https://oktelugu.com/

Tollywood : మొన్న జానీ మాస్టర్‌.. నిన్న హర్ష సాయి.. నేడు మల్లిక్‌ తేజ.. ఇలా తయారయ్యారేంటి స్వామి!

తెలుగు రాష్ట్రాల్లో, సినిమా ఇండిస్ట్రీకి చెందినవారిపై లైంగికదాడి ఆరోపణలు పెరుగుతన్నాయి. నెల వ్యవధిలో ముగ్గురిపై కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 29, 2024 / 04:13 PM IST

    Folk Singer malik Teja

    Follow us on

    Tollywood : సినిమా ఇండిస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. ఇందులో మంచి చెడు రెండూ ఉన్నాయి. ఒక్క ఛాన్స్‌ అంటూ వందల మంది ఇండస్ట్రీకి వస్తున్నారు. కానీ, నిలదొక్కుకునేది కొందరే. అయితే అవకాశాల కోసం కొందరు నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలతో ఫిజికల రిలేషన్‌షిప్‌ కూడా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇండస్ట్రీలో అవకాశాలు ఉన్నన్ని రోజులు వీటి గురించి మాట్లాడని హీరోయిన్లు, మహిళా నటులు.. అవకాశాలు తగ్గాక వీటిని బయట పెడుతున్నారు. ఇటీవలే మళయాల ఇండస్ట్రీలో వేధింపులపై బహిర్గతమైన కమిటీ ఆ ఇండస్ట్రీని షేక్‌ చేస్తోంది. ఈ క్రమంలో తెలుగు ఇండస్ట్రీపైనా ఓ కమిటీ వేయాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ఇలాంటి తరుణంలోనే డాన్స్‌ మాస్టర్‌ జానీపై ఆయన అసిస్టెంట్‌ తనను లైంగికంగా వేధిస్తున్నాడని. తనపై పలుమార్లు లైంగికదాడి చేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

    ముగిసిన కస్టడీ..
    జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. కోర్టులో హాజరు పర్చడంతో 14 రోజులు రిమాండ్‌ విధించింది. తర్వాత పోలీసుల పిటిషన్‌తో 4 రోజులు కస్టడీకి ఇచ్చింది. పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ చేసింది. ఇందులో యువతి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు జానీ మాస్టర్‌ చెప్పారని సమాచారం.

    యూట్యూబర్‌పై..
    ఇక యూట్యూబర్‌ హర్షసాయిపైనా తాజాగా మరో యువతి ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని రూ.2 కోట్లు వసూలు చేశాడని, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని పేర్కొంది. ప్రస్తుతం హర్షసాయి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో బాధితురాలు మళ్లీ తనను బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో నార్సింగ్‌ పోలీసులు హర్షసాయి కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

    తాజాగా మల్లిక్‌ తేజపై..
    ఇక తాజాగా మరో కళాకారుడిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. యూట్యూబ్‌లో తన పాటలతో గుర్తింపు తెచ్చుకున్న ఫోక్‌ సింగర్‌ మల్లిక్‌ తేజ తనపై లైంగికదాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేశారు. జగిత్యాల జిల్లాకు చెందిన మల్లిక్‌ తేజ ఎన్నో పాటలు రాశాడు. గీతాలు, ఫోక్‌ సాంగ్స్, ప్రాంతీయ పాటలతో ఫేమస్‌ అయ్యాడు. మిల్లిక్‌ తేజ జగిత్యాలకు చెందిన ఓ యువతికి సింగర్‌గా అవకాశం ఇచ్చాడు. ఇద్దరూ హైదరాబాద్, దుబాయ్‌లో పలుచోట్ల ఈవెంట్లు కూడా చేశారు. ఈ క్రమంలో మల్లిక్‌తేజ తనపై లైంగికదాడి చేశాడని జగిత్యాల పోలీసులను ఆశ్రయించింది. ఛాన్సుల పేరుతో వేధిస్తున్నాడని పేర్కొంది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ పాస్‌వర్డ్‌ మార్చి ఇబ్బంది పెడుతున్నట్లు వెల్లడించింది. బ్లాయ్‌మెయిల్‌ చేసి స్టూడియోలోనే తనపై లైంగికదాడి చేశాడని పేర్కొంది.

    సెలబ్రిటీలపైనే…
    ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు సాధారణమే అనేది జగమెరిగిన సత్యం. కానీ, ఫేమస్‌ అయినవారినే కొందరు టార్గెట్‌ చేస్తున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి. హీరో రాజ్‌తరుణ్, లావణ్య ఎపిసోడ్‌ కూడా ఇంకా కొనసాగుతోంది. తర్వాత జానీ మాస్టర్, యూట్యూబర్‌ హర్షసాయి, ఇప్పుడు మల్లిక్‌ తేజపై ఫిర్యాదులు వచ్చాయి.