Jeevan Reddy: జీవన్ రెడ్డి వంటి వాళ్ళు బొచ్చెడు..ఐనా కేసీఆర్ జనం మీద రుద్దాడు

జీవన్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితిలో బొచ్చెడు. కింది స్థాయి ప్రజలను వేధించడం.. అడ్డగోలుగా సంపాదించడం. దళిత బంధు నుంచి మొదలు పెడితే అనేక పథకాల్లో కమీషన్లు గుంజారు. కోట్లకు ఎదిగారు..

Written By: Anabothula Bhaskar, Updated On : December 12, 2023 6:58 pm

MLA Jeevan Reddy

Follow us on

Jeevan Reddy: మొన్ననే కదా ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకున్నాడని.. అందులో మాల్ నిర్మించి అద్దె కూడా చెల్లించడం లేదని.. కరెంటు బిల్లు కూడా కట్టడం లేదని.. అందుకే దానికి కరెంటు సరఫరా నిలిపివేస్తున్నామని.. తమకు బకాయి చెల్లించాలని అటు కరెంట్ అధికారులు.. ఇటు ఆర్టీసీ అధికారులు మైక్ లో చెప్పింది.. అది మాత్రమే కాదు ఆ మాజీ ప్రజాప్రతినిధి ఏకంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు కూడా బకాయి ఉన్నాడట. అది కూడా ఏకంగా వడ్డీతో కలిపి 45 కోట్లట. ఉదయం నుంచి మీడియా, సోషల్ మీడియాలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.. వాస్తవానికి మన బ్యాంకింగ్ వ్యవస్థ ఒక రైతుకు ఇవాల్టికి సక్రమంగా రుణాలు ఇవ్వదు. భూమి కాగితాలు కుదువ పెట్టినా కనికరించదు. అదే అధికార పార్టీ నాయకుడైతే కళ్ళు మూసుకొని.. కళ్ళు అప్పగించి రుణం ఇస్తుంది. ఒకవేళ తిరిగి చెల్లించకుంటే మాఫీ చేస్తుంది.. ఎంతమంది నాయకులు ఇలా లబ్ధి పొందలేదు.. ఎంతమంది కార్పొరేట్లు తమ రుణాలను రైటాఫ్ చేయించుకోలేదు..

జనం మీద రుద్దింది ఇలాంటి వాళ్ళనే..

జీవన్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితిలో బొచ్చెడు. కింది స్థాయి ప్రజలను వేధించడం.. అడ్డగోలుగా సంపాదించడం. దళిత బంధు నుంచి మొదలు పెడితే అనేక పథకాల్లో కమీషన్లు గుంజారు. కోట్లకు ఎదిగారు.. అందినకాడల్లా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించారు. అందులో ఏకంగా పెద్ద పెద్ద భవనాలు నిర్మించారు. ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే కాదు అందరూ ఆ తాను ముక్కలే. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు జనం మీదకి కేసీఆర్ రుద్దాడు. నా పార్టీ నా ఇష్టం, నేను బీ ఫామ్ ఇచ్చాను. మీరు ఓటు వేసి గెలిపించాలి అన్నట్టుగా హుకుం జారీ చేశాడు.. జనం అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా.. కెసిఆర్ కు ఓట్ల రూపంలోనే సమాధానం చెప్పారు. కసి తీరా ఓట్లు వేసి ఓడించి చూపారు. ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడంతో గతంలో భారత రాష్ట్ర సమితి నాయకులు చేసిన దోపిడీ వ్యవహారాలు, అడ్డగోలుగా తీసుకున్న అప్పులు బయటకు వస్తున్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డి ఒక్కడే 45 కోట్ల అప్పు ఉన్నాడు అంటే.. మిగతావారి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇదే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తమ బకాయి చెల్లించాలని పదేపదే జీవన్ రెడ్డిని కోరినప్పటికీ పట్టించుకోలేదని తెలుస్తోంది. పైగా జీవన్ రెడ్డి ఈ అప్పును తన భార్య రజితా రెడ్డి పేరిట తీసుకున్నాడని సమాచారం.

పైగా బెదిరింపులు

ఇక ఈ జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్మూరు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి విజయం సాధించారు. జీవన్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గా కొనసాగినప్పుడు చేసిన అక్రమాలను ఇప్పుడు తవ్వుతున్నారు. అయితే ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సమాచారం. అదే విషయాన్ని రాకేష్ రెడ్డి విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. తనకు ప్రాణభయం ఉందని, జీవన్ రెడ్డి అనుచరులతో తనకు ముప్పు ఉందని వాపోయాడు.. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికే ఇలాంటి బెదిరింపు
కాల్స్ వస్తున్నాయంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అంటే వారు ఏమైనా చేయవచ్చు.. ఎలాంటి దుర్మార్గాల కైనా పాల్పడవచ్చు. ఎదురు ప్రశ్నిస్తే మాత్రం ఇలాంటి వాటిని ఎదుర్కోవాలన్నమాట.. ఇలాంటి వాళ్లను జనం మీదకి కెసిఆర్ రుద్దాడు. అందుకే అధికారాన్ని కోల్పోయాడు.