Namasthe Telangana- Sakshi: మూడు దశాబ్దాలుగా ఏక పక్ష వార్తలతో ఈనాడు సాగిస్తున్న ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఏర్పడిన పత్రిక ఒకటి.. తెలంగాణ ఉద్యమ సమయంలో.. ఆంధ్రా మీడియా తెలంగాణ వాదాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లలేకపోతోందన్న ఉద్దేశంలో పుట్టుకొచ్చిన పత్రిక మరొకటి. కారణం ఏదైనా.. ఆ రెండు పత్రికలు ఇప్పుడు రెండు ప్రాంతీయ పార్టీల అధీనంలో కొనసాగుతున్నాయి. ఆ రెండు పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాలల్లో అధికారంలో ఉన్నాయి. దీంతో ఆ పత్రికల్లో పనిచేసే ఉద్యోగులు కాస్త భరోసాగా ఉంటున్నారు. కరోనాతో ప్రింట్ మీడియా సంక్షోభంలో కూరుకుపోయింది. కొన్ని పత్రికలు ఉద్యోగులను తగ్గించుకున్నాయి. ఇంకొన్ని వేతనాల్లో కోత విధించాయి. మరికొన్ని ఖర్చు తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టాయి. చిన్న పత్రికలు మూతపడ్డాయి. జాతీయ పత్రికలు సైతం సంక్షోభంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. కానీ, ఇలాంటి సమయంలో కూడా ఈ రెండు తెలుగు పత్రికలు నమస్తే తెలంగాణ, సాక్షి నిలబడ్డాయి. ఇందుకు ప్రధాన కారణం వాటి యాజమాన్యాలు రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉండడమే.

భారీగా వేతనాలు..
పత్రికారంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఈ రెండు పత్రికలు ఉద్యోగులకు భారీగా వేతనాలు ఇస్తున్నాయి. నియామకాలు నిలిపివేశామని బయటకు చెబుతున్నా.. పైరవీ నియామకాలు కొనసాగుతున్నాయి. నమస్తే తెలంగాణలో కరోనా సమయంలో వేతనాలు పెంపు ఆపేశారు. దాదాపు మూడేళ్లు ఉద్యోగుల వేతనాలు పెంచలేదు. పరిస్థితి అర్థం చేసుకున్న ఉద్యోగులు కూడా వేతనాల గురించి అడగలేదు. బయట సంక్షభం ఎదుర్కొంటున్న సమయంలో ఉద్యోగంలో ఉండడమే మేలనుకుని మిన్నకుండిపోయారు. తాజాగా ఈ ఏడాది వేతనాల పెంపుకోసం ఒత్తిడి చేయడంతో 6 నుంచి 10 శాతం ఇంక్రిమెంట్ ఉద్యోగుల మొహాన కొట్టింది యాజమాన్యం. ఇక ఈ పత్రికకు అనుబంధంగా పనిచేస్తున్న టీన్యూస్ ఉద్యోగుల వేతనాలు పెంచకపోవడంతో విధులు బహిష్కరించారు. దీంతో యాజమాన్యం దిగిరాక తప్పలేదు. ఇక సాక్షిలో కూడా పైరవీ కారులకు భారీగా వేతనాలు ముడుతున్నాయి. ఇందులో బహుళ యాజమాన్యంతో పనిచేసే వారికంటే.. పని దొంగలకే ప్రమోషన్లు, ఇంక్రిమెట్లలో ప్రాధాన్యం దక్కుతోంది.
పెద్దల కడుపు నిండాకే.. కిందిస్థాయికి..
ఏదో సినిమాలో ప్రకాశ్‌రాజ్ చెప్పినట్లు.. యాజమాన్యం డిపార్టుమెంట్ల వారీగా ఇంక్రిమెట్ ఇస్తున్నా.. సాక్షిల్లో ఉన్న బహుళ యాజమాన్య విధానంతో డైరెక్టర్లు, హెచ్‌వోడీలు, వారి పైరవీలతో ఉద్యోగాల్లో చేరిన వారికి సరిపడా వేతనం పెంచుకున్నాకే.. కిందిస్థాయి సిబ్బందికి మిగతా బడ్జెట్ పంపిణీ అవుతోంది. దీంతో పైస్థాయిలో ఉన్నవారికి వేల రూపాయల ఇంక్రిమెంట్ పడుతుంటే.. కిందిస్థాయికకి వచ్చేసరికి వందల్లోనే ఉంటుంది. ఇదేంటని అడిగితే హెచ్‌వోడీల పోన్‌స్విచ్ ఆఫ్.
బయటకు వెళ్లిరండని ఉచిత సలహా..
సాక్షిలో ఎడిటోరియల్ హెడ్ ఉద్యోగులకు ఓ ఉచిత సలహా ఇస్తున్నానరట. ‘‘వేతనాలు కాస్త ఎక్కువ పెంచండి సార్.. బయట మా జూనియర్లకు మాకంటే ఎక్కువ జీతాలు వస్తున్నాయి అని మొర పెట్టుకుంటే..’’ మీరూ బయటకు వెళ్లి.. ఆ పేస్లిప్ తీసుకుని మళ్లీ సాక్షిలోకి రండి అని సలహా ఇస్తున్నారట. ఇక పైరవీ కారుల నుంచి నెలనెలా హైదరాబాద్‌లో ఉన్న పెద్దలు మామూళ్లు తీసుకుంటున్నారన్న టాక్ కూడా ఉంది.
రెండేళ్లు ఢోకా ఉండదన్న భరోసాతో..
ఈ రెండు పత్రికల యాజమాన్యాలు రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉండడంతో తమకు మరో రెండేళ్లు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న భావనలో ఉద్యోగులు ఉన్నారట. ఎన్నికల ఏడాది వేతనాల పెంపు కూడా భారీగా ఉంటుందన్న సంకేతాలను యాజమాన్యాలు ఉద్యోగులకు పంపుతున్నాయట.. ఈమేరకు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని సూచిస్తున్నాయని సమాచారం. దీంతో ఉద్యోగులు కూడా భరోసాగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. మిగతా పత్రికల్లో మాత్రం ఉద్యోగాలు ఉంటాయా? ఊడుతాయా అన్న టెన్షన్ కొనసాగుతోంది.

మొత్తంగా అధికార పత్రికల్లో ఉద్యోగుల్లో మరో రెండేళ్లు ఢోకా లేదనే ధీమా కనిపిస్తుండగా, మిగతా తెలుగు దిన పత్రికల ఉద్యోగుల పరిస్థితి మాత్రం ఎప్పుడు రోడ్డున పడతామా అన్నట్లు ఉంది.