Knock Out Beers: వేసవి కాలం వచ్చిందంటే.. మందు బాబులు ఇష్టపడేది బీర్.. ఈ ఏడాది బీర్ల అమ్మకాలు ఆశించిన మేరకు జరుగలేదు. వాతావరణం చల్లబడడం కారణంగా బీర్ల అమ్మకాలు తగ్గాయి. అయితే అమ్మకాలు తగ్గడానికి తాజాగా మరో కారణం కూడా చెబుతున్నారు మందుబాబులు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న బీర్లలో కొన్ని బీర్లు రుచించడం లేదని పేర్కొంటున్నారు. బీరు ప్రియులు ఇష్టపడే నాకౌట్ రంగు రుచి మారిందని అంటున్నారు. కొన్ని బ్రాండ్లు దొరకడం లేదని చెబుతున్నారు. మరో కారణం ప్రభుత్వం లిక్కర్ ధరలు తగ్గించడం కూడా అంటున్నారు.
నాకౌట్ ఎందుకిలా..
నాకౌట్ బీర్‌ను తెలంగాణలో చాలా మంది ఇష్టపడతారు. దీంతో ప్రభుత్వం కూడా అన్ని మద్యం షాపులకు దీనిని సరఫరా చేస్తోంది. అయితే ఈ ఏడాది వేసవిలో కంపెనీ బీర్ల తయారీ ఫార్ములా మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో బీర్ల రుచి మారిందని పేర్కొంటున్నారు మందుబాబులు. మరోవైపు రంగు కూడా మారిందని పేర్కొంటున్నారు.
మూడు తాగినా లాభం లేదు..
గతంలో నాకౌట్ ఒక్క బీరు తాగితేనే మంచి కిక్కు వచ్చేదని బీరు ప్రియులు చెబుతున్నారు. ఇప్పుడు మూడు బీర్లు తాగినా ఎలాంటి కిక్కు ఎక్కడం లేదని పేర్కొంటున్నారు. తయారీ ఫార్ములా మార్చడం వలన బీర్లు క్వాలిటీ దెబ్బతిన్నదని చెబుతున్నారు. అందే ఇక నాకౌట్ బీర్లు తాగడం మానేఏసి ఇతర కంపెనీ బీర్లు తాగుతున్నట్లు చెబుతున్నారు.
అందుబాటులో ఉండక..
ఇక తెలంగాణలో మద్యం షాపుల యజమానుల సిండికేట్ కూడా బీరు ప్రియులకు కొన్ని బ్రాండ్లు దొరకకుండా చేస్తోంది. కమీషన్ ఎక్కువగా ఇచ్చే బీర్లనే వ్యాపారులు షాపుల్లో అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో ఇష్టమైన బ్రాండ్ దొరకక చాలా మంది బీర్లు తాగడం మానేస్తున్నారని పేర్కొంటున్నారు. గతంలో జగిత్యాల జిల్లాకు చెందిన బీరు ప్రియులు అయితే నాకౌట్ బీరు దొరకడం లేదని ప్రజావాణిలోనే ఫిర్యాదు చేశారు. వ్యాపారుల సిండికేట్ వ్యవహారాన్ని బయటపెట్టారు.
మొత్తంగా ఈ వేసవిలో నాకౌట్ ప్రియులకు నిరాశే మిగిలిందని బీరు ప్రియులు చెబుతున్నారు. పాత బీర్లు కావాలని కోరుతున్నారు. మరి కంపెనీ తమ కంపెనీ అభిమానుల మాట వింటుందో లేదో చూడాలి.