Homeఆంధ్రప్రదేశ్‌RK Kotha Paluku: ఆర్కే కొత్త పలుకు: జగన్మోహన్ రెడ్డి తేడా అని అప్పుడు తెలిసిందట.....

RK Kotha Paluku: ఆర్కే కొత్త పలుకు: జగన్మోహన్ రెడ్డి తేడా అని అప్పుడు తెలిసిందట.. ఏబీఎన్ రాధాకృష్ణ బయటపెట్టిన నిజం

RK Kotha Paluku: ఒకప్పుడు రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యాలు ఉండేవి. వివాదాలు ఉండేవి. ప్రత్యర్థి తన ఉండేది. ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్యలోకి మీడియా సంస్థల అధినేతలు వచ్చారు. మీడియా సంస్థల అధినేతలకు రాజకీయ రంగులు ఉండడమే ఇక్కడ వైచిత్రి. అందువల్లే కొంతకాలంగా తెలుగు రాష్ట్రాలలో మీడియా అధినేతలు పరోక్షంగా రాజకీయాలు సాగిస్తున్నారు. రాజకీయ నాయకులను మించి మాట్లాడుతున్నారు. లక్షిత వార్తలను ప్రచురించడం.. టార్గెట్ కథనాలను ప్రసారం చేయడం మీడియా అధినేతలు పరిపాటిగా మార్చుకున్నారు.

Also Read: సుడిగాలి సుధీర్ కి ఇలాంటి ఆరోగ్య సమస్య ఉండేదా..చాలా పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నాడుగా..

ఇలాంటి అవ లక్షణాలు సాగిపోతున్నాయి కాబట్టి తెలుగు రాష్ట్రాలలో మీడియా అంటే గౌరవం లేకుండా పోయింది. ఒక పత్రిక లేదా ఒక ఛానల్ లో ప్రచురితమైన లేదా ప్రసారమైన కథనాలు చూసి ఇది ఏ పార్టీకి సంబంధించిందో చెప్పే స్థాయికి పాఠకులు ఎదిగిపోయారు. అదే స్థాయిలో మీడియా దిగజారిపోయింది. దీని అంతటికి ప్రధాన కారణం మీడియా అధినేతలే. అధికార పక్షానికి ఓవర్గం.. ప్రతిపక్షానికి మరో వర్గం మీడియా సంస్థలు భజన చేస్తూనే ఉన్నాయి. చిడతలు వాయిస్తూనే ఉన్నాయి.. ఇందులో సిగ్గుపడడానికి లేదు. భుజాలు తడుము కోవడానికి అంతకంటే లేదు.

తెలుగు రాష్ట్రాలలో ప్రఖ్యాత మీడియా సంస్థ అధినేతగా వేమూరి రాధాకృష్ణకు పేరుంది. పైగా ఈయన స్వతహాగా పాత్రికేయుడు. మూతపడిన ఆంధ్రజ్యోతిని తిరిగి లేపిన ఘనుడు. ఆంధ్రజ్యోతి సమాంతరంగా ఏబీఎన్ అనే న్యూస్ ఛానల్ ను ఏర్పాటుచేసి.. వృద్ధిలోకి తీసుకొచ్చిన ఘటికుడు. కాకపోతే రాధాకృష్ణ ముక్కుసూటిగా.. కొన్ని సందర్భాలలో లక్ష్యంగా చేసుకొని వార్తలు ప్రచురించడంలో ముందు వరసలో ఉంటాడు. అంతేకాదు తన రాతలను ఆయన అద్భుతంగా డిపెండ్ చేసుకుంటాడు. తాజాగా జగన్మోహన్ రెడ్డి మీద.. ఆయన పార్టీ కార్యకర్తల మీద వీకెండ్ కామెంట్ బై ఆర్కే లో రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత వైసిపి నేతలు రెస్పాండ్ అయ్యారు. హైదరాబాదులో ఏబీఎన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి.. వారి స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక అప్పటినుంచి వైసిపి నేతలు రాధాకృష్ణను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. తమ ఆస్థాన మీడియాలో అడ్డగోలుగా విమర్శ చేస్తున్నారు.

ఆ ఘటన జరిగిన తర్వాత ఆదివారం నాటి కొత్త పలుకులో రాధాకృష్ణ ఏం చెబుతారు.. ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు.. అనే వాటిపై ఆసక్తి ఏర్పడింది. అయితే తనమీద పెట్టుకున్న అంచనాలను రాధాకృష్ణ ఏమాత్రం తగ్గించలేదు. తను కూడా తగ్గలేదు. “అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోతే జగన్మోహన్ రెడ్డిని పరామర్శించడానికి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వెళ్లాను. ఈ క్రమంలో జగన్ నా ముఖం మీద మీ ఆంధ్రజ్యోతి పత్రిక నేను చదవను అన్నాడు. ఆ తర్వాత ఆ కామన్ ఫ్రెండ్ తో మీవాడు కొంచెం తేడా అనుకుంటానే అన్నాను. దానికి ఆ వ్యక్తి తల ఊపాడు. కొన్ని సంవత్సరాల క్రితం వైస్ కుటుంబంలో దిగ్భ్రాంతి కరమైన సంఘటన జరిగింది. అది తెలుసుకున్న తర్వాత వివేకానంద రెడ్డి మరణం నాకు అంత ఆశ్చర్యం కలిగించలేదు. నాటి సంఘటన గురించి సమయం వచ్చినప్పుడు నేనే బయట పెడతాను” ఇదిగో ఇలా సాగిపోయింది రాధాకృష్ణ కొత్త పలుకు.

గతంలో ఎన్నడు లేని విధంగా రాధాకృష్ణ ఈ వారం నాటి కొత్త పలుకులో రెచ్చిపోయారు. విస్ఫోటనంలాంటి అక్షరాలతో జగన్ మీద విరుచుకుపడ్డారు. మావిగన్ గొడ్డళ్లు.. హత్యా రాజకీయాలు.. పోలీసులతో దాడుల.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఒకరకంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కో కు చాకిరేవు లాగా వేమూరి రాధాకృష్ణ రాతలు రాసేసారు..

జగన్మోహన్ రెడ్డికి హితవు చెప్పే క్రమంలో భాగంగా నారా భువనేశ్వరి.. పవన్ కళ్యాణ్.. షర్మిల.. సునీత.. వీళ్ళందర్నీ బాధిత పక్షాలుగా రాధాకృష్ణ పేర్కొన్నారు. ఇక్కడ భువనేశ్వరి అంశాన్ని పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్, షర్మిల పై గతంలో ఆంధ్రజ్యోతి ఏం రాసింది.. షర్మిలకు ఎందుకు కవరేజ్ ఇవ్వలేదు.. పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ తో చేసిన ఇంటర్వ్యూ.. వీటన్నిటిని రాధాకృష్ణ మర్చిపోయినట్టున్నారు.. ఎందుకంటే సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తే అవన్నీ కనిపిస్తాయి. రాజకీయ వాసనలు ఉన్న రాధాకృష్ణ ఇప్పుడు అచ్చం రాజకీయ నాయకుడిగానే మాట్లాడుతున్నారు. ఎందుకంటే గతంలో తాను చేసిన వాటిని మర్చిపోయారు.. పాపం.. జగన్మోహన్ రెడ్డికి హితవు పలకబోయి తను విమర్శల పాలవుతున్నారు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version