Homeక్రైమ్‌OYO Rooms And Co-living hostels: ఓయో రూంలు, కో లివింగ్ హాస్టల్స్ లో ఉంటూ...

OYO Rooms And Co-living hostels: ఓయో రూంలు, కో లివింగ్ హాస్టల్స్ లో ఉంటూ ఇదేం పని రా బాబూ.. పోలీసులకు దిమ్మ దిరిగిపోయిందిగా!

OYO Rooms And Co-living hostels: హైదరాబాద్ నగరం మరింత వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకు మాత్రమే హోటల్స్ పరిమితమయ్యేవి. ఇప్పుడు అన్ని ప్రాంతాలలో హోటల్స్ ఏర్పాటు అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరు పొందిన మాదాపూర్ లో బహుళ అంతస్తుల్లో హోటల్స్, హాస్టల్స్ నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో కో లివింగ్ హాస్టల్స్ ఏర్పాటయ్యాయి. వీటిపై రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ వీటిని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

Also Read: తెలంగాణలో సింగిల్ విండో ఎన్నికలు లేనట్లేనా..?

మాదాపూర్ ప్రాంతంలో ఉన్న హోటల్స్, కో లివింగ్ హాస్టల్స్ లో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఇటీవల పోలీసులకు సమాచారం అందింది. దీంతో యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) పోలీసులు దాడి చేశారు. స్వదేశీ, విదేశీ మహిళలను పట్టుకున్నారు. పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ లోని గాయత్రి నగర్, పర్వత నగర్ ప్రాంతంలోని సూపర్ లగ్జరీ లివింగ్ హోటల్లో గుట్టు చప్పుడు కాకుండా అనైతిక కార్యకలాపాలు సాగిస్తున్న ఓ ముఠా గురించి పోలీసులకు సమాచారం అందింది. ఆధారాలు పరిశీలించి వెంటనే వారు దాడి చేశారు. పలు రాష్ట్రాల నుంచి యువతులను హైదరాబాద్ కు రప్పించి.. వారితో అనైతిక కార్యక్రమాలను నిర్వహించడం.. వాటి విషయాలు పోలీసుల దృష్టికి వచ్చాయి. ఈ అనైతిక కార్యకలాపాలు నిర్వహించడానికి నిర్వాహకులు సోషల్ మీడియాను.. ఇతర మాధ్యమాలలో ఉపయోగించుకుంటున్నారు.. వాట్సాప్ లో పలు గ్రూపులు కూడా ఏర్పాటుచేసి.. విభాగాల వారీగా చార్జీలు వసూలు చేస్తున్నారు.

Also Read: రేవంత్‌కన్నా కేసీఆరే బెటరంట..! తాజా సర్వే సంచలనం!

పోలీసుల దాడిలో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల చెందిన ఏడుగురు మహిళలను పోలీసులు పట్టుకున్నారు. వీరు మాత్రమే కాకుండా ఉజ్బెకిస్థాన్, తుర్కమెనిస్థాన్ ప్రాంతాలకు చెందిన ఇద్దరు మహిళలను కూడా పట్టుకున్నారు. వారిని పోలీసులు స్టేట్ హోంకి తరలించారు. అయితే ఈ కార్యకలాపాలను నిర్వహిస్తున్న వ్యక్తి పేరు అమర్ సింగ్ అలియాస్ అమిత్ సింగ్ అని పోలీసులు చెబుతున్నారు. పోకల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సూపర్వైజర్ గా వ్యవహరిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. బెక్ మోటోవా గుల్ షాట్, రఖ్మా నోవా మలాకా, లోవినా బోరా, తూము లక్ష్మణ్, ఆకాష్ బజాజ్, ఘోర మహమ్మద్ వసీం, పార్తి బన్ అనే వ్యక్తులు పరారీలో ఉన్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular