Trolls On KCR: సోషల్ మీడియాలో వెర్రి వెయ్యి తలలు వేస్తున్న నేటి కాలంలో చిన్నపాటి ఆ సంఘటన జరిగిన సరే ట్రోలర్స్ తమ బుర్రకు పదును పెడతారు. తన పైత్యానికి రకరకాల రూపాలు అద్దుతారు. ఎదుటివారిని కించపరుస్తూ వీడియోలు రూపొందిస్తారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ పైశాచికానందాన్ని పొందుతుంటారు. ఇప్పుడు ట్రోలర్స్ కు చేతినిండా పని దొరికింది. తెలంగాణ రాజకీయాలలో ఏర్పడిన సంచలనం వారికి పని కల్పించింది.
Also Read: అలా సస్పెండ్.. ఇలా దహనం.. కవిత మీద ఇంత ఆగ్రహమా? తెర వెనుక ఉన్నది ఎవరు?
గులాబీ పార్టీ నుంచి తన కూతుర్ని అధినేత సస్పెండ్ చేశారు. నిన్న ఆమె నీటిపారుదల శాఖ మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడిపై విమర్శలు చేశారు. ఓ బడా కాంట్రాక్టు సంస్థపై కూడా నోరు పారేసుకున్నారు. ఆమె వ్యాఖ్యలకు మీడియా విపరీతమైన ప్రాధాన్యమిచ్చింది.. ఇది సహజంగానే గులాబీ పార్టీకి డ్యామేజ్ చేసింది. త్వరలోనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కవిత చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టించాయి. ఇవి ఎంతవరకు దారి తీస్తాయో తెలియదు కానీ.. ఇప్పటికైతే గులాబీ పార్టీకి కొంతలో కొంత బీటలు మాత్రం వాలాయి.
ఇదే అంశం ఆధారంగా సోషల్ మీడియాలో ట్రోలర్స్ రెచ్చిపోయారు. బీభత్సంగా వీడియోలను రూపొందించడం మొదలుపెట్టారు. అందులో ఒక వీడియో మాత్రం ప్రస్తుతం కెసిఆర్ కుటుంబంలో నెలకొన్న పరిస్థితికి అచ్చు గుద్దినట్టు సరిపోతోంది. బహుళ ప్రజాదరణ పొందిన ఓ సినిమాలో కూతురు నిర్వాకం వల్ల తండ్రి ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనకు నచ్చని వ్యక్తిని ఆ కూతురు ప్రేమిస్తుంది. అతడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. కూతురు అంటే విపరీతమైన ప్రేమ ఉన్న ఆ తండ్రి ఆమె మాట కాదనలేడు. దీనికి తోడు ఆమె ప్రేమించిన వ్యక్తి మరొక అమ్మాయిని ఇష్టపడుతుంటాడు. అది ఆ తండ్రికి ఇబ్బందికరంగా మారుతుంది. పైగా తాను నచ్చిన అమ్మాయిని ఆ వ్యక్తి పెళ్లి చేసుకుంటాడు. అంగరంగ వైభవంగా ఇంటికి వస్తుండగా..ఆ తండ్రిలో కోపం కట్టలు తెంచుకుంటుంది.. ఇందులో భాగంగానే శత్రువులు ఎక్కడో ఉండరు.. కూతుళ్లు, చెల్లెళ్ల రూపంలో తిరుగుతూ ఉంటారు. అనే డైలాగ్ ఆ తండ్రి నోటి వెంట నుంచి వస్తుంది.. ఇప్పుడు డైలాగు ను గులాబీ పార్టీ పెద్దకు వర్తిస్తుందని ట్రోలర్స్ పేర్కొంటున్నారు.
KCR Bapu right now in farmhouse… pic.twitter.com/4WghOHxsdP
— Bhagyanagar Bidda (@Vaanara_) September 1, 2025