Notification: ప్రభుత్వం ఉద్యోగం కోసం ఎదరుచూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. శారీరక సామర్థ్యం కలిగి, మినిమం చదువుకున్న వారికి నియమించేందుకు దరఖాస్తులను ఆహ్వానింంచింది. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్(AOC) లో వివిధ ఖాళీలను భర్తీ చేయడానికి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలోని పలు రీజియన్లలో ఖాళీగా ఉన్న 723 పోస్టులకు ఉద్యోగాలకు ప్రకటించారు. ఈ దరఖాస్తులను డిసెంబర్ 22లోగా పంపించాలని తెలుపుతున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం చేయాలని చాలా మందికి కోరిక ఉంటుంది. అందులోనూ ఆర్మీ రంగంలో రాణించాలన్న ఉత్సాహం చాలా మంది యువకుల్లో ఉంటుంది. ఈ తరుణంలో ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ తాజాగా వేసిన నోటిఫికేషన్ నిరుద్యోగులకు అవకాశంగా మారింది. ఈ రంగంలోని మెటీరియల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్ెటంట్, ఫైర్ మాన్, సివిల్ మోటార్ డెలివరి ఆపరేటర్ గ్రేడ్ 2, ట్రేడ్స్ మాన్, పెయింటర్ ఎంటీఎస్ వంటి పోస్టుల్లో భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ దరఖాస్తులను www.aocrecruitment.gov.in అనే వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఈ పోస్టుల కోసం కొన్ని అర్హలతను సూచించారు. ఇందులో ప్రధానంగా దేహ ధారుడ్య పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే రాత పరీక్ష కూడా ఉంటుంది. ఆ తరువాత ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలను కల్పిస్తారు. ఉద్యోగాలు పొందిన తరువాత రూ.18,000 నుంచి రూ.56,900 వరకు జీతం పొందవచ్చు. ఫైర్ కు సంబంధించిన పోస్ట్రాన్ పోస్టులకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు జీతాన్ని పొందవచ్చు. డిగ్రీ లేదా డిప్లోమా చేసిన వారు మెటీరియల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలి. ఇంటర్ లేదా తత్సమాన కోర్సులు చేసిన వారు జూనియర్ అసిస్టంట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి టైపింగ్ లో అనుభవం ఉండాలి.
ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారు 18 నుంచి 25 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. బీసీలకు 3 సంవత్సరాల మినహాయింపుఉంటుంది. మాజీ సైనికులు కూడా దరఖాస్తు చేసుకోవాలి. వారికి కూడా కొన్ని నిబంధనలు సడలింపులు ఉంటాయి. దరఖాస్తును వెబ్ సైట్ ద్వారా మాత్రమే అప్లయ్ చేయాలి. ఇందులో పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ధ్రువీకరణ పత్రాలను అడుగుతారు. డిసెంబర్ 21 లోపు దరఖాస్తులు చేసుకోవాలి.
వ్రాత పరీక్షలో 150 ప్రశ్నలు ఉంటాయి. ఇవి మొత్తం ఆబ్జెక్టివ్ టైప్ లోనే ఉంటాయి. జనరల్ ఇంటలిజెన్స్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్ నెస్, ఇంగ్లీస్ విభాగాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తుంటాయి. రెండు గంటల పరీక్షా సమయం ఉంటుంది. ఒక్కో తప్పు మార్కుకు 0.25 మైనస్ మార్కులు ఉంటాయి. శారీరక ధారుడ్య పరీక్షలో ఫైర్ మెన్ అభ్యర్థులు తప్పనిసరిగా 1.6 కిలోమీటర్ల వరకు రన్నింగ్ చేయాలి. అలాగే బరువులు ఎక్కువగా మోసే పనులు చేయాల్సి ఉంటుంది.దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు గడువు కంటే ముందుగానే అప్లయ్ చేసుకోవడం మంచిది.