Prakash Raj : తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారని ఏపీ సీఎం చంద్రబాబు నాయకుడు సెప్టెంబర్‌లో ఆరోపించారు. దీనిపై డిప్యూటీ సీఎం కూడా ఆరోపణలు చేశారు. కల్తీ జరిగింది వాస్తవమే అని వారే నిర్ధారించారు. తర్వాత ల్యాబ్ రిపోర్టు విడుదల చేశారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అయితే ప్రాయచిత దీక్ష చేపట్టారు. తిరుపతికి మెట్ల మార్గంలో వెళ్లి బుధవార(అక్టోబర్ 2న) దీక్ష విరమించారు. ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్ నటుడు కూడా దీంతో ఆయన టార్గెట్‌గా మరో నటుడు ప్రకాశ్‌రాజ్ ట్వీట్ల వర్షం కురిపించారు. లడ్డూ విషయంలో భక్తులతో ఆడుకోవద్దని సూచించారు. రాజకీయాలు మాని ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. తాజాగా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారు చెప్పిన మాటలను పోస్టు చేసి పవన్‌పై పెటైర్లు వేశారు. ‘నువ్వు మైనారిటీవి. అయినా నిజం ఎప్పటికీ నిజమే’ – గాంధీ, మనకు దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు ఉన్నాయి. ఇదే భారత్ పాకిస్తాన్ మధ్య తేడా – లాబ్ మహదుర్ శాస్త్రి అని ట్వీట్ చేశారు. తాజాగా తెలంగాణ రాజకీయాలపైనా ప్రకాశ్‌రాజ్ స్పందించారు. కేటీఆర్‌ను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈమేరకు ట్వీట్ చేశారు.
కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..
మంత్రి కొండా సురేఖ ఫొటోను బీఆర్‌ఎస్ నాయకులు ట్రోల్ చేయడంపై ఆమె కన్నీరు పెట్టుకున్నారు. బీసీ మహిళ అయిన తనను ట్రోల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ దీనిపై స్పందించకపోవడాన్ని తప్పు పట్టారు. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తీరుతో సిని పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని ఆరోపించారు. హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేశారని, కొంతమంది కాపురాలను కూల్చాడని పేర్కొన్నారు. కొందరు కేటీఆర్ వేధింపులు తట్టుకోలేక ఇండస్ట్రీని విడిచి పోయారని తెలిపారు. సమంత–నాగచైతన్య విడాకులకు కేటీఆరే కారణమని అధికారికంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఒక మహిళగా తనపై బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ట్రోలింగ్‌ను కేటీఆర్ ఖండించకపోవడం బాధాకరమన్నారు. ఆయనకు మహిళలపై ఉన్న గౌరవానికి ఇదే నిదర్శనమన్నారు. బీసీ మహిళనైన తనపై పోస్టులుపెట్టాలని కేటీఆరే చెప్పినట్లు ఉన్నారని ఆరోపించారు. తనతోపాటు గిరిజన మహిళ సీతక్క, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలోఇ్మపైనా ఇలాగే చేశారని తెలిపారు. అయినా కేటీఆర్ నోరు మెదపకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
సినిమావాళ్లంటే చులకనా?
ఇదిలా ఉంటే.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్‌రాజ్ స్పందించారు. అసహనం వ్యక్తం చేశారు. ‘సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూపా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. రాజకీయాల్లోకి సినిమావాళ్లను లాగడం ఏంటని నిలదీశారు. సిగ్గులేని రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. దీంతో పరోక్షంగా కేటీఆర్‌కు అండగా నిలిచారు ప్రకాశ్‌రాజ్. మరి ప్రకాశ్‌రాజ్ ట్వీట్‌పై కాంగ్రెస్ పార్టీగానీ, మంత్రి సురేఖ గానీ ఎలా స్పందిస్తారో చూడాలి.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Prakash raj another twitter post over minister konda surekha comments on ktr
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com