Rayadurgam Land Auction : భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత.. కోకాపేట ప్రాంతంలో నియో పోలీస్ ఏరియాలో అప్పట్లో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ నిర్వహించిన భూముల వేలంలో ఎకరం ఏకంగా 100 కోట్లు పలికింది. దీంతో అప్పట్లో దేశవ్యాప్తంగా కోకాపేట ప్రాంతం గురించి చర్చ జరిగింది. ఎకరానికి 100 కోట్లు పెట్టి సరికొత్త రికార్డు సృష్టించింది రాజ్ పుష్ప సంస్థ. అయితే ఇప్పటివరకు ఆ రికార్డును హైదరాబాదులో ఏ ప్రాంతం కూడా బ్రేక్ చేయలేకపోయింది. రాజ పుష్ప మాదిరిగా మరో సంస్థ కూడా ఆ స్థాయిలో భూములను అంత డబ్బులు ఖర్చు పెట్టి కొనుగోలు చేయలేకపోయింది. అయితే ఇన్నాళ్లకు ఆ రికార్డు బ్రేక్ అయింది. ఈసారి హైదరాబాదు నగరంలో భూములు వేలం వేయగా.. గత రికార్డులు బద్దలయ్యాయి.
హైదరాబాదులోని టీజీ ఐఐసీ భూములను వేలం వేసింది. హైదరాబాదులోని రాయదుర్గం నాలెడ్జి సిటీలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వేలం వేసింది. వేలంలో భాగంగా ఎకరం 177 కోట్లు పలికింది. వేలంలో ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ పాల్గొంది. 7.67 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. దీనికిగాను 1,357.57 కోట్లను చెల్లించింది. రాయదుర్గం ప్రాంతంలో ఐటీ సంస్థలు అధికంగా ఉంటాయి. ఇక్కడ ఆఫీసు స్పేస్, రెసిడెన్స్ స్పేస్ కు విపరీతమైన గిరాకీ ఉంది. అందువల్లే ఈ సంస్థ ఇక్కడ ఇంత డబ్బు ఖర్చుపెట్టి భూములు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
స్థిరాస్తి వ్యాపారంలో ఎంఎస్ఎన్ సంస్థకు విశేషమైన అనుభవం ఉంది. అందువల్లే ఈ సంస్థ అంత మొత్తంలో డబ్బు ఖర్చుపెట్టి భూములు కొనుగోలు చేసింది. ఇక్కడ భూములు మెరక ప్రాంతానికి చెందినవి. కొనుగోలు చేసిన భూములలో ఎం ఎస్ ఎన్ సంస్థ భారీ అంతస్తులు నిర్మించాలని భావిస్తోంది. ఇక్కడ ఐటీ కంపెనీలు అధికంగా ఉండడంతో కచ్చితంగా గృహాలు విక్రయమవుతాయని భావిస్తోంది. రాయదుర్గం ప్రాంతంలో హైదరాబాదులోని పేరుపొందిన స్థిరాస్తి వ్యాపార సంస్థలు భారీగా గృహ సముదాయాలను నిర్మించాయి. అవన్నీ కూడా హాట్ కేకుల మాదిరిగా అమ్ముడుపోయాయి. ఇంకా ఇక్కడ రెసిడెన్స్ స్పేస్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. అందువల్లే ఎంఎస్ఎన్ సంస్థ భారీ ధరకు భూములను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
గతంలో కోకాపేట ప్రాంతంలో 100 కోట్లకు ఎకరం భూమిని కొనుగోలు చేసిన రాజ్ పుష్ప సంస్థ భారీ అంతస్తులను నిర్మించింది. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ తగ్గిపోయినప్పటికీ ఈ ప్రాంతాల్లో మాత్రం విపరీతమైన డిమాండ్ ఉంది. ఒక ప్లాట్ దాదాపు రెండు కోట్ల వరకు పలుకుతోంది. సదుపాయాలను బట్టి మూడు కోట్ల వరకు కూడా పలుకుతోంది. మొత్తంగా భారీ ధరకు కొనుగోలు చేసిన స్థిరాస్తి సంస్థలు అంతకుమించి అనే స్థాయిలో గృహ సముదాయాలను నిర్మించి క్యాష్ చేసుకుంటున్నాయి.