MLC Kavitha: బాబు చొరవతోనే కవితకు బెయిల్‌.. తెరవెనుక మంత్రాంగం నడిపిన నేతలు..!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో 165 రోజులు జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగస్టు 27న విడుదలయ్యారు. ఈ కేసులో సుప్రీం కోర్టు కవితకు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే కవిత బెయిల్‌పై తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు టీడీపీ కూడా చేరింది.

Written By: Raj Shekar, Updated On : August 30, 2024 9:42 am

MLC Kavitha(7)

Follow us on

MLC Kavitha: దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ ఈ ఏడాది మార్చి 15న అరెస్టు చేసింది. 165 రోజులపాటు ఆమె తిహార్‌ జైల్లో ఉన్నారు. జైల్లో ఉండగానే ఏప్రిల్‌ 11న సీబీఐ కూడా అరెస్టు చేసింది. దర్యాప్తు సంస్థలు చెండూ ఆమెనూ కస్టడీలోకి తీసుకుని విచారణ చేశాయి. చార్జిషీట్లు దాఖలు చేశాయి. కవిత బెయిల్‌ కోసం ప్రత్యేక కోర్టుతోపాటు, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించడంతో బెయిల్‌ రాలేదు. చివరకు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కవిత పిటిషన్‌పై ఆగస్టు 27న విచారణ జరిపిన ధర్మాసనం.. బెయిల్‌ మంజూరు చేసింది. అయితే బెయిల్‌ మంజూరుపై తెలంగాణలో రాజకీయం దుమారమే రేగింది. బెయిల్‌ రావడానికి బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కే కారణమని సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆరోపించారు. మనీశ్‌ సిసోడియా, కేజ్రీవాల్‌కు రాని బెయిల్‌ కవితకు అందుకే వచ్చిందని పేర్కొన్నారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కూడా కవితకు బెయిల్‌ రావడానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఒప్పందంలో భాగమే అన్నారు. అక్కడ బెయిల్, ఇక్కడ రాజ్యసభ ఎంపీ సీటు ఒకే రోజు వచ్చాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ ఆరోపణలను బీఆర్‌ఎస్‌ నాయకులు ఖండించారు. తాజగా రేవంత్‌ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు కూడా మండిపడింది. ఈ క్రమంలో ఇప్పుడు కవితకు బెయిల్‌ రావడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కారణమన్న విషయం తెరపైకి వచ్చింది.

వెనకున్నది బాబే..
అయితే కవిత బెయిల్‌ వెనుక చంద్రబాబు ఉన్నారన్న వార్తలు కూడా బయట గుప్పుమంటున్నాయి. చంద్రబాబుతో కలిసి బీజేపీ పెద్దలతో కేటీఆర్‌ లాబీయింగ్‌ చేయించారని అంటున్నారు. కేంద్రంలో చంద్రబాబు ప్రస్తుతం కీలకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుతో చెప్పిస్తే బెయిల్‌ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నందున బీఆర్‌ఎస్‌ నేతలు తెరవెనుక ఆయన మద్దతు తీసుకున్నారని సమాచారం. కవిత అనారోగ్యం దృష్ట్యా, మహిళ అన్న సెంటిమెంట్‌ కారణంగా చంద్రబాబు కూడా ఆమె పట్ల సానుకూలంగా వ్యవహరించినందునే బెయిల్‌ వచ్చిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలను కూడా బీఆర్‌ఎస్‌ నేతలు ఖండిస్తున్నారు. కవితది తప్పుడు కేసు అన్న విషయం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యల్లో స్పష్టంగా తెలుస్తోందని పేర్కొంటున్నారు.

ఒక తాను ముక్కలే..
ఇదిలా ఉంటే.. చంద్రబాబు, కేసీఆర్‌ ఒక తాను ముక్కలే. వీరి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌ నుంచే మొదలైంది. ఇక టీడీపీలో ఇద్దరూ కలిసి పనిచేశారు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా టీడీపీ నుంచి వచ్చిన లీడరే. ఈ నేపథ్యంలో పాత స్నేహం.. కూతురు అనారోగ్యం, ఇతర కారణాల దృష్ట్యా కేసీఆర్‌ కూడా చంద్రబాబుతో మాట్లాడినట్లు తెలుస్తోంది. కారణం ఏదైతేనేం. కవిత మాత్రం బయటకు వచ్చింది. దీంతో బీఆర్‌ఎస్‌ నేతలు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు.