Allu Arjun vs Revanth Reddy : అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు మంగళవారం విచారణకు పిలవడం.. గంటల తరబడి అల్లు అర్జున్ ను విచారించడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీనికంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ శాసనసభలో 15 నిమిషాల పాటు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కేసలాట ఘటన ను ప్రముఖంగా ప్రస్తావించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులను ప్రశ్నించారు. సూటిగా నిలదీశారు. దీనిని ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. ఇదే సమయంలో అల్లు అర్జున్ కు బాసటగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రశ్నిస్తున్నాయి.. మెదక్ పార్లమెంట్ సభ్యుడు, బిజెపి నాయకుడు రఘునందన్ రావు ఈ వ్యవహారంపై సూటిగా తెలంగాణ పోలీసులకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రశ్నలు సంధించారు. ప్రజా పాలన అని చెబుతున్న రేవంత్ రెడ్డి.. ఈ విషయాలను గనుక పాటించి ఉంటే కచ్చితంగా అది రాజనీతి అనిపించుకునేదని ఆయన స్పష్టం చేశారు.
రఘునందన్ రావు ఏమన్నారు అంటే..
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత బిజెపి ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలను ఆయన లేవనెత్తారు. ” ప్రతిపక్ష పార్టీల నాయకులను ప్రివెన్షన్ ఆఫ్ అరెస్టు చేస్తారు.. అంటే ముందస్తుగానే మాకు సమాచారం ఇచ్చి.. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని చెప్పి పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తారు. ఒకవేళ అల్లు అర్జున్ అనుమతి తీసుకోకపోతే పోలీసులు కూడా సంధ్య థియేటర్ లోపలికి రానివ్వకుండా చేయాల్సి ఉండేది. ఒకవేళ అల్లు అర్జున్ నిబంధనలు అతిక్రమిస్తే అతడిని అక్కడే అరెస్టు చేయాల్సి ఉండేది. పోలీసులలోనూ కొంతమంది అల్లు అర్జున్ కు అభిమానులు ఉన్నట్టున్నారు. హీరో థియేటర్లకి రాగానే స్వాగతం పలికారు. పోలీసులు కూడా ఈ స్థాయిలో గొడవ జరుగుతుందని ఊహించి ఉండరు.. జరిగింది ఘోరం కాబట్టి.. ఈ ఘటనకు అల్లు అర్జున్ కూడా నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇక శ్రీతేజ కుటుంబానికి 25 లక్షలు ఇచ్చాం.. మేము మాత్రమే పరామర్శించాం.. అని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. ఇదే ఉదారత గురుకులాలలో కలుషిత ఆహారం తిని చనిపోయిన విద్యార్థుల విషయంలో.. సాగులో అప్పులు ఎక్కువై చనిపోయిన రైతుల విషయంలో చూపించి ఉంటే బాగుండేది. ప్రభుత్వం కేవలం అల్లు అర్జున్ విషయంలో మాత్రమే రాజనీతి ప్రదర్శిస్తుంది. ఒక సినీ నటుడి కోసం ముఖ్యమంత్రి గారు 15 నిమిషాల పాటు శాసనసభ సమయాన్ని వృధా చేశారు. ఈ విషయాన్ని కాస్త పక్కన పెట్టి మిగతా సమస్యలపై కూడా దృష్టి సారిస్తే బాగుంటుంది. అప్పుడు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజనీతిని ప్రదర్శిస్తుందని అనుకుంటామని” రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యల తాలూకూ వీడియోను అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. సరిగ్గా అడిగావు అంటూ రఘునందన్ రావు పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
BJP M.P @RaghunandanraoM Garu.!#StopCheapPoliticsOnALLUARJUN pic.twitter.com/cfiEhZhLws
— ™ (@AASoldier_Alex) December 24, 2024