Pawan Kalyan vs KTR: హిందీ భాషపై ఏడాది కాలంగా రగడ జరుగుతోంది. హోం మంత్రి ఇటీవల ఇంగ్లిష్ ఎందుకు చదివామా అని బాధపడే రోజు వస్తుందని వ్యాఖ్యానించారు. మరోవైపు మహారాష్ట్రకు చెందిన ఓ వ్యాపారి.. ఇటీవల తాను మహారాష్ట్రలో ఉన్నా.. హిందే మాట్లాడతానని, ఏనాడూ మరాఠీ మాట్లాడలేదని పేర్కొన్నారు. దీంతో శివసేన ఉద్ధవ్‌ఠాక్రే, రాజ్‌ఠాక్రే అనుచరులు ఇటీవల దాడులు చేశారు. ఇక ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తెలుగు మన అమ్మ భాష అయితే.. హిందే పెద్దమ అని కొనియాడారు. ఇక తెలంగాణకు చెందిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ తాజాగా హిందీకి జాతీయ భాష హోదా తొలగించాలని డిమాండ్ చేశారు. ఇద్దరు తెలుగు రాష్ట్రాల నేతలు.. ఇద్దరూ ప్రజాదరణ ఉన్న నాయకులు.. ఇద్దరూ హిందీ విషయంలో తలోమాట మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Also Read: ఢిల్లీకి చేరిన బండి-ఈటల పంచాయతీ
హిందీని ప్రోత్సహిస్తునర్న పవన్..
పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశంలో హిందీ భాష ప్రచారానికి ముందుండి నడిపిస్తున్నారు. హిందీని రెండవ భాషగా నేర్చుకోవాలని, ఇది జాతీయ సమైక్యతకు తోడ్పడుతుందని ఆయన భావిస్తున్నారు. తాను బాల్యంలో హిందీని రెండవ భాషగా నేర్చుకున్నానని, అప్పట్లో ఎటువంటి వ్యతిరేకత లేదని పేర్కొన్నారు. హిందీ భాష ప్రచారం ద్వారా భారతీయ సంస్కృతి, జాతీయ ఏకీకరణను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా, ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు. హిందీ ప్రచారం వెనుక బీజేపీ జాతీయ ఎజెండాకు మద్దతు ఉందని విశ్లేషకుల అభిప్రాయం.
జాతీయ భాష హోదా ఎందుకు..
తెలంగాణలో బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్ హిందీని ‘జాతీయ భాష’గా ప్రచారం చేయడాన్ని తప్పు పట్టారు. భారత రాజ్యాంగం ప్రకారం హిందీ జాతీయ భాష కాదని, ఇది కేవలం ఒక అధికారిక భాష మాత్రమేనని స్పష్టం చేశారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో హిందీని బలవంతంగా రుద్దడం స్థానిక భాషలు, సంస్కృతులకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు బీజేపీ జాతీయ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉన్న బీఆర్‌ఎస్ వైఖరిని ప్రతిబింబిస్తాయి. హిందీ రుద్డడం ద్వారా ఉత్తర భారత సంస్కృతిని దక్షిణ భారతదేశంపై ఆధిపత్యం చేసే ప్రయత్నంగా కేటీఆర్ దీనిని చూస్తున్నాడు. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు కేటీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారు. హిందీ ప్రచారం స్థానిక భాషల అభివృద్ధికి ఆటంకంగా మారవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు.
Also Read: పగోడైనా.. కేటీఆర్ కు రేవంత్ ప్రేమతో..
పవన్ పరోక్ష వ్యాఖ్యలు..
పవన్ కళ్యాణ్ తన తాజా వ్యాఖ్యలలో కేటీఆర్‌ను పేరుపేరునా ప్రస్తావించకపోయినా, తెలంగాణలోని కొంతమంది నాయకులు హిందీని వ్యతిరేకిస్తున్నారని, వారి వ్యతిరేకత బీజేపీ, మోదీపై ద్వేషం నుంచి వస్తుందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు హిందీ భాష చుట్టూ ఉన్న చర్చను మరింత తీవ్రతరం చేశాయి. ఇది తెలుగు, హిందీ భాషల మధ్య ఉన్న రాజకీయ, సాంస్కృతిక ఉద్రిక్తతలను పెంచేలా ఉంది.