Mohan babu vs Manoj : మంచు కుటుంబం లో వివాదం వేరే లెవెల్ కి వెళ్తుంది. గంట గంటకు ఈ వివాదం కొత్త మలుపులు తీసుకుంటూ ఒక యాక్షన్ సినిమాని తలపిస్తుంది. ఈరోజు ఉదయం మంచు విష్ణు దుబాయి నుండి ఇంటికి తిరిగొచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే ఆయన మంచు మనోజ్ ని, ఆయన భార్య ని బయటకు నెట్టేశాడు. మంచు మనోజ్ ఇంటి బయటే బైఠాయించి నిరసన వ్యక్తం చేయగా, సాయంత్రం మోహన్ బాబు కొడుకులిద్దరినీ కూర్చోబెట్టి వివాదాన్ని ముగించే ప్రయత్నం చేసాడు. కానీ వాళ్ళ మధ్య సయోధ్య కుదరలేదు. ఇద్దరు తగ్గకపోవడం తో మోహన్ బాబు కి కోపం వచ్చి ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపొమ్మని మంచు మనోజ్ ని ఆదేశించాడట. మళ్ళీ జీవితం లో నీ ముఖం నాకు చూపించొద్దు అంటూ గట్టిగా అరిచాడట. దీంతో మంచు మనోజ్ తన సామాగ్రి మొత్తాన్ని సర్దుకొని మూడు వాహనాలలో తరలించి ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవడానికి సిద్దమయ్యాడు.
అయితే మనోజ్ కూతురు మాత్రం లోపల మోహన్ బాబు వద్దనే ఉండిపోయింది. దీంతో తన కూతుర్ని తీసుకెళ్లడానికి మంచు మనోజ్ తిరిగి రాగ, మోహన్ బాబు ఇంటి గేట్ వద్ద ఉన్న సెక్యూరిటీ ఆయన్ని లోపలకు రానివ్వదు. ‘లోపల నా కూతురు ఉందయ్యా..గేట్లు తియ్యి’ అని మనోజ్ గట్టిగా అరిచినా సెక్యూరిటీ ఆయన మాటలను లెక్కచేయదు. ఇదంతా అక్కడున్న మీడియా మొత్తం చిత్రీకరిస్తుంది. పలు మీడియా చానెల్స్ అయితే లైవ్ కవరేజ్ కూడా ఇస్తుంది. ఎంత చెప్పినా సెక్యూరిటీ గేట్స్ తెరవకపోవడంతో ఆగ్రహించిన మనోజ్, గేట్లను బద్దలు కొట్టుకొని లోపలకు దూసుకెళ్లిపోయాడు. మోహన్ బాబు కూడా అతనితో వారించడానికి బయటకి వచ్చాడు. ఈ హీట్ మూమెంట్ లో ఒక ప్రముఖ మీడియా ఛానల్ రిపోర్టర్ మోహన్ బాబు వద్దకు వెళ్లి ‘సార్ చెప్పండి’ అని మైక్ పట్టుకొని వెళ్తాడు.
దీంతో ఆగ్రహించిన మోహన్ బాబు మైక్ ని లాక్కొని ‘ఏంట్రా చెప్పేది..ఏంటి నీ అమ్మ’ అంటూ రిపోర్టర్ ని కొడుతాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. నాలుగు గోడల మధ్య సామరస్యంగా చర్చించుకొని వివాదాలను ముగించుకోకపోగా, ఇంట్లో సమస్యలను వీధిలో పెట్టి, మీడియా రిపోర్ట్స్ వచ్చినప్పుడు మోహన్ బాబు అదుపు తప్పిన కోపంతో కొట్టడం పై పలువురు నెటిజెన్స్ సోషల్ మీడియా లో తప్పుబట్టారు. వ్యక్తిగత వ్యవహారం పబ్లిక్ డొమైన్ లో పెట్టినప్పుడు మీడియా కచ్చితంగా రియాక్ట్ అవుతుంది. దానికి ఇన్నేళ్ల అనుభవం ఉన్న మోహన్ బాబు ఇలా అదుపు తప్పి రిపోర్టర్స్ తో ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మాట్లాడుతున్నారు. మరోపక్క వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాల గురించి మీడియా కి ఎందుకు, అవతల అంత బాధపడుతూ నా కూతురుని వదలండి అని మనోజ్ అంటుంటే దానిని కూడా వీడియో తీయడం ఏమిటి అని మరికొంతమంది మీడియా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
High Tension at Manchu House in Jalpally.#ManchuManoj tried to enter the house, but denied by security over there.
గేటు బద్దలు కొట్టిన మనోజ్ & బౌన్సర్స్… pic.twitter.com/R9ATgOaND8
— Gulte (@GulteOfficial) December 10, 2024
మీడియా పై దాడికి పాల్పడ్డ మోహన్ బాబు pic.twitter.com/jP88QpZFmp
— Telugu Scribe (@TeluguScribe) December 10, 2024