టపాసులు కాల్చడంలో వాయు కాలుష్యం కమ్మేసింది. ఇలా పండుగ జరిగింది. అయితే హైదరాబాద్‌లో మాత్రం కొందరు దీపావళి వేత తమ వికృత చేష్టలతో జనాన్నిభయభ్రాంతులకు గురిచేశారు. రోడ్లపై ఇష్టారీతిన టపాసులు కాల్చారు. బైక్‌లపై తిరుగుతూ విన్యాసాలు చేశారు. ఇలాంటి ప్రమాదకరమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటని ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ. సజ్జనార్ తన ట్విట్టర్ కాతాలో పోస్టు చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
పండుగపూట ప్రమాదకరంగా..
‘దీపావళి వేళ వికృతానందం. ఎటువెళ్తోంది సమాజం. దీపావలి అంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆధ్యాత్మికతతో జరుపుకునే పర్వదినం. పండుగ రోజు ఇలాంటి వెర్రివేషాలు వేయడం.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం’ అని సజ్జనార్ ప్రశ్నించారు. ఇక సజ్జనార్ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తున్నారు. పండుగపూట కాదుసర్.. ప్రతీరోజు ఇలాగే వికృతానందం అని కొందరు కామెంట్ చేశారు. ఇలాంటి ఆకతాయిల చేష్టలతో విసిగిపోయాం అని, అసౌకర్యానికి గురవుతున్నాం అని చాలా మంది పేర్కొన్నారు. రాత్రివేళ బైక్‌లపై ఇష్టారీతిన వ్యవహరించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిటీ పోలీసులను కోరుతుఆన్నరు.
సిటీపోలీసులు ఏం చేస్తారో..
ఐపీఎస్ అయిన సజ్జనార్ ఇలాంటి చర్యలను ఉపేక్షించరు. కానీ, ఆయనను ఆర్టీసీకి బదిలీ చేసిన గత ప్రభుత్వం కట్టడి చేసింది. అయినా ఆయన సోషల్ మీడియా వేదికగా ఇలాంటి వాటిని ఎండగడుతున్నారు. తాజా పోస్టుపై ఇప్పుడు సిటీ పోలీసులు ఎలా స్పందిస్తారు అన్నది చర్చనీయాంశమైంది. హైదరాబాద్ సీపీ సీవీ. ఆనంద్‌తోపాటు డీజీపీ కూడా స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోందీ సమాజం.
దీపావళి అంటే ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం.
పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/pYbELJeZAR
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 3, 2024
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Rtc md sajjanars post went viral asking why there are so many mischievous acts during the festival
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com