HomeతెలంగాణRS Praveen Kumar : ఫార్ములా ఈ" వ్యవహారంలో కేసు పెట్టాల్సింది రేవంత్ రెడ్డి పైనట.....

RS Praveen Kumar : ఫార్ములా ఈ” వ్యవహారంలో కేసు పెట్టాల్సింది రేవంత్ రెడ్డి పైనట.. కేటీఆర్ కు ఏం సంబంధం లేదట? RS ప్రవీణ్ సర్ ఇదేం ట్విస్ట్?

RS Praveen Kumar : మొన్నటి దాకా తెలంగాణ రాజకీయాలను “ఫార్ములా ఈ” కేసు వ్యవహారం తీవ్రమైన మలుపులు తిప్పింది.. ఈ కేసులో గతంలో పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ అరెస్ట్ అవుతారని.. ఆయన ఆధ్వర్యంలోనే అక్రమ లావాదేవీలు జరిగాయని.. నాడు పురపాలక శాఖ కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ కుమార్ చక్రం తిప్పారని వార్తలు వినిపించాయి. ఆయన స్టేట్మెంట్ కూడా కేటీఆర్ కు వ్యతిరేకంగా ఉందని తెలిసింది. ఈ కేసు వ్యవహారంలో ఈడి ఎంటర్ కావడంతో ఒకసారి గా దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.

ఇటీవల ఏసీబీ విచారణకు, ఆ తర్వాత ఈడి విచారణకు నాడు పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారుల ఎదుట తన వాణి వినిపించారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ ను గులాబీ అనుకూల మీడియా ఒకరకంగా.. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా మరొక రకంగా ప్రచారం చేశాయి. గులాబీ అనుకూల మీడియా అయితే ఫార్ములా ఈ రేసువల్ల తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చాయని.. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని.. హైదరాబాద్ ప్రతిష్ట అంతర్జాతీయంగా ఎదిగిందని వ్యాఖ్యానించడం మొదలు పెట్టింది. ఫెమా కు వ్యతిరేకంగా.. రిజర్వ్ బ్యాంక్ అనుమతులు తీసుకోకుండా 55 కోట్లను ప్రభుత్వ ఖజానా నుంచి అనవసరంగా బదిలీ చేశారని.. ఇది పూర్తిగా అక్రమ మార్గమని.. ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్మును అలా అనుమతి లేకుండా తరలించడం సబబు కాదని కాంగ్రెస్ అనుకూల మీడియా వాదించడం మొదలుపెట్టింది. ఇలా వాద ప్రతి వాదనల నేపథ్యంలో.. ఒకసారిగా ఈ కేసు కోల్డ్ స్టోరేజ్ లో పడిపోయింది. తర్వాత ఇప్పుడు బయటకు వస్తుందో తెలియదు కానీ.. ఇప్పుడు ఈ కేసును మరోసారి భారత రాష్ట్ర సమితి నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తట్టి లేపారు. అంతేకాదు ఈ కేసులో ప్రధాన ముద్దాయి రేవంత్ రెడ్డి అని ఆరోపించారు.. అంతేకాదు ఆయనపై హైదరాబాదులోని నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

కీలక వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి పై నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ” నేను ఐపీఎస్ అధికారిగా పనిచేశాను. క్రైమ్ బ్రాంచ్ డిసిపిగా వ్యవహరించాను. అడిషనల్ డీజీపీగా.. వార్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఐక్యరాజ్యసమితిలో పనిచేశాను. ఇన్ని అనుభవాలు నాకు ఉన్నాయి. ఆ తర్వాత ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలోచితంగా వ్యవహరిస్తున్నారు. ఏవేవో నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోతుంది. తెలంగాణకు తీవ్రమైన నష్టం జరుగుతోంది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో రేవంత్ రెడ్డి లేని అవినీతిని ఉందని చెబుతున్నారు. కాగితాల్లోనే దాన్ని చూపిస్తున్నారు. వాస్తవానికి ఈ కేసులో ప్రధాన ముద్దాయి కేటీఆర్ కాదు. కేటీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ప్రయత్నించారు. తెలంగాణ కీర్తి ప్రతిష్టను మరింత రెపరెపలాడించేందుకు కృషి చేశారు. అలాంటి వ్యక్తి పై వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి రేవంత్ రెడ్డి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసు వ్యవహారంలో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలి. రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి. ఈ కేసు వ్యవహారంలో రేవంత్ రెడ్డి లేని పట్టింపులకు పోతున్నారు కాబట్టి.. తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతోంది. ఈ నష్టానికి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. కేటీఆర్ పై చేస్తున్న ఆరోపణలకు బే షరతుగా క్షమాపణ చెప్పాలని” ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో తన కంప్లైంట్ ను సంబంధిత పోలీసులకు అందించారు. దీంతో ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. మరి దీనిపై కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version