Vulture : ఓ కాలికి జీపీఎస్ ట్రాకర్ మరో కాలికి మైక్రో కెమెరా.. తెలంగాణ సరిహద్దుల్లో ఓ రాబందు కలకలం

పురాణ కాలంలో పక్షులను గూడ చర్యం కోసం వినియోగించుకున్నారని పుస్తకాల్లో మనం చదివాం. ఆధునిక కాలంలో ఉత్తరకొరియా, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలు ఇలాంటి పనులు చేయగా మనం చూసాం. ఐతే నేటి కాలంలో..అందులోనూ తెలంగాణ రాష్ట్రంలో ఓ రాబందు సంచారం సంచలనం సృష్టించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 3, 2024 8:25 pm

Vulture

Follow us on

Vulture : ఆ రాబందు భారీగా ఉన్నప్పటికీ బాగా నీరసించిపోయింది. దాని కాలుకు మైక్రో కెమెరా ఉంది. మరో కాలుకు జీపీఎస్ ట్రాకర్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాబందు కనిపించింది. ఐతే దాని పరిస్థితి చూసిన స్థానికులు ఆకలి, దాహం తీర్చడానికి ప్రయత్నించారు. కోడి మాంసం పెట్టారు. నీళ్లు తాగించారు. ఆ తర్వాత ఆ రాబందును అటవీశాఖ అధికారులు తమ వెంట తీసుకువెళ్లారు. చర్ల మండలంలో ఆ రాబందు తిరుగుతోంది. మూడు రోజులుగా ఆ ప్రాంతంలో సంచరిస్తోంది. చర్ల మండలంలోని ఏకలవ్య పాఠశాల గుట్ట ప్రాంతానికి వచ్చింది. చాలా అక్కడే కూర్చుంది. గమనించిన స్థానికులు దానికి కోడి మాంసాన్ని వేశారు. తర్వాత కొంతసేపటికి ఆ రాబందు వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. స్థానికులు దానిని ఫోటోలు తీశారు. దాని కాళ్లకు జిపిఎస్ ట్రాకర్ ఉంది. కెమెరా కూడా ఉంది. ఇటీవల కాలంలో మావోయిస్టులను తుద ముట్టించేందుకు దండకారణ్యంలో కేంద్ర పోలీసులు ముమ్మరంగా జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైన్ల వల్ల ఇప్పటికే చాలామంది కేంద్ర బలగాలు ప్రాణాలు కోల్పోయారు.. అయితే అడవిలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టుల ట్రాప్ లో పడకుండా కేంద్ర బలగాలు సరికొత్త విధానాన్ని పాటిస్తున్నాయి. ఓవైపు డ్రోన్లను ఉపయోగిస్తూ అడవిని జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలోనే రాబందులను కూడా మావోయిస్టుల జాడ పసిగట్టడానికి ఉపయోగిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటవీ గ్రామాలలో కేంద్ర బలగాలు భయానక పరిస్థితులను సృష్టిస్తున్నారని గతంలో మావోయిస్టులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చర్లలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఒక రాబందు ప్రత్యక్షం కావడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాని కాలికి జిపిఎస్ ట్రాకర్, కెమెరా ఉండడం రకరకాల వాదనలకు కారణమవుతోంది. ఈ రాబందును కేంద్ర బలగాలు పంపించాయని కొంతమంది అంటుండగా.. ఎవరు ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని మరికొందరు అంటున్నారు. అయితే ఆ గద్ద మావోయిస్టులు తలదాచుకుంటున్నారని చెబుతున్న ప్రాంతానికి వెళ్లకుండా.. సమీప ప్రాంతాల్లోనే సంచరించడం విశేషం.

ఎవరు ఉపయోగించారు

సాధారణంగా భద్రతా విధుల్లో పక్షులను వినియోగించడం ఇప్పటినుంచో ఉంది. గతంలో ఉగ్రవాదుల కదలికలను తెలుసుకునేందుకు వ్యక్తులకు శిక్షణ ఇచ్చి.. ఉపయోగించుకునేవారు. అయితే చర్ల మండలంలో వారిని రాబందు గురించి పోలీసులకు తెలియడం లేదు. అటవీ పరిశోధనలకు ఏమైనా దీనిని ఉపయోగిస్తున్నారా? లేక రాబందుల జీవన విధానం గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయోగించారా? అనే విషయాలపై ఇంతవరకూ స్పష్టత లభించడం లేదు.