https://oktelugu.com/

Mohan babu vs Manoj : తాగుబోతు మనోజ్..నీకు జన్మనిచ్చి పాపం చేశానురా అంటూ బోరున విలపించిన మోహన్ బాబు..వైరల్ అవుతున్న ఆడియో!

ఈరోజు చేసిన రచ్చ ని నేను జీవితం లో మర్చిపోలేను. ఒకప్పుడు ఎంత మంచివాడిగా ఉండేవాడివి. ఇప్పుడు త్రాగుడికి బానిసై, నీ భార్య చేతిలో తోలుబొమ్మ లాగా ఆడుతున్నావు. నీకు జన్మనిచ్చాను రా, ఈరోజు నా గుండెల మీద తన్నావు' అంటూ చెప్పుకొచ్చాడు.

Written By:
  • Vicky
  • , Updated On : December 10, 2024 / 10:16 PM IST

    Mohan babu vs Manoj

    Follow us on

    Mohan babu vs Manoj : మంచు మోహన్ బాబు తన కుటుంబం లో చోటు చేసుకున్న వివాదాల గురించి కాసేపటి క్రితమే ఒక సంచలన ఆడియో ని రికార్డు చేసి మీడియా కి వదిలాడు. సాయంత్రం సమయంలో మనోజ్ మోహన్ బాబు ఇంటికి దూసుకొచ్చి, నా కూతురిని వదలండి అంటూ గేట్లు బద్దలు కొట్టుకొని లోపలకు దూసుకెళ్లాడు. ఈ ఘటన జరిగిన తర్వాత బయటకొచ్చిన మోహన్ బాబు ని మీడియా రిపోర్టర్స్ ప్రశ్నించగా , వాళ్లపై మండిపడుతూ, బూతులు తిట్టి మోహన్ బాబు ఆవేశం తో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన కాసేపటికి ఆయన మీడియా లో ఆడియో ని విడుదల చేసాడు. ఈ ఆడియో లో మనోజ్ పై, అతను ఇంట్లో ప్రవర్తిస్తున్న తీరుపై మోహన్ బాబు విలపించాడు. నీకు జన్మనిచ్చి పాపం చేసానురా అంటూ ఆయన రోదించాడు. ఇప్పుడు ఈ ఆడియో సోషల్ మీడియా లో సంచలనం రేపుతోంది.

    ఇంతకీ ఆ ఆడియో లో ఏముందంటే ‘అరేయ్ మనోజ్..ఎంత పని చేసావురా..ఇంట్లో అందరికంటే నిన్నే ఎంతో గారాభం చేసి పెంచాను. అందరికంటే నీకే ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి చదివించాను. నువ్వు ఏది కోరితే అది ఇచ్చాను. కానీ నువ్వు ఈరోజు నా పరువుని బజారుకి లాగావు. నీ వల్ల మీ అమ్మ ఆరోగ్యం కూడా చెడిపోయింది. ఆమె ఇప్పుడు ఆసుపత్రి పాలైంది. ఎందుకు రా మా మీద ఇంత పగబట్టావు. నీ బిడ్డ మా దగ్గర ఉంది, వచ్చి తీసుకొని పో అన్నాను, లేకపోతే రెండు మూడు రోజుల తర్వాత మీ అమ్మ ఆ బిడ్డని తీసుకొస్తుంది అన్నాను, కానీ నువ్వు ఈరోజు చేసిన రచ్చ ని నేను జీవితం లో మర్చిపోలేను. ఒకప్పుడు ఎంత మంచివాడిగా ఉండేవాడివి. ఇప్పుడు త్రాగుడికి బానిసై, నీ భార్య చేతిలో తోలుబొమ్మ లాగా ఆడుతున్నావు. నీకు జన్మనిచ్చాను రా, ఈరోజు నా గుండెల మీద తన్నావు’ అంటూ చెప్పుకొచ్చాడు.

    ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఆస్తి పంపకం ముగ్గురికి సమానంగా పంచాలా వద్దా అనేది నా ఇష్టం రా, అది నా కష్టార్జీతం. నేను స్థాపించింది విద్యాసంస్థ కాదు, ఒక దేవాలయాన్ని స్థాపించాను. ఎన్నో వేల మంది అక్కడ విద్యని అభ్యసించి గొప్పగొప్ప ఐఏఎస్ లు, ఐపీఎస్ లు అయ్యారు. 25 శాతం కులాలకు, మతాలకు అతీతంగా ఉచిత విద్య ని అందించాము. మీ అన్న ఆ విద్యాసంస్థలను విదేశాల్లో ఉన్న యూనివర్సిటీలకు లింకప్ చేసి ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు. అలాంటి విద్యాసంస్థల మీద పడ్డావు కదరా. మీడియా మిత్రులకు కూడా చెప్తున్నాను, నా బిడ్డ నన్ను కొట్టాడు అని మీకు ఇష్టమొచ్చినట్టు రాస్తున్నారు. నా బిడ్డ నాపై చెయ్యి ఎత్తలేదు’ అంటూ మోహన్ బాబు రికార్డు చేసిన ఈ ఆడియో ఇప్పుడు సంచలనం గా మారింది. పూర్తి ఆడియో ని మీరు కూడా విని మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.