Vijay Deverakonda Car Accident ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పుట్టపర్తి నుండి హైదరాబాద్ కి తిరిగి వెళ్తున్న సమయంలో, గద్వాల్ జిల్లా ఉండవల్లి సమీపంలో బొలెరో కారు ఒక్కసారిగా కుడివైపు తిరగడం తో దాని వెనుక వస్తున్న విజయ్ దేవరకొండ లెక్సస్ మోడల్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో విజయ్ దేవరకొండ కి ఎలాంటి గాయాలు కాలేదు కానీ, కారు స్వల్పంగా దెబ్బతినింది. దీంతో వెంటనే విజయ్ దేవరకొండ మరియు అతని ఫ్యామిలీ వేరే కారు లో వెళ్లిపోయారు. ఈ ఘటనలో విజయ్ దేవరకొండ ఎలాంటి గొడవలకు వెళ్లలేదని తెలుస్తుంది. రీసెంట్ గానే ఆయన ప్రముఖ హీరోయిన్ రష్మిక తో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. పుట్టపర్తి కి నిశ్చితార్థం తర్వాత స్వామి దర్శనం కోసం వెళ్లారు. తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అయితే విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది అనే విషయం తెలుసుకున్న వెంటనే ఆయన అభిమానులు సోషల్ మీడియా లో కంగారుపడ్డారు. మా అభిమాన హీరోకి ఎలా ఉందో ఏంటో అని బాధపడుతూ పోస్టులు పెట్టారు. కానీ భయపడాల్సిన అవసరం ఏ మాత్రం లేదని, కేవలం కారు మాత్రమే దెబ్బ తిన్నది అనే విషయం తెలుసుకొని చల్లబడ్డారు. దయచేసి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త, మన తప్పు లేకపోయినా కూడా మనకే నష్టం జరుగుతుంది అంటూ అభిమానులు ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ని ట్యాగ్ చేసి చెప్పుకొచ్చారు. ఇకపోతే ఫ్యాన్స్ రష్మిక , విజయ్ దేవరకొండలకు సంబంధించిన నిశ్చితార్ధ ఫోటోల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్టులైన వీళ్లిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటే పెద్ద సెన్సేషనల్ న్యూస్ కదా. కానీ ఎందుకో వీళ్ళ పెళ్ళికి సంబంధించిన అన్ని వ్యవహారాలను చాలా గోప్యంగా ఉంచుతున్నారు.
బయట చెప్తే లేని పోనీ కథనాలు వస్తాయని భయపడుతున్నారా ఏమో తెలియదు కానీ, అభిమానులు మాత్రం ఈ విషయం లో కాస్త నిరాశకు గురి అవుతున్నారు. కనీసం పెళ్లి అయినా అభిమానులకు చెప్పి బహిరంగంగా చేసుకుంటారా?, లేకపోతే ఈ పెళ్లిని కూడా రహస్యంగా చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. రష్మిక గతంలో కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి తో నిశ్చితార్థం చేసుకుంది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ నిశ్చితార్థం బ్రేక్ అయ్యింది. ఇక అప్పటి నుండి రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ నుండి, అదే విధంగా కన్నడ జనాల నుండి ఘోరమైన నెగిటివిటీ ని ఎదురుకుంటూ వస్తుంది రష్మిక. అందుకే ఈ పెళ్లి వ్యవహారాన్ని గోప్యంగా ఉంచాలని చూస్తుంది అంటూ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.
గద్వాల: విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం
సురక్షితంగా బయటపడ్డ విజయ్ దేవరకొండ
స్నేహితుడి కారులో వెళ్లిపోయిన విజయ్ దేవరకొండ
పుట్టపర్తి వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదం
గద్వాల జిల్లా ఉండవల్లి దగ్గర ప్రమాదం#VijayDeverakonda #Tollywood #TV9Telugu pic.twitter.com/Qykr6F8POD— TV9 Telugu (@TV9Telugu) October 6, 2025