Revanth Reddy’s Resignation: తెలంగాణలో నాలుగేళ్లుగా వెంటిలేటర్ పై కొనసాగుతున్న కాంగ్రెస్ కు.. ఆక్సిజన్ల కనిపించాడు రేవంత్ రెడ్డి. పార్టీ బతకడం కష్టమే అని సీనియర్లంతా చేతులు ఎత్తేసిన తరుణంలో పార్టీకి ఊపిరిగా మారాడు. కాంగ్రెస్ ను మింగేస్తున్న కేసీఆర్ ను చూసి సీనియర్లంతా కన్నాల్లో నక్కిన సమయంలో పార్టీ పగ్గాలు అందుకున్నాడు. టిడిపి నుంచి వచ్చిన వ్యక్తి అయినప్పటికీ కాంగ్రెస్ వాదాన్ని నర నారాన జీర్ణించుకొని పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం ప్రారంభించారు. జీవమే లేదు అనుకున్న కాంగ్రెస్ కేడర్ లో ఉత్తేజం నింపారు. పార్టీ కాస్త కుదురుపడుతుంది ఇన్నాళ్లు కన్నాలు నొక్కిన సీనియర్లకు తాము కాంగ్రెస్ వాదులమే అన్న విషయం గుర్తొచ్చింది. రేవంత్ తాను ఎదగడమే కాకుండా పార్టీని బలోపేతం చేస్తున్నాడు అన్న అనసూయ వార్డులో పుట్టింది. ఇంకేముంది.. వారిలోని సహజ బుద్ధిని బయట పెట్టుకున్నారు. సహచరుడు ఎదగడం ఊరలేని నైజం బహిర్గతమైంది. పార్టీని చంపేయనా పక్కోడు లేకుండా చేయడమే లక్ష్యం ఉన్నట్లుగా సంక్షోభానికి తెరలేరు. రేవంత్ తప్పుకుంటే తప్ప తామపార్టీలో పనిచేయలేమన్నంతగా ఐకమందుకే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
అనుకున్న సమయంలో
టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామాకు సిద్దం – రేవంత్ సంచలనం..!!

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. తనకు పదవి పైన ఎటువంటి ఆశ లేదన్నారు. రేవంత్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్లు గళం విప్పుతున్న వేళ తాను పదవి నుంచి తప్పుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటే రాజీనామాకు సిద్దమని ప్రకటించారు. తాను కాకుండా పిసీసీ పదవిలో ఎవరికి డిసైడ్ చేసినా వారిని కూర్చోపెట్టి తన భుజాల పైన పల్లకి మోయటానికి సిద్దమని చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం చెప్పిన పని చేయటం మినహా తనకు ఎటువంటి ప్రత్యేక అజెండా లేదన్నారు. పది పనులు చేస్తున్నప్పుడు ఒకటో రెండో తప్పులు దొర్లడం సహజమే. మనమంతా మానవ మాత్రులమేనని రేవంత్ వ్యాఖ్యానించారు. మనుషులం తప్పులు చేయటం సహజమని చెప్పుకొచ్చారు. అందరం కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నేతల శిక్షణ శిబిరం ముగింపు సమావేశానికి పలువురు సీనియర్లు దూరంగా ఉన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరయ్యారు. పలువురు సీనియర్లు ఈ సమావేశంలో ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. రాహుల్ గాంధీ అన్నీ వదులుకొని దేశం కోసం భారత్ జోడో యాత్ర చేస్తున్నారని కొనియాడారు. జానారెడ్డి సూచనలు సలహాలతో పార్టీని మూలములకు తీసుకెళ్దామని రేవంత్ ప్రతిపాదించారు. ప్రజలకు నష్టం చేసే పనులను కాంగ్రెస్ చేయదని రేవంత్ చెప్పుకొచ్చారు. 2003 నాటి పరిస్థితులు ఇప్పుడు కాంగ్రెస్ లో కనిపిస్తున్నాయని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాలు దోపిడీకి గురయ్యాయని రేవంత్ పేర్కొన్నారు. ఏపీ నుంచి కొందరు తలమాసిన వారు బీఆర్ఎస్ లో చేరానని రేవంత్ విమర్శించారు. ఏపీ ఆస్తులు – విద్యుత్ బకాయిల విషయంలో కేసీఆర్ ఎవరి పక్షమో స్పష్టం చేయాలని రేవంత్ డిమాండ్ చేసారు.
Also Read: Telengana: తెలంగాణలో బీహారీలే పాలిస్తుంటే ఇక మేము ఎందుకు?
పార్టీ శిక్షణా తరగతులకు మధు యాష్కీ, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు మరి కొందరు నేతలు గైర్హాజరయ్యారు. ఇదే సమయంలో తెలంగాణ సీనియర్ల ఫిర్యాదుతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ బాధ్యతల నుంచి మాణిక్కం ఠాగూర్ ను తప్పిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రేవంత్ మనవ సహజ పొరపాట్లు జరిగాయని.. పార్టీ అధికారంలోకి వస్తుందంటే తాను పీసీసీ పదవికి రాజీనామా చేస్తానని ప్రతిపాదించటం పైన ఇప్పుడు పార్టీ సీనియర్లు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. తెలంగాణ కాంగ్రెస్ కు త్వరలోనే కొత్త ఇంఛార్జ్ నియామకం జరిగే అవకాశం కనిపిస్తోంది.