Revanth Reddy: తెలంగాణ కొత్త సీఎం రేవంత్‌రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష శుక్రవారం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. గురువారం సాయంత్రం నిర్వహించిన కేబినెట్ సమావేశంలోనే విద్యుత్ శాఖపై చర్చించారు. రూ.85 వేల కోట్ల అప్పు ఉన్నట్లు అధికారులు తెలుపడంతో.. రేపు పూర్తి నివేదికలతో రావాలని, సీఎండీ ప్రభాకర్‌రావు కూడా సమావేశానికి హాజరయ్యేలా సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రభాకర్‌రావు రాజీనామా ఆదేశించొద్దని సూచించారు. కానీ, ఈ సమీక్షకు ప్రభాకర్‌రావు డుమ్మా కొట్టారు. సీఎం స్వయంగా ఆదేశించినా ప్రభాకర్‌రావు సమీక్షకు గైర్హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అపు‍్పల ఊబిలో విద్యుత్ సంస్థలు..
విద్యుత్ శాఖలో డిస్కంలకు ఇప్పటి వరకు రూ.85వేల కోట్ల అప్పులు ఉన్నాయని అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. దీంతో అసలు శాఖలో ఏం జరుగుతోందన్న కోణంలో సీఎం అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే వారికి ఉచితంగా కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ అమలు కోసమే విద్యుత్ శాఖ వ్యవహారాలపై పూర్తి అవగాహన కోసం సీఎం సమగ్ర రివ్యూ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
సమాచారం లేదు..
విద్యుత్ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష వ్యవహారంపై తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు స్పందించారు. సీఎం సమీక్ష గురించి తనకు సమాచారం లేదని, తనను సమీక్షకు ఎవరూ పిలవలేదని ప్రభాకర్‌రావు మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రి పిలిస్తే సమీక్షకు ఎందుకు వెళ్లకుండా ఉంటానని ఎదురు ప్రశి‍్నంచారు. విద్యుత్ శాఖ నుంచి కానీ, సీఎంవో నుంచి కానీ తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని పేర్కొన్నారు. ఆహ్వానం అంది ఉంటే కచ్చితంగా సమా వేశానికి హాజరయ్యే వాడినని స్పష్టం చేశారు.