CM Revanth Reddy: భారత ప్రధాని నరేంద్రమోదీతోపాటు.. దేశంలోని పలు దేశాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు తీసుకురావడానికి మొదటగా వెళ్లేది అగ్రరాజ్యం అమెరికాకే. ఇందుకు ప్రధాన కారణం.. భారత దేశంలో పుట్టి.. ఉన్నత చదువులు చదివి అమెరికాలో స్థిరపడిన అనేక మంది పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. ఈ నేపథ్యంలో భారత దేశంలో పెట్టుబడి పెట్టాలని కోరేందుకు మన నేతులు అమెరికా వెళ్తున్నారు. ఇక ప్రపంచ వాణిజ్య సదస్సులు నిర్వహించిన సమయంలోనూ వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలను పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నారు. గత డిసెంబర్‌లో జరిగిన పెట్టుబడిదారుల సదస్సుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు వెళ్లారు. పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. పెట్టుబడులకు ఆహ్వానించారు. తాజాగా మరోమారు తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడానికి మరోమారు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతికుమారితోపాటు అధికారుల బృందం ఆగస్టు 3న అమెరికా వెళ్లింది. అక్కడ భారత దేశానికి చెందిన పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతోంది. పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. సుమారు పది రోజులపాటు ఈ బృందం అమెరికాలో ఉండనుంది. ఇప్పటికే పలువురు ఎన్నారైలతో సమావేశాలు నిర్వహించారు. హైదరాబాద్, తెలంగాణలో పెట్టుబుడులు పెడితే కల్పించే సౌకర్యాలు, రాయితీల గురించి వివరించారు. ఇదిలా ఉంటే.. అమెరికా వెళ్లిన రేవంత్‌రెడ్డి గురించి ఓ ఎన్నారై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో రేవంత్‌రెడ్డి ఎన్నారైల గురించి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా అతను ప్రస్తావించారు.
ఏమన్నాడంటే…
టీవీ9 ఎన్నారై కార్యక్రమంలో భాగంగా ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటపై కాంగ్రెన్ మహిళా నేత భవానీరెడ్డితో ఇటీవల ఫోన్‌ఇన్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఓ ఎన్నారై ఫోన్ చేశాడు. ఆయన అడిగిన రెండు ప్రశ్నలు భవానీరెడ్డిని షాక్‌కు గురిచేశాయి. అవే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.
ఎన్నారై అడిగిన మొదటి ప్రశ్న.. ఎన్నారైలు అంటే నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని గతంలో వ్యాఖ్యానించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అమెరికాకు వచ్చాడు.?
రెండో ప్రశ్న.. ఎన్నారైలు అమెరికాలు బాత్రూంలు కడుగుతారు అన్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు మాకు పినాయిల్ అందించడానికి వచ్చాడా?
కేటీ ఆర్‌ను ఉద్దేశించి..
గతంలో రేవంత్‌రెడ్డి ఎన్నారైల గురించి పైన రెండు మాటలు అన్న మాట వాస్తవమే. కానీ అతను ఎన్నారైలందరినీ ఉద్దేవించి అన్నవి కావు. తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి చేసినవి. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా పాల్గొనని కేటీఆర్ ఎన్నారై కోటాలో వచ్చి మంత్రి అయ్యాడని ఇప్పటికీ రేవంత్ ఆరోపిస్తారు. తండ్రి పేరు చెప్పుకుని మంత్రి పదవి దక్కించుకున్నాడని విమర్శిస్తారు. అయితే ఇవే మాటలను ఇప్పుడు సదరు ఎన్నారై అందరికీ వర్తిస్తుంది అన్నట్లు మాట్లాడారు.
స్వాగతానికి జనమేరి..?
తెలంగాణలో అనేక మాటలు చెప్పి అధికారం చేపట్టిన రేవంత్‌రెడ్డి.. ఎన్పారైల ప్రాపకం కోసం పెట్టుబడుల కోసం అమెరికా వెళ్లాడు. అయితే కేటీఆర్ వెళ్లినప్పుడు ఆయనను స్వాగతించేందుకు ఎన్నారైలు తండోపతండాలుగా తరలి వచ్చారు. ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం సీఎం హోదాలో ముఖ్యమంత్రి వెళ్లినా పట్టుమని పది మంది కూడా రాలేదు. స్వాగతించలేదు. దీంతో రేవంత్ రెడ్డి సోదరుడే వెళ్లి అక్కడ తెలిసిన వారితో రేవంత్‌రెడ్డికి స్వాగతం పలికేలా చేశాడు. ఇందుకు కారణం కూడా ఎన్నారైలను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలే కారణం అంటున్నారు నిపుణులు.
అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి..
రాజకీయాల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ మాత్రం నోరు జారినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. గత అనుభవాలు అనేకం ఉన్నాయి. తాజాగా రేవంత్‌రెడ్డి ఇందుకు ఉదాహరణగా నిలిచారు. ఎన్నారైలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలకు అమెరికా ఎన్నారైలు బాగా నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకు తాజాగా వైరల్ అవుతున్న ఓ ఎన్నారై వ్యాఖ్యలు, అమెరికాలో రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ఇష్టపడని ఎన్నారైలే నిదర్శనం.
పాయికాన్లు కడిగే వారికీ చీపిరి అందించడానికి వస్తున్నావా అని రేవంత్ ని నిలదీసిన NRI మిత్రుడు…. pic.twitter.com/AUgRA3DII7
— Kalvakuntla Vidyasagar Rao (@Vidyasagarrao_K) August 5, 2024
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More