టీఎస్ఆర్టీసీలో ఎన్ని సంస్కరణలు చేపట్టినా నష్టాలనే చవిచూస్తోంది. ప్రయాణీకులపై ఛార్జీల రూపం భారాన్ని పెంచి దండుకుంటున్నప్పటకీ ఆర్టీసీ లాభాలబాట పట్టడంలేదు. ఆర్టీసీలో సమ్మెలు.. పెట్రోల్-డీజీల్ ధరలు పెరగడం.. ప్రైవేట్ బస్సుల పోటీ.. మెరుగైన సదుపాయాలు లేకపోవడంతో ఆర్టీసీ ఆదాయం ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నచందంగా మారింది. రాష్ట్రంలో ఒకటి.. అర మినహా మిగిలిన డిపోలన్ని నష్టాల్లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: దుబ్బాక బరిలో ఆ కలెక్టర్? కేసీఆర్ ఫిక్స్ చేశారా?
ఇక హైదరాబాద్ మహానగరంలో మైట్రో అందుబాటులోకి రావడంతో సిటీ బస్సుల ఆదాయానికి భారీగా గండిపడింది. ఇటీవల కరోనా ఎఫెక్ట్ తో బస్సులు బంద్ కావడంతో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లోకి కురుకపోయింది. ప్రస్తుతం సిటీ బస్సులు అందుబాటులోకి వచ్చినప్పటికీ పెద్దగా ఆదాయం రావడం లేదు. మెట్రో అందుబాటులో ఉన్న రూట్లలో సిటీ బస్సులకు పెద్దగా ఆదాయం రావడంలేదు. దీంతో ఆర్టీసీని గట్టెక్కించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఇందులో భాగంగానే ఆర్టీసీ బస్సులకు మెట్రోకు అద్దెకు ఇవ్వాలనే ప్రతిపాదనను యాజమాన్యం చేస్తోంది. దీనివల్ల సిటీ బస్సులపై భారం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఆర్టీసీకి కొంతలో కొంతభారం తగ్గి ఆదాయం సమకూరుతుందని చెబుతున్నారు. ఈ ప్రతిపాదన ఇప్పటికే ఇరుసంస్థల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇలాంటి ప్రతిపాదన వచ్చినప్పటికీ ఎందుకో కార్యరూపం దాల్చలేదు.
మైట్రో అందుబాటులోకి వచ్చాక నగరవాసులంతా దానికే అలవాటు పడిపోయారు. సిటీ బస్సుల కంటే మెట్రోలో సదుపాయాలు అందుబాటులో ఉండటంతో ప్రయాణీకులంతా అటువైపు మరలుతున్నారు. ప్రధాన రూట్లలో నడిచే బస్సులో జనం పెద్దగా ఎక్కడం లేదు. మైట్రో రైళ్లు దిగిన ప్రయాణీకులు తమ కాలనీలకు వెళ్లే లింకు బస్సులను మాత్రమే ఆదరిస్తున్నారు. దీంతో ఆర్టీసీ కూడా ఆలోచనలో పడింది. ఈమేరకు సిటీ బస్సులను మెట్రోకు అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
Also Read: తెలంగాణలో స్కూళ్లు తెరుచుకునేది అప్పుడే..
ఆర్టీసీకి మెట్రోకు మధ్య గతంలోనే ప్రయాణికులకు ఒకే కాంబో బస్ పాస్‌ను ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. దీనిద్వారా మెట్రో రైలు దిగగానే ప్రయాణికులు తమ కాలనీలకు వెళ్లడానికి బస్సుల్లో అనుమతించాల్సి ఉంటుంది. అయితే కాంబో బస్ పాస్‌లు అమల్లోకి రాలేదు. తాజాగా మరోసారి ఇలాంటి ప్రతిపాదనే ఇరు సంస్థల మధ్య వచ్చినట్లు తెలుస్తోంది.