https://oktelugu.com/

CM Revanth Reddy Birthday: పగవాడు అయినా రేవంత్ రెడ్డికి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన ప్రధాని మోడీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 55వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా జరుపుకుంటున్న తొలి పుట్టిన రోజు కావడంతో ఇది ఆయనకు ప్రత్యేకం.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 8, 2024 / 12:22 PM IST

    CM Revanth Reddy Birthday(1)

    Follow us on

    CM Revanth Reddy Birthday: తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ను గద్దె దించి… పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన రేవంత్‌రెడ్డికి ఇటు రాష్ట్రంలో, అటు హైకమాండ్‌ వద్ద ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన పడిన కష్టానికి గుర్తింపుగా అధిష్టానం సీఎంను చేసింది. దీంతో ఇప్పటి వరకు ఆయన జరుపుకున్న పుట్టిన రోజులన్నింటికన్నా ఈసారి జరుపుకుంటున్న 55వ పుట్టిన రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ముఖ్యమంత్రి హోదాలో జరుపుకుంటున్న ఫస్ట్‌ బర్త్‌డే ఇది. దీంతో ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పుట్టిన రోజులు కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంత్రులు, నాయకులు, కార్యకర్తలు వేడుకల్లో పాల్గొంటున్నారు. పత్రికల్లో ప్రకటనలు, కూడళ్లలో శుభాకాంక్షల ఫ్లెక్సీలతో నిండిపోయాయి. ఇక వ్యక్తిగతంగానూ చాలా మంది రేవంత్‌రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా ఎక్స్‌ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ప్రధాని మోదీ కూడా తెలంగాణ సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు సీఎంకు సందేశం పంపించారు. ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు. సుఖసంతోషాలతో ఉండాలని అభిలషిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈమేరు ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.

    యాదాద్రిలో పూజలు..
    ముఖ్యమంత్రిగా తొలి పుట్టిన రోజు జరుపుకుంటున్న రేవంత్‌రెడ్డి యాదాద్రి లక్ష్మీనృసింహజ్వామిని దర్శించుకోనున్నారు. ఈమేరకు ఆయన హెలిక్యాప్టర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రికి బయల్దేరారు. స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు ఆయనను ఆశీర్వదించారు. తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ సమస్యలు, అభివృద్ధిపై అధికారులతో సమీక్ష చేశారు. తర్వాత మిషన్‌ భగీరథలో భౠగంగా నిర్మించనున్న పైపులైన్‌ పనులకు శంకుస్థాపన చేస్తారు. పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్‌ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో 500 గ్రామాలకు మంచినీటిని అందించడానికి ఈ ప్రాజెక్టును రూపొందించారు. నిర్మాణ వ్యయం రూ.210 కోట్లు.

    మధ్యాహ్నం పాదయాత్ర…
    ఇక సీఎం రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 2:19 నిమిషాలకు సంగెం వెళ్లారు. భీమలింగం వంతెన వరకు మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర చేస్తారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఈ పాదయాత్ర ఉంటుంది. మూసీ బాధితుల సమస్యలు తెలుసుకుంటారు. నిర్వాసితులకు భరోసా కల్పిస్తారు.

    అధ్వాని బర్త్‌డే..
    ఇదిలా ఉంటే.. బీజేపీ కురవృద్ధుడు లాల్‌ కృష్ణ అధ్వాని పుట్టిన రోజు కూడా నవంబర్‌ 8నే. ప్రధాని మోదీ ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. అధ్వానీ 97వ వసంతంలోకి అడుగు పెట్టారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అందుకున్న తర్వాత అధ్వానీ జరుపుకుంటున్న మొదటి పుట్టిన రోజు వేడుక ఇదీ. దీంతో ఇది కూడా ఆయనకు ప్రత్యేకమే.