Pawan Kalyan Hindi Controversy: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ) మరోసారి హిందీ భాష పై మాట్లాడారు. గత కొద్దిరోజులుగా హిందీ భాషకు మద్దతుగా ఆయన మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. బిజెపి ప్రోత్సాహంతోనే ఆయన అలా మాట్లాడుతున్నారని విమర్శలు వచ్చాయి. బిజెపికి వ్యతిరేక పార్టీలన్నీ ఈ వ్యాఖ్యలను ఖండించాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపించింది. హిందీని పెద్దమ్మతో పోల్చుతూ.. మాతృభాషను అమ్మతో పోల్చారు పవన్ కళ్యాణ్. దీనిని ఎక్కువమంది తప్పు పట్టారు. ప్రకాష్ రాజ్ లాంటివారు అమ్ముడు పోయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా సరే పవన్ కళ్యాణ్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తాజాగా టైమ్స్ నౌ ఛానల్ ఇంటర్వ్యూలో హిందీ భాషపై మరోసారి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఈసారి తెలంగాణ నేతలను టార్గెట్ చేశారు.
Also Read: ఈ ఒక్క ఫోటో తెలంగాణ బీజేపీని షేక్ చేసింది
అప్పటినుంచి ప్రతికూలత
హిందీ భాషను( Hindi language) దక్షిణాది రాష్ట్రాలపై బలంగా రుద్దుతున్నారన్న కామెంట్స్ వినిపించాయి. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. హిందీ భాష పై వివాదం వచ్చినప్పుడల్లా దాని వెనుక బిజెపి ఉంటుంది. అయితే ఆ మధ్యన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థ అవసరం అని భావించారు. హిందుత్వ వాదాన్ని తెరపైకి తెచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా తమిళనాడు నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే పవన్ సైతం తమిళనాడు పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. దీని వెనుక బిజెపి అజెండా ఉందన్న ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హిందీ భాష పై తరచూ మాట్లాడుతుండడానికి కూడా తమిళ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇటీవల దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకు చెందిన నేతలు సైతం హిందీ భాష విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే మాతృభాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ ఉంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు పవన్. కానీ ఇంగ్లీష్ తో పాటు మాతృభాష ఉంటే సరిపోతుందని కొన్ని రాష్ట్రాల నేతలు తేల్చి చెబుతున్నారు.
Also Read: రాహుల్ గాంధీ ఫోన్ ట్యాప్ అవుతోందా.. అదీ రేవంత్ రెడ్డి చేయిస్తున్నాడా..
తెలంగాణ నుంచి అభ్యంతరాలు
అయితే ఈ క్రమంలో హిందీ భాష పై తెలంగాణ( Telangana) నుంచి కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇది కేవలం రాజకీయ కోణంలో ఆలోచిస్తే సరిపోదని.. పవన్ కళ్యాణ్ అభిప్రాయపడుతున్నారు. రాజకీయ కోణంలో ఆలోచించి వ్యతిరేకించడం తగదు అంటున్నారు. రాష్ట్రంలో ఉన్నంతవరకే మాతృభాష అని.. బయటకు వెళ్లి ఉపాధి పొందాలంటే హిందీ తో పాటు ఇంగ్లీష్ అవసరం అని గుర్తు చేస్తున్నారు. అయితే కొత్తగా తెలంగాణ నేతలు సైతం హిందీ భాషను వ్యతిరేకించడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు పవన్. ఉర్దూ మిక్సింగ్ తో కూడిన భాష పై అభ్యంతరం లేనప్పుడు.. హిందీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటూ పవన్ ప్రశ్నించారు. ఈ విషయంలో తెలంగాణ నేతలు పునరాలోచన చేయాలని కోరుతున్నారు. మొత్తానికి అయితే పవన్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.