Telugu Media News Channels Owner : నచ్చని వాళ్ళ మీద బురద చల్లడం.. గిట్టని వాళ్ళ మీద రాళ్లు వేయడం ఆ మీడియా ఓనర్ కు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. పైగా ఆయనకు నోటి దురద కూడా ఎక్కువ. బూతులు అలవోకగా మాట్లాడిస్తుంటాడు. బ్లాక్మెయిలింగ్ జర్నలిజానికి పాల్పడుతుంటాడు. అందువల్లే అతడిని ఒక సెక్షన్ విపరీతంగా తిడుతూ ఉంటుంది. అయినప్పటికీ అతడు పట్టించుకోడు. తన సంస్థలో పనిచేసిన ఉద్యోగులకు గొప్పగా జీతాలు ఇవ్వడు.. సంపాదించుకునే అవకాశాలు మాత్రం కల్పిస్తాడు. అందువల్లే ఆయన సంస్థల్లో ఏళ్లకు ఏళ్లుగా బ్యూరో చీఫ్ లు, బ్రాంచ్ మేనేజర్లు, ఎడిషన్ ఇన్చార్జిలు జిల్లాల్లో పాతుకుపోయారు.. వీళ్ళు కొత్త వాళ్లను ఎదగనివ్వరు. ఎవరైనా ఎదురు తిరిగితే బదిలీని బహుమానంగా అందిస్తారు. లేకుంటే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తారు.
చిలక్కొట్టుడు వ్యవహారాలకు తక్కువ లేదు
ఇక ఆ మీడియా అధినేత గతంలో తన సతీమణి కోల్పోయాడు. అంతకుముందు ఆమె జీవించినప్పుడు కూడా చిలక్కొట్టుడు వ్యవహారాలకు తక్కువ లేదట. తన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఓ మహిళతో అప్పట్లో సంబంధాలు నడిపే వాడట. ఆమెకు పుట్టిన కుమారుడు అచ్చం ఈయన లాగానే ఉండేవాడని సెంట్రల్ డెస్క్ లో చెవులు కొరుక్కునే వారట. పైగా తన వ్యక్తిగత కార్యదర్శి కుమారుడిని అందరూ చూస్తుండగానే ముద్దు చేసేవాడట. తన కార్యాలయానికి తీసుకెళ్లి ఆడుకునే వాడట. 60 ఏళ్లు దాటినా జుట్టుకు రంగు వేసుకుని.. పూలరంగడిలాగా పబ్ లు, పార్టీలు అంటూ తిరిగే వాడట. భార్య గతించిపోయిన తర్వాత ఆయన “ముసలోడికి దసరా పండుగ” వేషాలకు తిరుగులేకుండా పోయిందట. ఇదే క్రమంలో ఓ మహిళ డాక్టర్ తో అతడు సహజీవనం మొదలుపెట్టాడట. అయితే ఇది ఏకంగా పెళ్లి వరకు వచ్చిందని తెలుస్తోంది. అయితే ఈ ప్రస్తావనను కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్తే.. వారు వద్దని వారించారట. నలుగురు కుటుంబ సభ్యుల్లో ఎవరూ ఆయన వివాహానికి ఓకే చెప్పలేదట. దీంతో ఆయన ఇంటికి రావడం మానేశాడట. కేవలం ఛానల్ ఆఫీస్ కి మాత్రమే వస్తున్నాడట. హైదరాబాద్ నగరానికి శివారులో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఆ మహిళా డాక్టర్ తో కలిసి సహజీవనం చేస్తున్నాడట. అయితే ఈ మీడియా అధినేతకు పేపర్ ఉందని ముందే చెప్పుకున్నాం కదా.. అయితే ఆ పేపర్ కార్యాలయానికి కూడా ఈయన రావడంలేదట. గతంలో రాత్రి 12 గంటల వరకు పత్రికా కార్యాలయంలో ఉండి.. ఫస్ట్ పేజ్ బ్యానర్ చూసుకునేవాడట . కొన్ని సంవత్సరాలుగా ఆఫీస్ కు రాకపోవడంతో అక్కడ ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తిదే పెత్తనం నడుస్తున్నదట. ఇప్పుడు అక్కడ కూడా రెండు వర్గాలు ఏర్పడ్డాయట.. మొత్తంగా మీడియా అధినేత వ్యవహారం చూడబోతే దువ్వాడ శ్రీనివాస్ – మాధురి ఎపిసోడ్ ను తలపిస్తోంది. అయితే ఆ మీడియా అధినేతకు ఒక భారీ భవంతి ఉందట. ఆయన రెండో పెళ్లి చేసుకుంటే ఆ భవంతి తన రెండవ భార్యకు వెళ్ళిపోతుందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారట. ఆ భవంతి వ్యవహారం తేలే వరకు రెండవ పెళ్లి అనే మాట తమ వద్ద తీసుకురావద్దని అతడికి అల్టిమేటం జారీ చేశారట. చూడాలి మరి ఏం జరుగుతుందో..