https://oktelugu.com/

Jobs: తెలంగాణ మరో కొలువుల జాతర.. ఈసారి విద్యుత్‌ శాఖలో.. ఎన్ని పోస్టులు.. అర్హతలు ఏంటంటే..

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగాల నియామకానికి ప్రాధాన్యత ఇస్తోంది. గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించి నియామకాలు పూర్తి చేస్తోంది. ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతోంది. ఈ క్రమంలోనే మరో నోటిఫికేషన్‌కు సిద్ధమైంది.

Written By:
  • Ashish D
  • , Updated On : January 18, 2025 / 12:05 PM IST
    Jobs

    Jobs

    Follow us on

    Jobs: తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కార్‌ ప్రభత్వుంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామకానికి(Job Recrutment) ప్రాధాన్యం ఇస్తోంది. పదేళ్లలో ఉద్యోగ నియామకాలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో యువత వ్యతిరేకంగా ఓటేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రేవంత్‌సర్కార్‌ ఉద్యోగ నియామకాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే గడిచిన ఏడాది కాలంలో 11 వేల పైచిలుకు పోస్టులతో డీఎస్సీ నిర్వహించి నియామకాలు పూర్తి చేసింది. ఇక గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపట్టింది. గ్రూప్‌1, గ్రూప్‌–2, గ్రూప్‌–3 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ జారీకి ప్రభుత్వం సిద్ధమైంది.

    విద్యుత్‌శాఖలో..
    తెలంగాణ విద్యుత్‌ శాఖ(Electricity Department)లో ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈమేరకు డిస్కంలు సిద్ధమవుతున్నాయి. విద్యుత్‌ శాఖలో మొత్తం 3,260 పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నియామక ప్రక్రియ త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. ఎన్‌పీడీసీఎల్‌(NPDCL) వరంగల్‌ పరిధిలో 2,212 జూనియర్‌ లైన్‌మన్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. అదనంగా 30 సబ్‌ ఇంజినీర్, 18 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు కూడా భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నియామకాలతో విద్యుత్‌ శాఖ పనితీరుమరింత మెరుగు పర్చడంతోపాటు అభ్యర్థులకు మంచి అవకాశాలు అందించనుంది.

    సౌత్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌పరిధిలో..
    ఇక సౌత్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ(SPDCL) పరిధిలో 600 జేఎల్‌ఎం, 300 సబ్‌ ఇంజినీర్, 100 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయడం ద్వారా శాఖ పనితీరు మెరుగు పడుతుందని, ప్రణాళికాబద్ధమైన శక్తిని అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవ్తసరంలో ఈ ఖాళీలను భర్తీ చేయాలని భావిస్తోంది. ఈమేరకు అధికారులు ఏర్పాటుచేస్తున్నారు. త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఎంపిక ప్రక్రియలో పారదర్శకతను పారిస్తూ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిస్కంలు భావిస్తున్నాయి.

    చిగురించిన ఆశలు..
    ఇక విద్యుత్‌ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో తాజా సమాచారంలో ఆశలు చిగురించాయి. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న అభ్యర్థులు ఈమేరు సిద్ధమవుతున్నారు. డిస్కంల నుంచి నోటిఫికేషన్‌ రాగానే పోటీ పడేందుకు సమాయత్తం అవుతున్నారు.