https://oktelugu.com/

YS Sharmila : ప్రియాంక ఆఫర్.. కాంగ్రెస్ తో షర్మిల?

ఈ మేరకు షర్మిలతో కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలకపాత్ర పోషించారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ,అయితే వాటికి తాను సమాధానం చెప్పడం లేదని షర్మిల చెప్పారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 22, 2023 / 08:18 PM IST
    Follow us on

    YS Sharmila : చుక్కాని లేని నావలా తిరుగుతోంది మన షర్మిల. ఆంధ్రాలో పుట్టిన ఈ ఆడకూతురు మెట్టినింట పాదయాత్ర చేస్తూ కష్టపడుతోంది. అయితే ఆంధ్రా ఆడకూతురు అన్న ట్యాగ్ పోలేదు. అందుకే జనాల్లో ఆదరణ కరువైంది. అప్పుడు ఎప్పుడో సంక్షేమ రాజ్యం తెచ్చిన వైఎస్ఆర్ ను తెలంగాణ ప్రజలు మరిచిపోయారు. ఏపీలో మాత్రం ఆయన వారసుడిని సీఎంను చేసిన ప్రజలు.. విభిన్నమైన ప్రాంతీయవాదంతో విడిపోయిన తెలంగాణలో మాత్రం మరో బిడ్డ షర్మిలను ఆదరించలేదు. అందుకే 4వేల కి.మీల పాదయాత్ర చేసినా కూడా షర్మిలకు ఆదరణ దక్కలేదు.

    ప్రజల్లో ఎలాగూ ఆదరణ లేదు. ఇటీవల కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం నేతలను కలిసి కేసీఆర్ పై పోరాడుదామని అన్నా ఆమెను ఎవరూ నమ్మలేదు. దగ్గరకు రానీయలేదు. షర్మిల ఆటిట్యూడ్ వల్లే ఇదంతా దాపురించిందన్న గుసగుసలు ఉన్నాయి. అయితే సొంతంగా పార్టీ పెట్టి ఎదగలేకపోతున్న షర్మిలకు ఇప్పుడు కాంగ్రెస్ గాలం వేస్తోంది. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తన తోటి మహిళా నేత అయిన షర్మిలకు ఫోన్ చేసి చర్చలు జరిపారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన కలయిక దిశగా అడుగులు పడుతున్నాయి.

    తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయడం ద్వారా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను బలమైన శక్తిగా మార్చాలని, కేంద్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతోంది. దీనిలో భాగంగానే వివిధ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో స్థానికంగా కొన్ని సామాజిక వర్గాల్లో ప్రభావం చూపించగలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనిలో భాగంగానే తెలంగాణలో వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీతోను పొత్తు పెట్టుకునే దిశగా కాంగ్రెస్ హై కమాండ్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

    ఈ మేరకు షర్మిలతో కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలకపాత్ర పోషించారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ,అయితే వాటికి తాను సమాధానం చెప్పడం లేదని షర్మిల చెప్పారు.

    ఇప్పుడు స్వయంగా ప్రియాంక గాంధీ షర్మిలతో ఫోన్ లో సంప్రదింపులు చేయడం, దీనికి డీకే శివకుమార్ మధ్యవర్తత్వం వహించడంతో పొత్తు పెట్టుకునే దిశగానే ఈ రెండు పార్టీల మధ్య వ్యవహారం నడుస్తుంది అనే అనుమానాలు కలుగుతున్నాయి.డీకే శివకుమార్ త్ షర్మిల కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉండడంతో, ఆయన ద్వారానే షర్మిలను ఒప్పించి కాంగ్రెస్ తో కలిసి నడిచే విధంగా చేసేందుకు కాంగ్రెస్ .ప్రయత్నాలు చేస్తూ ఉండడం, రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు ఏపీ తెలంగాణలో ఆ వర్గం ప్రజల్లో కాంగ్రెస్ పై ఆదరణ పెరుగుతుందనే అంచనాలతోనే షర్మిల తో ప్రియాంక మంతనాలు చేస్తున్నారట.

    షర్మిల పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా , కాంగ్రెస్ కు అదనపు బలం చేకూరుతుందని, తెలంగాణలో ముందుగా ఎన్నికలు జరగబోతుండడంతో, అక్కడ ప్రభావం చూపిస్తే ఆ తర్వాత షర్మిల ద్వారానే ఏపీలోనూ కాంగ్రెస్ కు రెడ్డి సామాజిక వర్గం అండదండలు అంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం దిశగా.. ఏపీలో బలోపేతం దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.