Revanth Reddy Master Plan: తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. హైదరాబాద్ నగరం ఇప్పటికే విశ్వనగరంగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో గ్రేటర్‌ను గ్రేటెస్ట్‌గా మార్చాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ క్రమంలో 27 మున్సిపాలిటీలను విలీనం చేయాలని కేబినెట్‌లో తీర్మానం చేశారు. దీంతో నగర విస్తీర్ణం 625 కిలో మీటర్ల నుంచి 2 వేల కిలోమీటర్లకు పెరగనుంది. అయితే ఇందులో రాజకీయ వ్యూహం కూడా ఉన్నట్ల తెలుస్తోంది. ఒక్క ప్లాన్‌తో మూడు పార్టీలను టార్గెట్ చేసే వ్యూహం ఉన్నట్లు సమాచారం.
విస్తరణతో రాజకీయ మార్పులు..
గ్రేటర్ పరిధి పెంపుతో బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్‌పై వేర్వేరు ప్రభావాలు ఉంటాయని విశ్లేషకుల అంచనా. ప్రత్యేకించి, మజ్లిస్ ఆధిపత్యానికి చెక్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో బీజేపీకి శివారు ప్రాంతాల్లో ఉన్న అవకాశాలనూ తగ్గించే అవకాశం ఉంది. ఈ విస్తరణ క్రమంలో నగరంలోని రాజకీయ బలమైన ప్రాంతాలను మరో దిశగా మళ్లించడం ద్వారా విభిన్న పార్టీల గేమ్ ప్లాన్ మార్చడం లక్ష్యంగా ఉంది.
కొత్త నగరస్థాయి వ్యూహాలు..
రేవంత్ రెడ్డి ప్రణాళిక ప్రకారం, ఈ పరిధిలో నగర పాలనను మెరుగుపరచడం ద్వారా హైదరాబాద్ నగరాన్ని ఒక సమగ్ర, సమతుల్యమైన మెట్రోపాలిటన్ హబ్‌గా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఇది అడ్మినిస్ట్రేషన్, పౌర సదుపాయాలు, ఫండ్ వినియోగాన్ని సమర్ధవంతంగా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, విస్తరించిన ప్రాంతాల్లో అభివృద్ధి అవసరాలు, ఆదాయం వనరుల సమతుల్యతను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.
విపక్షాలు ఏమంటున్నాయి..
తెలంగాణ బీజేపీ గ్రేటర్ విస్తరణను వ్యతిరేకిస్తుంది. విలీనం కారణంగా వారి స్థానాలను తగ్గించే అవకాశం ఉన్నా మజ్లిస్ స్పందించడం లేదు. బీఆర్‌ఎస్ నుంచి వ్యూహాత్మక స్పందనలు లేకపోవడం ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. ఈ విస్తరణ సీట్ల సంఖ్య పెరగడంతో కాంగ్రెస్‌కు పార్టీ స్థాయి పెరగడంతోపాటు గ్రేటర్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓట్లు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో గ్రేటర్‌ను చేజిక్కించుకునే వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా రేవంత్ రెడ్డి మాస్టర్ మైండ్‌తో రూపొందించిన ఈ గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ ప్రణాళిక మూడుసార్లు వ్యూహాత్మకంగా రాజకీయ ప్రదేశాలను మార్చే దిశగా రూపొందింది. నగర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశం ఉంది.